Seethe Ramudi Katnam Serial Today March 18th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత, మిధున క్యారెక్టర్ల వెనక పెద్ద ప్లానే.. ఇంగ్లీష్‌కి ఒకరు.. ఎంజాయ్‌కి ఒకరు..!
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ అంతు చూడటానికే సీత మిధునలా నటించడం అందుకు రేవతి కిరణ్‌లతో పాటు ముఖర్జీ సాయం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode ఇన్ని రోజులు మిధున అచ్చం సీతలా ఉందని ఇద్దరూ ఒకటేనా వేరు వేరా అని చాలా క్యూరియాసిటీ ఉండేది. నిన్న జరిగిన మిధున భర్త్‌డే వేడుకలో ఆ ఉత్కంఠకి తెర దిగింది. ముఖర్జీ కూతురు మిధునకు సీతకు కాస్త దగ్గర పోలికలు ఉండటంతో సమయానికి మిధున ఫారిన్ నుంచి ఇండియా రాకపోవడంతో ముఖర్జీ వాళ్లు సీతనే మోడ్రన్ మిధునలా మార్చేశారు.
మహాలక్ష్మీ వెళ్లు వెళ్లిపోయిన తర్వాత సీత ముఖర్జీ వాళ్లకి థ్యాంక్స్ చెప్తుంది. మీ కూతురి పేరు ఇచ్చారు.. సొంత కూతురిలా చూసుకుంటున్నారు.. నా కోసం ఇంత చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్తుంది. సీత తన అత్తారింట్లో గొడవల బయటకు రావడంతో సీత, రామ్‌లు కలవడం కోసం ముఖర్జీ వాళ్లు సీతకి సపోర్ట్ చేస్తారు. ఇక సీత రేవతి ఇంటికి వెళ్తుంది. కిరణ్, రేవతిలు సీతతో పల్లెటూరి సీతలా మోడ్రన్ మిధునలా అదరగొడుతున్నావ్ అని చెప్తారు. సీత ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పి తన చెవికి ఉన్న బ్లూటూత్ తీసి రేవతి పిన్ని ఈ బ్లూటూత్ వల్ల నాకు ఇంగ్లీష్ ఏం మాట్లాడాలో చెప్తుందని ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్తుంది. రేవతి, కిరణ్‌లు సీత ధైర్యాన్ని పొగిడేస్తారు.
మహాలక్ష్మీ మీద పోరాటం ఆపొద్దని నీ రాముడిని చేరేవరకు యుద్ధం ఆపొద్దని చెప్తారు. మీ సాయంతో మహాలక్ష్మీ అత్తయ్యకి చుక్కలు చూపిస్తానని సుమతి అత్తమ్మని చంపిన వాడిని పట్టుకొని శిక్ష వేయిస్తాను అప్పటి వరకు నా యుద్ధం ఎక్కడా ఆగదు అని సీత అంటుంది. ఉదయం సీత, మిధునల గురించి ఇంట్లో అందరూ మీటింగ్ పెడతారు. ఇద్దరూ ఒకేలా ఉన్నా ప్రవర్తనలు వేరని మిధునని పొగుడుతూ సీతని తిడుతుంటారు. రామ్ కిందకి వచ్చే టైంకి గౌతమ్ సీత బురద నీరు, దిష్టి బొమ్మ అని మిధున సరస్సు అంటూ గొప్ప గొప్ప వాటితో పోలుస్తాడు. అందరూ సీతని తక్కువ చేసి మిధునని ఆకాశానికి ఎత్తేస్తారు. సీత ఓ దరిద్రం అంటే రామ్ పెళ్లి ఓ దరిద్రం అని అర్చన అంటుంది. దాంతో రామ్ ఆపండి పిన్ని.. సీతని ఎందుకు చులకన చేస్తున్నారు.. ఎవరికీ ఉన్న విలువ వాళ్లకి ఉంటుందని అంటాడు. మిధునని హైలెట్ చేయడానికి సీతని తక్కువ చేయకండి అని అందరికీ వార్నింగ్ ఇస్తాడు.
రామ్ బ్రోకి సీత అంటే కోపం అనుకుంటే ప్రేమ కూడా ఉందా అని గౌతమ్ అంటాడు. దానికి జనార్థన్ భార్యని భర్త గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు ఇంకెప్పుడు సీతని తక్కువ చేయొద్దని చెప్పి వెళ్లిపోతారు. సీత విషయంలో రామ్, బావగారు ఇద్దరూ పాజిటివ్‌గా ఉన్నారు అంటే సీత మళ్లీ ఇంటికి వచ్చేస్తుందని అర్చన అంటుంది. సీత మిధునలా డబుల్ రోల్ చేయడం లేదు కదా అర్చన అంటుంది. గౌతమ్ కూడా అదే చెప్తాడు. ఇక మహాలక్ష్మీ కూడా తనకు అదే అనుమానం ఉందని అందుకే సీఐ త్రిలోక్‌కి విషయం చెప్పి ఎంక్వైరీ చేయిస్తున్నామని అంటుంది.
సీతకు ముఖర్జీ కారు ఇస్తారు. సీతని కారులోనే వెళ్లమని చెప్తారు. బయట కూడా నువ్వు మిధున లానే ఉండాలి అని ఎవరీకీ ఏం అనుమానం రాకుండా చూసుకో అని చెప్పి సీతకి కారు ఇచ్చి పంపిస్తారు. సీత డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంది. త్రిలోక్ తన టీమ్‌తో కలిసి కార్లు, బైక్‌లు చెక్ చేస్తుంటారు. అటుగా సీత ముఖర్జీ తనకు ఇచ్చిన కారులో ఆ చెక్ పోస్ట్ దగ్గరకు వస్తుంది. సీత త్రిలోక్‌ని చూసి షాక్ అయిపోతుంది. ఆయన తనని ఈ కారులో గెటప్‌లో చూస్తే దొరికిపోతానని అనుకుంటుంది. ఏం చేయాలా అని చాలా టెన్షన్ పడుతుంది. త్రిలోక్ సీత కారు దగ్గరకు వస్తుంటారు. దాంతో సీత కారులోనే గెటప్ మార్చేసి ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది. రేవతి ఫోన్‌లో చెప్తుంటే సీత అవే చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

