అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today March 1st: సీతే రాముడి కట్నం సీరియల్: సూర్య డ్రగ్స్ కేసు నుంచి తప్పించమని మహాలక్ష్మిని అడిగిన సీత.. మధుమితని మార్చే ప్రయత్నంలో జలజ!

Seethe Ramudi Katnam Serial Today Episode తన బావని డ్రగ్స్ కేసు నుంచి తప్పించమని సీత మహాలక్ష్మిని అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode తన బావ సూర్యని పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారని సీత తన మహాలక్ష్మి వాళ్లకి చెప్తుంది. దీంతో మహాలక్ష్మి వాళ్లు షాకైనట్లు మాట్లాడుతారు. ఆ విషయం తమకు ఎందుకు చెప్పావని అడుగుతారు. మీ నాన్న ఎస్‌ఐ కదా ఆయనకు చెప్పలేకపోయావా అని మహాలక్ష్మి అడుగుతుంది.

సీత: సూర్య బావని అరెస్ట్ చేసింది మా నాన్నే ఈ కేసులో ఏం చేయలేం అని తేల్చి చెప్పేశారు. 
అర్చన: అరెరే పెద్ద చిక్కే వచ్చి పడిందే..
జనార్థన్: ఇలాంటి కేసుల్లో ఎవరూ ఏం చేయలేరు..
సీత: అందరూ ఆ మాటే అంటున్నారు మామయ్య మా అక్కకి ఎవరూ హెల్ప్ చేయడం లేదు. మామతో చెప్తే మిమల్ని అడగమన్నారు అత్తయ్య. మీరు తలచుకుంటే మా అక్కకి సాయం చేయగలరు.
మహాలక్ష్మి: నేను మాత్రం ఏం చేయగలను సీత.. నా చేతుల్లో ఏముంది.
సీత: మీకు పెద్దపెద్దవాళ్లతో పరిచయం ఉంది అంట కదా.. మామ చెప్పారు. 
మహాలక్ష్మి: హా అవును. నాకు మినిస్టర్లు, ఐజీలు అందరూ తెలుసు.. అయితే..
సీత: మీరు వాళ్లతో ఒక్క మాట చెప్తే మా బావని వదిలేస్తారు కదా అత్తయ్య.
మహాలక్ష్మి: కచ్చితంగా వదిలేస్తారు. నా మాట ఎవరూ కాదు అనలేరు. 
సీత: అయితే మా బావని వదిలేయమని వాళ్లతో చెప్పండి అత్తయ్య.
మహాలక్ష్మి: చెప్పడానికి నాకు ఏ ప్రాబ్లమ్‌ లేదు. కానీ ఇలాంటివి నేను ఫోన్‌లో కాదు డైరెక్ట్‌గా చెప్పాలి. ఇప్పుడు నేను మీ పల్లెటూరు వెళ్లి మీ అక్క కనీళ్లు తుడిచానే అనుకో చూసిన వాళ్లు ఏమనుకుంటారు. 
అర్చన: ఏమనుకుంటారు మహా మొన్న పేపర్‌లో మధుమిత ఫొటో వచ్చింది కదా అందరూ నీ కోడలే అనుకుంటారు.
గిరిధర్: కోడలి కోసం అత్త దిగి వచ్చిందని అందరూ అనుకుంటారు. 
జనార్థన్: వాళ్లందరికీ మహాలక్ష్మి ఏం సమాధానం చెప్తుంది. కోడలు కాదు కోడల్ని చేసుకోవాలి అనుకున్నాను అని చెప్తుందా..
మహాలక్ష్మి: అది కదా ప్రాబ్లమ్.. ఇప్పుడు నువ్వు చెప్పు ఏం చేయాలో..  మీ అక్క విషయంలో మీ నాన్న కల్పించుకోకుండా నేను కల్పించుకుంటే అందరూ మీ అక్క నా కోడలే అనుకుంటారు. రామ్ భార్య మధుమిత అంటారు.  ఈ విషయాన్ని మీడియా ఇంకా పబ్లిసిటీ చేస్తుంది. ఆ వార్త విని తట్టుకునే శక్తి నీకు ఉంటే చెప్పు నేను రెడీ..
సీత: మీ మాటలు వింటుంటే మా అక్కని ఇంకా మీ కోడల్ని చేసుకోవాలి అని మీకు ఉందని అనిపిస్తుంది. అవకాశం దొరికింది కదా అని ఆడుకోవాలి అని చూస్తున్నట్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అలా ఆలోచిస్తారు అని అనుకోలేదు. మీ ఉద్దేశం తెలిశాక నాకు మీ సాయం అవసరం లేదు. నాకు తోచిన పని నేను చేస్తాను. 
జనార్థన్: ఏంటి మహా నువ్వు సూర్యని అరెస్ట్ చేయించింది మధుని ఒంటరిని చేసి మన ఇంటికి తీసుకురావడానికి కదా.. మరి సీత మన సాయం వద్దు అంటుంది. 
అర్చన: సీత వేరే ప్లాన్ వేసి సూర్యని బయటకు తీసుకొస్తే నువ్వు వేసిన ప్లాన్ వేస్ట్ అవుతుంది కదా మహా. 
మహాలక్ష్మి: సీత ఎంత ట్రై చేసినా సూర్యని బయటకు తీసుకురాలేదు. నేను వెయ్యబోయే స్టెప్ ఎవరూ ఊహించలేరు. సీతతో కాసేపు ఆడుకోవాలి అనే అలా చెప్పాను. అయినా నాకు ఇప్పుడు హెల్ప్ అడగాల్సింది సీత కాదు మధుమిత. 

జలజ: మధు నువ్వు ఎంత ఆలోచించినా ఇక్కడ నీకు సాయం చేసేవాళ్లే లేరు మధు. నీకు సాయం చేస్తాను అన్న మీ నాన్న కూడా చేతులెత్తేశాడు. డ్రగ్స్ కేసు అంటే చిన్న విషయం కాదు. ఈ కేసులో సూర్య బయట పడాలి అంటే ఎవరో పెద్ద వాళ్లే సాయం చేయాలి. ఇలాంటి టైంలో నిన్ను సాయం చేయాలి అంటే ఒక్కరే ఉన్నారు.
మధు: ఎవరు అక్క.
జలజ: మహాలక్ష్మి గారు. వెంటనే ఫోన్ చేయ్..
మధు: ఇలాంటి విషయాలు ఆవిడతో చెప్పడం వద్దు అక్క. బాగోదు.
జలజ: ఏం కాదు మధు.. నువ్వు అడిగితే తను ఏమైనా చేస్తుంది. ఉండు నేనే మేడంకి కాల్ చేస్తా..
మహాలక్ష్మి: నేను చెప్పానా మధుమిత నుంచి నాకు కాల్ వస్తుంది అని చెప్పానా వచ్చింది. మధు ఏదో కష్టాల్లో ఉన్నావని తను అంటుంది ఏమైంది మధు.
మధు: సూర్య  అరెస్ట్ అయ్యాడు అండీ. 
మహాలక్ష్మి: వాట్ ఎందుకు ఏం జరిగింది.. మధు మొత్తం చెప్తుంది. 
మధు: ఎవరికి హెల్ప్ అడగాలో అర్థం కాలేదు అండీ..
మహాలక్ష్మి: ఏంటి మధు.. నాతో చెప్పాలి కదా.. నువ్వు ఎవరు నా ఇంటి మనిషివి. సరే నాతో చెప్పేశావ్ కదా నీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. 
జలజ: మహాలక్ష్మి గారు ఏమన్నారు మధు.
మధు: ఆవిడి నాకు హెల్ప్ చేస్తాను అన్నారు అక్క.
జలజ: నాకు తెలుసు తప్పకుండా చేస్తారు అని కాబోయే కోడలివి కదా.. 
మధు: ఏంటక్కా అన్నావ్..
జలజ: అంటే ఆవిడ నిన్ను కోడల్ని చేసుకోవాలి అనుకున్నారు కదా అంది అన్నాను. 
మహాలక్ష్మి: ఇక ఇప్పుడు నా గేమ్ స్టార్ట్ చేస్తా.. మధుని నా కోడల్ని చేసుకోవడానికి, సీతని ఈ ఇంటి నుంచి గెంటేయడానికి సీతకి షాక్ ఇవ్వబోతున్నాను. 

ఇక సీత మహాలక్ష్మి చేతులెత్తేసింది అని జరిగింది అంతా చెప్తుంది. ఇక సీత మహాలక్ష్మిని తిడితే రామ్ సీతని తిడతాడు. సీతకి రేవతి, చలపతి కూడా వత్తాసు పలుకుతారు. రామ్ మాత్రం మహాలక్ష్మిని వెనకేసుకుంటాడు. ఇక సీత మీ పిన్నికి నాకు సాయం చేసే మనసు లేదని మా అక్కని కోడలిగా చేసుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తుంది అని అంటుంది. దానికి రామ్ మా పిన్ని అంత దారుణంగా ఆలోచించదని అంటాడు. పిన్ని గురించి నెగిటివ్‌గా చెప్పొద్దని అంటాడు. ముగ్గురూ ఎందుకు నన్ను పొల్యూట్ చేస్తున్నారని రామ్ అడుగుతాడు. ఇక సీత రామ్‌ని మహాలక్ష్మి దగ్గరకు తీసుకెళ్తుంది. ఇక రామ్ తన పిన్నిని పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read:  ‘జగధాత్రి’ సీరియల్‌ మార్చి 1st: దివ్యాంక నుంచి పెన్ డ్రైవ్ తీసుకున్న ధాత్రి, పోలీసులు రావడంతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget