అన్వేషించండి

Jagadhatri Serial Today March 1st: ‘జగధాత్రి’ సీరియల్‌: దివ్యాంక నుంచి పెన్ డ్రైవ్ తీసుకున్న ధాత్రి, పోలీసులు రావడంతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్

Jagadhatri Today Episode: ధాత్రి ప్లాన్ చేసి దివ్యాంక నుంచి పెన్ డ్రైవ్ తీసుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: ధాత్రి ప్లాన్‌ ప్రకారం నిషికను వంట దగ్గర సెట్ చేస్తుంది. తమ ప్లాన్‌ వర్కవుట్‌ అయ్యిందని మరో ప్లాన్‌ సక్సెస్‌ చేద్దామని వెళ్లిపోతారు. బయటకు వెళ్లిన కేదార్‌, ధాత్రి.. దివ్యాంకకు ఫోన్‌ చేసి మినిస్టర్‌ గారి కొడుకు చెప్పాడని పెన్‌డ్రైవ్‌ కోసం డబ్బులు ఇస్తానని చెప్పారని మీరు కలిస్తే డబ్బులు ఇస్తామని పెన్‌డ్రైవ్‌ తీసుకుని రావాలని కేదార్‌ గొంతు మార్చి  చెప్తాడు. దీంతో మొత్తం డబ్బుల ఇస్తారా? అని దివ్యాంక అడుగుతుంది. మొత్తం ఇవ్వాలని చిన్నసార్‌ చెప్పారనడంతో దివ్యాంక హ్యాపీగా ఫీలవుతుంది. నేను ఇప్పుడే పెన్‌డ్రైవ్‌ తీసుకుని వస్తానని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తుంది. కేదార్‌, ధాత్రి ఒకచోట దివ్యాంక కోసం ఎదురు చూస్తుంటారు.

కేదార్‌: ధాత్రి టైం అయిపోతుంది. దివ్యాంక ఫంక్షన్‌ నుంచి బయలుదేరి కూడా చాలా సేపు అయ్యింది కదా? డౌట్‌ వచ్చింది అంటావా?

ధాత్రి: డౌట్‌ రావాలంటే మైండ్‌ పనిచేయాలి కదా కేదార్‌. మనం డబ్బులిస్తామన్నప్పుడే దివ్యాంకకు బుర్ర పనిచేయడం ఆగిపోయింది. ( దివ్యాంక కారు వస్తుంది.) మన అతిథి మర్యాదల కోసం వస్తుంది. రెడీ అవ్వు

అంటూ ఇద్దరూ మాస్క్‌ వేసుకుంటారు.  దివ్యాంక వచ్చి నాతో ఫోన్‌లో మాట్లాడింది మీరేనా అని అడగ్గానే అవునని చెప్తారు. డబ్బెక్కడ అని దివ్యాంక అడుగుతుంది. ధాత్రి వెళ్లి డబ్బులున్న బ్యాగ్‌  తీసుకొచ్చి దివ్యాంక ముందు పెడుతుంది. డబ్బులు చెక్‌ చేసుకుని పెన్‌డ్రైవ్‌ ఇస్తుంది దివ్యాంక. తర్వాత కేదార్‌ కూడా పెన్‌డ్రైవ్‌ చెక్‌ చేసుకుని సరే అనడంతో దివ్యాంక డబ్బు తీసుకుని వెళ్లబోతూ కేదార్‌ జేబులో ఫోన్‌ వీడియో రికార్డు చేయడాన్ని గమనిస్తుంది.

దివ్యాంక: ఆగండి…

కేదార్‌: ధాత్రి డౌట్‌ వచ్చినట్లుంది వెళ్దాం పద.

దివ్యాంక: హలో నేను మీతోనే మాట్లాడుతున్నాను. ఎవరు మీరంతా? ఎందుకొచ్చారు. అసలిదంతా రాఘవ చెప్తేనే జరుగుతుందా? లేదా నాతో గేమ్స్‌ ఆడుతున్నారా?

ధాత్రి: చెప్పాం కదా మేడం మినిస్టర్‌ కొడుకే పంపిచాడని

దివ్యాంక: అయితే జరిగిందంతా రికార్డు చేయమని రాఘవే చెప్పాడా?

అనగానే ధాత్రి, కేదార్‌ షాక్‌ అవుతారు. నేను మీడియానే నాతోనే గేమ్స్‌ ఆడుతున్నారా? అంటూ దివ్యాంక కేదార్‌ ఫోన్‌ అడుగుతుంది. ధాత్రి ఫోన్‌ ఇవ్వు అంటూ కేదార్‌కు చెప్తుంది. ఫోన్‌ తీసుకున్న దివ్యాంక చెక్‌ చేసి ఏమీ లేదని చెప్పి ఫోన్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు ఫంక్షన్‌లో కౌషికి కేదార్‌, ధాత్రిలను వెతుకుతుంది. వైజయంతిని ధాత్రి, కేదార్‌ల గురించి అడుగుతుంది కౌషిక. నిషిక కూడా దివ్యాంక కోసం వెతుకుతుంది. దివ్యాంక కనిపించిందా అని నిషక కూడా వైజయంతిని అడుతుంది. ఇంతలో దివ్యాంక బ్యాగుతో రావడం చూసి నిషికి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. తర్వాత చెప్తాను పద అంటూ నిషికను రూంలోకి తీసుకెళ్తుంది దివ్యాంక. కౌషికి వాళ్లను గమనిస్తుంది.

నిషిక: దివ్యాంక ఈ బ్యాగు ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు.

దివ్యాంక: పెన్‌డ్రైవ్‌తో బిజినెస్‌ చేశాను నిషిక ఈ బ్యాగు నిండా కోట్ల రూపాయల డబ్బు ఉంది. ఆ పెన్‌ డ్రైవ్‌ నువ్వు ఇచ్చావు కాబట్టి ఇందులో నీకు కూడా షేర్‌ ఉంది.

అంటూ దివ్యాంక చెప్పగానే నిషిక ఎగ్జైటింగ్‌ గా ఫీల్‌ అవుతుంది. నవ్వు ఆ ధాత్రి వాళ్లు కనిపించకపోతే మళ్లీ ఏం గొడవ జరుగుతుందోనని భయపడ్డాం అని నిషిక అనడంతో దివ్యాంక అక్కడకు వచ్చింది కేదార్‌, ధాత్రి వచ్చారా? అని అనుమానిస్తుంది. దాని మొఖం కోటి రూపాయలు ఒక్కసారి కూడా చూడలేదు. ఇంత డబ్బు ఎలా తీసుకొస్తుంది అంటూ నిషిక అంటుంది. ఇంతలో వైజయంతి వచ్చి టైం అవుతుందని చెప్పడంతో అందరూ బయటకు వస్తారు. ఎంగేజ్‌మెంట్‌ జరుగుతుంటే.. కౌషికి భాధపడుతూ కూర్చుని ఉంటుంది. అక్క అలా ఉంటే  చూడలేకపోతున్నాను ధాత్రి ఏదైనా చెయ్యి ప్లీజ్‌ అంటాడు కేదార్‌. ధాత్రి కౌషికి దగ్గరకు వెళ్తుంది.

ధాత్రి: వదిన మీకు సర్‌ప్రైజ్‌ చేద్దామని చెప్పలేదు. కానీ ఇప్పుడ మీ బాధ చూడలేక చెప్తున్నాను. ఈ ఎంగేజ్‌మెంట్‌ జరగదు వదిన

కౌషికి: ఎంటి జగధాత్రి నువ్వు చెప్పేది.

అని అడగ్గానే అవును వదిన ఇంకో పది నిమిషాల్లో నువ్వు ఎప్పుడూ ఊహించనిది ఇక్కడ జరుగుతుంది అని ధాత్రి చెబుతుంది. ఇంతలో దివ్యాంక, సురేష్‌ రింగ్స్‌ మార్చుకుంటుంటే కౌషికి నావల్ల కాదు నేను వెళ్లిపోతున్నాను అంటూ వెళ్లిపోతుంటే ఇంతలో పోలీసులు వచ్చి ఎంగేజ్‌మెంట్‌ ఆపుతారు. మీరు పెన్‌డ్రైవ్‌ ఇచ్చి కోటి రూపాయలు  ఇంటికి తీసుకొచ్చారని మాకు ఇన్‌ఫర్మేషన్‌ ఉంది అనడంతో దివ్యాంక షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: విష్వక్ సేన్ గామి ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయిన 'కల్కి' ప్రభాస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget