అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today July 9th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తోటి కోడళ్ల మధ్య చిచ్చు పెట్టేసిన సీత.. పెత్తనం కోసం కొట్టుకు చచ్చేలా ఉన్నారే! 

Seethe Ramudi Katnam Serial Today Episode సీత మాటలకు రెచ్చిపోయిన అర్చన మహాలక్ష్మిని ఎదురించి మాట్లాడటంతో ఇవాళ్లి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode సీత అర్చనని రెచ్చ గొడుతుంది. మీకు ఏ విలువ లేదు అని మీకు ఏం కావాలి అన్నా మహాలక్ష్మి అత్తయ్య రికమండేషన్ కావాలి అని వాచ్‌మెన్ సాంబ కూడా మీ మాట వినడం లేదని మీ విలువ జీరో అని అంటుంది. అర్చనకు విలువ లేదని మహా చెంచాలా ఉన్నారని మీకు ఏం లేదని రెచ్చగొడుతుంది. అన్నాదమ్ములు ఇద్దరూ సరిసమానంగా ఉంటే మీ తోటి కోడళ్ల మధ్య ఈ బేధం ఏంటని రెచ్చగొడుతుంది. 

సీత: ఆవిడకు ఎంత అధికారం ఉందో మీకు అంతే ఉండాలి కదా. పైగా ఈ ఆస్తి మొత్తం ఆవిడ సంపాదించింది కాదు. సుమతి అత్తయ్యది కదా. పైగా మీరు గిరిధర్ మామయ్యకు మొదటి భార్య. ఆవిడ జనార్థన్ మామయ్యకి రెండో భార్య. ఈ ఇంట్లో ఆవిడకు ఎంత హక్కు ఉందో మీకు అంతే ఉంటుంది కదా. సుమతి అత్తయ్య తర్వాత ఆ స్థానం మీది కదా ఆవిడకు ఎందుకు అప్పగించారు. ఈ రోజు ఇంటి పనివాళ్లే మీకు గౌరవించపోతే ఎవరూ ఇవ్వరు. ఆవిడని శాసించండి. అప్పుడే మీకు విలువ పెరుగుతుంది. 
అర్చన: అంతే అంటావా.
సీత: అంతే అత్తయ్య. మీరు బానిస కాదు అని నిరూపించండి.
అర్చన: ఇప్పుడే తేల్చుకుంటా. 

అర్చన మహాలక్ష్మి గదికి వెళ్లి మహా చైర్‌లో కూర్చొంటుంది. మహాలక్ష్మి చూసి అడిగితే వాయిస్ తగ్గించ మహా నీ రోజులు అయిపోయాయి. అని ఇక నుంచి నేను నేను బానిసని కాను. నీ గులాంని కాను అని అంటుంది. ఈరోజు నుంచి నాకు అన్నింటిలో నీతో సమానంగా గౌరవం, పెత్తనం అన్నీ కావాలి అంటుంది. 
మహాలక్ష్మి: పిచ్చి ఏమైనా పట్టిందా నీకు.
అర్చన: పిచ్చి నాకు కాదు మహా నీకు. ఆస్తి పిచ్చి అందరూ నీ కాళ్ల దగ్గర ఉండాలనే పిచ్చి అది మానుకో. ఇప్పుడే నువ్వు నాతో కిందకి వచ్చి అందరితో చెప్పు. నేను కూడా నీతో సమానమని అందరూ గౌరవించాలని ముఖ్యంగా పనిమనిషి రాజ్యం, ఆ సాంబలు నేను ఏం చెప్పినా చేయాలి అని చెప్పు. ఇది నేను వేస్తున్న ఆర్డర్. 
మహాలక్ష్మి: అంతేనా.. ఇంకా ఏమైనా ఉందా.
అర్చన: ఈ ఇంట్లో అధికారం అంతా నాకే ఉండాలి. నీతో సహా అందరూ నేను చెప్పేది వినాలి. అలా నువ్వు అందరి ముందు డిక్లర్ చేయాలి. 
మహాలక్ష్మి: చేయకపోతే..
అర్చన: నీ గురించి అందరి గురించి చెప్పేస్తా. నీ ప్లాన్లు, కుట్రలు చెప్తా. సుమతి అక్క బతికే ఉందని చెప్పేస్తా. ఆ నిజం తెలిసినా నువ్వు కావాలనే దాచావని చెప్తా. నీ బతుకు బట్ట బయలు చేస్తా.
మహాలక్ష్మి: ఆగు. ఇన్ని విషయాలు చెప్పావ్. నేను కూడా నీకు ఓ విషయం చెప్పాలి. నన్ను ఎదురించిన వాళ్లని నా గురించి నిజాలు తెలిసిన వాళ్లని నేను వదిలిపెట్టను. చంపేస్తాను. కొన్నేళ్ల క్రితం సుమతి చనిపోయిందన్న కదా ఆ యాక్సిడెంట్ చేయించింది నేనే. 

సీత అర్చనను రెచ్చగొట్టాను ఇద్దరూ కొట్టుకుంటారని చూద్దామని వచ్చేసరికి అర్చన మహాలక్ష్మి కాళ్ల దగ్గర ఉంటుంది. అది చూసి పులిలా వచ్చి పిల్లిలా అయిపోయావ్ ఏంటి అని అడుగుతుంది. సీత అర్చన మాటల్ని మహాలక్ష్మి దగ్గర చెప్తే మహాలక్ష్మి అర్చనను సీరియస్‌గా చూస్తుంది. దీంతో అర్చన సీతతో నన్ను వదిలేయ్‌ అమ్మ అని అంటుంది. ఇక సీతతో మహాలక్ష్మి నీకు రెచ్చగొట్టడం మాత్రమే తెలుసని నాకు తొక్కి పడేయం కూడా తెలుసని అంటుంది. అందరినీ కంట్రోల్‌లో పెట్టినట్లు నన్ను పెట్టలేవు అని సీత అంటుంది. మహాలక్ష్మి దుర్మార్గురాలే అనుకున్నా కానీ హంతకురాలా అని అర్చన భయపడిపోతుంది.  మరోవైపు శివకృష్ణ మార్కెట్ నుంచి వస్తుంటే రౌడీ అయిన్ని చూస్తాడు. శివకృష్ణ సుమతి అన్న కాబట్టి అతన్ని ఫాలో అవ్వాలి అనుకుంటాడు. శివకృష్ణకు ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. చూస్తే రౌడీ దాక్కుండిపోతాడు. లలితకు కూరగాయలు ఇచ్చి విద్యాదేవి నచ్చినవన్నీ చేయమని అంటాడు. ఇంట్లో వాళ్లు అంతా నిన్నూ సుమతి అనుకుంటామని సుమతిలానే నీకు అన్నీ హక్కులు ఉన్నాయని అంటారు.   

సుమతి ఆచూకి తెలీలేదని మహాలక్ష్మి ఆలోచిస్తుంది. ఇంతలో రౌడీ మహాలక్ష్మికి కాల్ చేసి సుమతి శివకృష్ణ ఇంట్లో ఉందని చెప్తాడు. మహాలక్ష్మి కంగారు పడుతుంది. సుమతి తన ఇంటికి రాకుండా అక్కడెందుకుందని సుమతి ప్లాన్ ఏంటని మహాలక్ష్మి ఆలోచిస్తుంది. సీత విద్యాదేవి ఫొటో పట్టుకొని అందరినీ అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: మా నాన్న కార్తీకే: దీపతో శౌర్య .. దీప కోసం నడిరోడ్డు మీద జ్యో, గ్రానీలు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget