Seethe Ramudi Katnam Serial Today June 21st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మిని రఫ్పాడించేసిన విద్యాదేవి.. సుమతి గురించి తెలుసుకున్న మహా తన చేతులతోనే చంపేస్తానంటూ శపథం!
Seethe Ramudi Katnam Serial Today Episode సుమతి పూనినట్లు విద్యాదేవి మహాలక్ష్మి చేసిన తప్పులు ఎత్తి చూపుతూ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode సీత అవతారం చూసి అందరూ షాక్ అవుతారు. దాంతో సీత తాను లాయర్ అని ఫ్యూచర్‌లో జడ్చి అవుతాను అని అంటుంది. ఇంతలో మహాలక్ష్మి పిచ్చి పట్టిందా అని సీతని తిడుతుంది. సీత వేసుకున్న కోటు ఎవరు ఇచ్చారని అడుగుతుంది. దానికి రామ్ అది తన ఆఫీస్ కోటు అని చెప్తాడు.
అర్చన: లాయర్ కోటుకు ఆఫీస్ కోటుకు తేడా తెలీదు. మళ్లీ నువ్వు లాయర్‌వి అవుతావు జడ్జి అవుతావా.
సీత: మరి మీకు మాత్రం జయంతికి వర్ధంతికి తేడా తెలుసా. సుమతి అత్తమ్మ బతికే ఉందని మా టీచర్ అంటున్నారు. సుమతి అత్తమ్మ బతికే ఉంటే అది ఓ అద్భుతం మా టీచర్ బుర్రలో ఆ ఆలోచన పుట్టింది కాబట్టి ఈ రోజు సుమతి అత్తమ్మ జయంతి. అంటే అత్తమ్మ పుట్టిన రోజు.
మహాలక్ష్మి: పిచ్చి పిచ్చిగా వాగకు. ఆవిడ తానా అంటే నువ్వు తందానా అనడం.
సీత: చూస్తుంటే సుమతి అత్తమ్మ బతికి ఉండటం మీకు ఇష్టం లేనట్లుంది. అత్తమ్మ ప్రాణాలతో తిరిగి వస్తే చంపేస్తారా ఏంటి.
రామ్: అవేం మాటలు సీత. అమ్మ నిజంగా ప్రాణాలతో ఉంటే తిరిగి వస్తే అందరికీ మంచిదే కదా.
జనార్థన్: అయినా సుమతి ప్రాణాలతో లేదు. తిరిగి రాదు ఇది మీరిద్దరూ అర్థం చేసుకోవాలి.
సీత: సరే మామయ్య మీరు అత్తమ్మ చనిపోయింది అంటున్నారు. మా టీచర్ బతికే ఉండొచ్చని అంటున్నారు ఒకవేళ నిజంగా అత్తమ్మ బతికి ఉండి ఇక్కడికి వచ్చి ఈ తంతు చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఒకసారి చేద్దాం.
మహాలక్ష్మి: సుమతిలా ఎవరు రియాక్ట్ అవుతారు.
సీత: మా టీచర్. అత్తమ్మలా మా టీచర్ నటిస్తుంది.
మహాలక్ష్మి: సుమతి గురించి ఆవిడకు ఏం తెలుసు అని మాట్లాడుతుంది.
విద్యాదేవి: సీరియస్‌గా మహాలక్ష్మిని చూసి.. నాకు ఏం తెలీదు అనుకోకు మహాలక్ష్మి. నాకు అంతా తెలుసు. నా విషయంలో నువ్వు ఏం చేశావో నాకు మొత్తం తెలుసు. స్నేహితురాలిగా నా జీవితంలోకి వచ్చావు. నువ్వు దీనస్థితిలో ఉంటే నా ఇంట్లో చోటు ఇచ్చి కూడు గుడ్డా ఇచ్చాను. నిన్ను నా సొంత చెల్లిలా అనుకున్నాను. నిన్ను నమ్మి నా భర్త పిల్లల్ని ఇంటిని ఆస్తిని నీ చేతుల్లో పెట్టి వెళ్లాను. కానీ నువ్వేం చేశావ్ నాకు ద్రోహం చేశావ్. తీరని అన్యాయం చేశావు. నమ్మించి మోసం చేశావు.
రేవతి: సుమతి వదిన టీచర్ గారికి పూనిందేమో.
విద్యాదేవి: కారు ప్రమాదం జరిగితే అందులో నేను చచ్చానో బతికానో నువ్వు సరిగా నిర్ధారించుకోలేదు. ఇప్పుడు నాకు వర్ధంతి చేస్తున్నావ్. నాకు ఆత్మ శాంతి చేసే ముందు నీకు అసలు మనస్సాక్షి ఉందా. నేను బతికే అవకాశం ఉందని అని విద్యాదేవి, రేవతి, ఈ చలపతి చెప్తూ ఉంటే నువ్వు ఎందుకు నమ్మడం లేదు. నా కోడలు సీత నా ప్రస్తావన తెచ్చే ప్రతీ సారి నువ్వు ఎందుకు ఇరిటేట్ అవుతున్నావ్. నేను బతికి ఉండటం నీకు సంతోషంగా లేదా. నేను ప్రాణాలతో తిరిగి వస్తే నీకు ఆనందం కలగదా. నేను మళ్లీ వస్తే నీకు సమస్యా. నా స్థానంలో నువ్వు ఉన్నావ్ కానీ నీ స్థానంలో నేను లేను. ఇది నా కుటుంబం. ఇది నా ఇళ్లు. నా ఇంట్లో నా ఫొటోకి దండ వేస్తావా. అది బతికున్న నేను చూస్తూ ఊరుకోవాలా. అంటూ విద్యాదేవి వెళ్లి దండలు విసిరేసి ఫొటో దగ్గర పెట్టిన దీపం అన్నీ విసిరేస్తుంది. ఇక నుంచి ఈ ఇంట్లో నా పుట్టిన రోజు జరగాలి కానీ వర్ధంతి గిర్ధంతి చేశావో ఊరుకునేది లేదు. మైండ్ ఇట్.
విద్యాదేవి ప్రవర్తనకు అందరూ నిజంగా సుమతి ఏమో అనుకొని బిత్తర పోతారు. మహాలక్ష్మిని బెదిరించి విద్యాదేవి పడిపోతుంది. తర్వాత విద్యాదేవి లేచి ఏమైందని అడుగుతుంది. చలపతి మహాలక్ష్మిని బాగా భయపెట్టావని అంటాడు. విద్యాదేవి మహాలక్ష్మికి సారీ చెప్తుంది. మహాలక్ష్మి బ్యాచ్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సీత విద్యాదేవిని లోపలికి తీసుకెళ్లిపోతుంది. అర్చన, మహాలక్ష్మి విద్యాదేవికి సుమతికి మధ్య ఏదో సంబంధం ఉంటుందని అంటుంది. మహాలక్ష్మి వాళ్లు విద్యాదేవి గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. ఇంతలో రౌడీ మహాలక్ష్మికి కాల్ చేసి సుమతి ఆశ్రమంలో ఉండేదని కోమా నుంచి బయటపడి తన వాళ్లని కలవాలి అని వెళ్లిందని ఆశ్రమంలో చెప్పారని చెప్తాడు.
మహాలక్ష్మి: సుమతి బతికే ఉన్నా ఈ ఇంటికి ఎందుకు రాలేదో తెలీదు. ఇంట్లో ఉన్న విద్యాదేవికి సుమతికి సంబంధం ఏంటో తెలీదు. వీలైనంత త్వరగా ఈ రెండు చిక్కుముడులను విప్పాలి.
సీత: ఏంటి అత్తలు మా టీచర్ నటవిశ్వరూపం చూసి భయపడ్డారా. ఇద్దరికీ బాగా చెమటలు పట్టేశాయి. మా టీచర్ మాటలకు ఎందుకు భయపడ్డారు. సుమతి అత్తయ్యే టీచర్‌తో అలా మాట్లాడించిందేమో. టీచర్‌కి సుమతి అత్తయ్య పూనిందేమో. కానీ మీరు భయపడటం మొదటి సారి చూశాను అత్తయ్య. ఇంకోసారి మా టీచర్‌కి పూనకం వస్తే మొత్తం మీరే చెప్పేసేలా ఉన్నారు.
మహాలక్ష్మి: సీత నాకే వార్నింగ్ ఇస్తావా. ఏ విద్యాదేవిని చూసి ఎగిరెగిరి పడుతున్నావో దాని అంతు చూస్తా. ముందు సుమతిని కనిపెట్టి నా చేతులతోనే దాని పీక పిసికి చంపేస్తా.
విద్యాదేవి గార్డెన్‌లో నీళ్లు పోస్తూ తన అన్నయ్య వాళ్లకి క్షేమంగా ఉన్నాను అని చెప్పాలి అనుకుంటుంది. ఇక సాంబకి ఫోన్ అడుగుతుంది. ఇక తాను ఫోన్ చేసినట్లు ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని అంటుంది. విద్యాదేవి ఫోన్‌లో మాట్లాడటం అర్చన చూస్తుంది. అది మహాలక్ష్మికి చెప్తుంది. ఇద్దరూ విద్యాదేవి దగ్గరకు పరుగులు తీస్తారు. విద్యాదేవి తన అన్నయ్యతో మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.