Seethe Ramudi Katnam Serial Today March 19th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్ తల్లి సుమతే తమ మేనత్త అని తెలుసుకున్న సీత, మధులు.. చెమటలు పట్టేసిన మహాలక్ష్మి!
Seethe Ramudi Katnam Serial Today Episode రామ్ కన్న తల్లి సుమతే తన తండ్రి చెల్లెలని సీత, మధుమితలు తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode సీత పని మనిషి రాజ్యం మాటలను మధుమిత వింటుంది. తర్వాత సీత మధు దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలి అని అంటే మధుమిత ఇంట్రస్ట్ చూపించదు. అయినా సీత మధుమితను ఆపి రాజ్యం, తాను మాట్లాడుకున్న మాటలు విని రాజ్యాన్ని కొట్టడం నువ్వు చూశావని మధుతో సీత అంటుంది.
మధుమిత: నేనేం చూడలేదు.
సీత: నువ్వు రూం బయట ఉండి అంతా చూడటం నేను చూశాను. ఎందుకు అక్క తప్పించుకొని తిరుగుతున్నావ్. రాజ్యం అన్న మాటలకు నీకు కోపం రాలేదా. రాజ్యాన్ని కొట్టాలి అనిపించలేదా..
మధు: తను మీ పని మనిషి నేను ఎలా కొడతాను.
సీత: ఏ మనిషి అయినా మనం తప్పు చేయకుండా అంటే ఖండించాలి కదా. రాజ్యాన్ని నేను కాకుండా నువ్వే వచ్చి కొడతావేమో అనుకున్నాను. నీ గురించి వీధిలో తప్పుగా మాట్లాడింది ఎవరూ అని నిలదీస్తావు అని అనుకున్నాను. ఏం తెలినట్లు, ఏం ఎరగనట్లు వెళ్లిపోయావు ఎందుకు అక్క. చూడక్క మామ గురించి ఇక్కడ ఎవరు తప్పుగా మాట్లాడినా నేను అనుమానించను. ఎందుకు అంటే ఆయన ఏంటో నాకు తెలుసు. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. కానీ నీ సంగతి అలా కాదు. ఇప్పటికే సూర్య బావ నీ మీద కోపంగా ఉన్నాడు అని తెలిసింది. ఇక్కడ చెప్పుడు మాటలు సూర్య బావ చెవి దాకా చేరితే నీ పరిస్థితి ఏంటి. బావకు నీ మీద ఇంకా కోపం రాదా.. రేపు బావ రిలీజ్ అయితే నువ్వు అక్కడికి వెళ్లాల్సిన దానివి. బావతోనే కలిసి ఉండాల్సిన దానివి.
మధు: అంటే సూర్యని నేను మర్చిపోయాను అని అంటున్నావా..
సీత: ఇది నా అత్తారిల్లు అని గుర్తుచేస్తున్నాను. ఇక్కడ నువ్వు ఎక్కువ రోజులు ఉండటం మంచిది కాదు అని చెప్తున్నాను.
మధు: నేను నీకు ఏం చెడు చేశాను సీత. నా వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి.
సీత: నష్టం నాకు కాదు అక్క నీకు. నీ వల్ల నాకు చెడు జరగదు మా అత్తయ్య వల్ల నీకు చెడు జరుగుతుంది.
మధు: ఆవిడ నాకు ఏం చెడు చేస్తుంది.
సీత: మనుషులతో వాళ్ల మనసులతో ఆడుకోవడం మహాలక్ష్మి గారికి వెన్నతో పెట్టిన విద్య. నీ బలహీనత ఆవిడకు బలంగా మారుతుంది. నీ పరిస్థితిని ఆవిడ అలుసుగా తీసుకుంటుంది.
మధు: ఇలాంటి విషయాలు నాతో చెప్పొద్దు అని రామ్‌గారు నీకు చెప్పారు కదా. నువ్వు మారిపోయావ్ సీత. అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావ్.
సీత: నేను ఊహించుకోవడం లేదు అక్క. నేను ఈ మాటలు నీతో ఎందుకు అంటున్నానో నీకు తెలుసు. ఒక చెల్లిగా అక్కతో ఇంతకన్నా ఏం చెప్పలేను.
మధు: ఏదో ఒకటి చెప్పి నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకుంటున్నావ్. అంతే కదా..
సీత: నీకు ఇంతే అర్థమైందా.. నేను ఈ ఇంట్లో మా అత్తగారితో కంటికి కనిపించని యుద్ధం చేస్తున్నాను అక్క. నా కాపురం నిలబెట్టుకోవడానికి పోరాడుతున్నాను. మా మధ్యలోకి నువ్వు అడ్డుగా వస్తే నన్ను ఓడించడానికి మా అత్తగారు నిన్ను అడ్డం పెట్టుకుంటే మన అక్కాచెల్లెల్ల బంధం తెగిపోతుంది. నువ్వు ఈ ఇంట్లో ఉండటం ముఖ్యం కాదు. సూర్య బావని ఎలా రప్పించాలా బావ దగ్గరకు ఎప్పుడు వెళ్లాలా అని ఆలోచించు. దయచేసి నువ్వు మహాలక్ష్మి గారిని నమ్మొద్దు. నీ చెల్లిని నమ్ము. నిన్ను బావ దగ్గరకు పంపించే బాధ్యత నాది. సరేనా. నిన్ను బాధ పెట్టుంటే సారీ అక్క.
మధు: సీత చెప్పేది నిజమా.. లేక మహాలక్ష్మి గారు గురించి సీత అబద్ధం చెప్తుంది అని రామ్ గారు చెప్పింది నిజమా.. మహాలక్ష్మి గారిని చూస్తే అలా అనిపించడం లేదు. మరి సీత ఎందుకు ఇలా చెప్తుంది. ఒకవేళ రామ్ గారు నా వైపు వచ్చేస్తారు అని సీత భయపడుతుందా.
మహాలక్ష్మి: ఏంటి అలా ఉన్నావ్ ఏమైంది.
మధు: నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అండి. నన్ను కన్న తల్లిదండ్రులు, నా చెల్లులు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్య అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు. నేను ఇక్కడ ఉండటం సీతకు అస్సలు ఇష్టం లేదు. పదే పదే వెళ్లిపోమని చెప్తుంది. నా గురించి రామ్ గారి గురించి వీధిలో అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు అంట. నేను చేసిన తప్పు ఏంటి అండి..
మహాలక్ష్మి: అదే నాకు అర్థం కావడం లేదు మధు. నువ్వు చేసిన తప్పు ఏంటి.
మధు: ఇక్కడికి వచ్చాను అని మా అమ్మానాన్నలు తిట్టారు. సీత తిడుతుంది. నిన్న సూర్య తిట్టాడు. నేను అనవసరంగా ఇక్కడికి వచ్చానా అనిపిస్తుంది.
మహాలక్ష్మి: అలా ఎప్పుడు అనుకోవద్దు మధు. అయినా మీ నాన్నకు నీ మీద ఎందుకు అంత కోపం.
మధు: ఏం చెప్పమంటారు అండీ. అప్పుడెప్పుడో మా అత్త మా నాన్నని ఎదురించి ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుంది అంట. అప్పుడు మా నాన్న పరువు పోయింది అంట. అప్పటి నుంచి మా నాన్న కోపం పెంచుకొని మా నానమ్మని ఏడిపిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నాను అని మా అత్తయ్య మీద కోపాన్ని నా మీద చూపిస్తూ నన్ను ఏడిపిస్తున్నారు. నేనేం చేసినా మా నాన్నకి తప్పుగా అనిపిస్తుంది. నన్ను శత్రువులా చూస్తున్నారు. ఆరోజు మా అత్తయ్య ఆ పని చేసుండకపోయి ఉంటే నాకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు.
మహాలక్ష్మి: మీ అత్తయ్య ఎక్కడుంటున్నారు.
మధు: తెలీదు అండీ. చాలా రోజుల నుంచి వాళ్లకి కాంటాక్ట్ లేదు.
మహాలక్ష్మి: మధు మీ అత్తయ్య ఫొటో నీ దగ్గర ఉందా..
మధు: ఉందండి మొన్న మా ఇంటికి వెళ్లినప్పుడు మా నానమ్మ రూంలో ఫోటో చూసి ఫోన్‌లో ఫొటో తీసుకున్నాను.
సీత: అక్క మన అత్తయ్య ఫొటో నీ ఫోన్‌లో ఉందా.. ఒకసారి చూపించు..
మహాలక్ష్మి: సీత ఇప్పుడు మీ అత్తయ్య ఫోటో ఎందుకు.
సీత: ఆ విషయం మీకు ఎందుకు. అక్క నువ్వు ఫొటో చూపించు.
మహాలక్ష్మి: సీత నేను మధుతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నా నువ్వు తర్వాత చూడు. సీత ఫొటో చూసి షాక్ అయిపోతుంది. ఈ ఫొటో..
మధు: మన అత్తది సీత. మన నాన్న చెల్లెలు. మన మేనత్త సుమతిది.
సీత: ఈ ఫోటో మామ తల్లిది
రామ్: ఏమంటున్నావ్ సీత.. ఇది మా అమ్మ ఫొటో..
సీత: ఇది మా అత్తయ్య ఫొటో అండి. మీ అమ్మ మా మేనత్త మా నాన్న చెల్లులు.
మహాలక్ష్మి: ఏమంటున్నావ్ సీత. మా అక్క సుమతి మీకు మేనత్తా నేను నమ్మలేకపోతున్నా...
మధు: నిజమే అండి ఈవిడ మా మేనత్త. ఎవర్నో ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
జనార్థన్: మీ అత్తయ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవర్నో కాదమ్మా నన్నే. మీ అత్తయ్య కొడుకే ఈ రామ్.
రేవతి: అయితే సీత బయటి మనిషి కాదు ఈ ఇంటి మనిషే.
చలపతి: అవును అండీ దేవుడు నా రూపంలో ఈ బావమరదళ్లకు ముడి వేశాడు.
జనార్థన్: నిన్ను చూసినప్పుడే నాకు అనిపించింది సీత నీకు సుమతికి ఏదో కనెక్షన్ ఉందని. నా కోడలివి మాత్రమే కాదు నా మేనకోడలివి కూడా.
మహాలక్ష్మి: మధు కూడా మన మేనకోడలే జనా. మన సుమతి కోడలు..
అర్చన: సుమతి అక్క ఇక్కడ లేకపోయినా తన ఇద్దరు మేనకోడళ్లు ఇక్కడికి చేరుకున్నారు అన్నమాట.
గిరిధర్: సుమతి వదిన ఎంతో పుణ్యం చేసుకుంది అందుకే తను చనిపోయి కూడా తన మేనకోడల్ని ఇంటికి రప్పించుకుంది.
రామ్: నాకు చాలా హ్యాపీగా ఉంది సీత. నువ్వు నన్ను మామ అని పిలుస్తుంటే బావ అని పిలిపించుకోవాలి అని నాకు ఉండేది. ఇప్పుడు నేను నీకు నిజంగానే బావని..
మహాలక్ష్మి: సీతకి మాత్రమే కాదు రామ్ మధు కూడా నీ మరదలు.
సీత: మామయ్య అత్తయ్య మా గురించి మీకు ఎప్పుడూ చెప్పలేదా..
జనార్థన్: లేదమ్మ మీ గురించి ఎప్పుడు అడిగినా మీ అత్త మాట దాటేసేది.
సీత: అత్తయ్య ఎలా చనిపోయింది మామయ్య.
మహాలక్ష్మి: అందరం హ్యాపీగా ఉన్నాం కద సీత ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు.
సీత: నాకు తెలుసుకోవాలి అని ఉంది. మీరు చెప్పండి మామయ్య.
జనార్థన్: మీ అత్తయ్య తీర్థయాత్రలకు అని వెళ్లిందమ్మ. అక్కడ ప్రమాదం లో చనిపోయింది శవం కూడా దొరకలేదు.
సీత: అంటే మా అత్తయ్య మరణం ఓ మిస్టరీ అన్న మాట. మా అత్తయ్యే తన చెల్లి అని తెలిస్తే మా నాన్న ఎంతో సంతోషిస్తారు. వెంటనే మానాన్నకి చెప్పి నాన్న నేను కలిసి మా అత్తయ్య మర్డర్‌ని ఛేదిస్తాం. మా అత్తయ్యది సహజ మరణం కాకపోతే ఆ హంతకుల పని పడతాం.
ఇందతా మహాలక్ష్మి కల ఇలా జరగకూడదు అని అనుకుంటుంది. ఇక సీత, రామ్‌లు బయటకు బయల్దేరుతారు. మహాలక్ష్మి మీద నుంచి చూస్తుంటుంది. అది చూసిన సీత కాలు బెనికి నట్లు నటిస్తుంది. దీంతో రామ్ సీత కాలు పట్టుకుంటాడు. ఇక రామ్ సీత చెప్పడంతో సీతని ఎత్తుకొని బయటకు తీసుకెళ్తాడు. అది చూసి మహాలక్ష్మి రగిలిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: తల్లి గుట్టు రట్టు చేసిన ఉలూచి పాము.. సుమనను చంపేస్తానన్న నయని!