Seethe Ramudi Katnam Serial Today February 18th: సీతే రాముడి కట్నం' సీరియల్: జాతర సీన్ రిపీట్.. మహా కొడుకే గౌతమ్ అని తెలుసుకున్న టీచర్.. మహా చాప్టర్ క్లోజ్!!
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ చేసిన కుట్రలతో పాటు గౌతమ్ మహా కొడుకు అని టీచర్ తెలుసుకోవడం ఆమెను చంపడానికి గౌతమ్ పరుగులు తీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీని ఎస్‌ఐ త్రిలోక్ అర్జెంటుగా పోలీస్ స్టేషన్‌కి రమ్మని చెప్తాడు. మహాలక్ష్మీ పరుగులు తీస్తుంది. త్రిలోక్ మహాకి డబ్బులు డిమాండ్ చేస్తాడు. ఎందుకని మహా అడిగితే పెద్ద తిమింగలం దొరికిందని మహా కొడుకు గౌతమ్‌ని చూపిస్తాడు. మహా షాక్ అయిపోతుంది.
మహాలక్ష్మీ: ఎవడు వీడు ఎవడు??
త్రిలోక్: మీ నటన చాతుర్యం నా దగ్గర కాదు మేడం వీడి జన్మ రహస్యం నాకు తెలిసిపోయింది. వీడే స్వయంగా వాడి పుట్టు పుర్వోత్తరాలు నాకు చెప్పాడు.
మహాలక్ష్మీ: వాడు నా కొడుకు అని తెలిసింది రిలీజ్ చేయండి.
త్రిలోక్: ఊరికే వదలడానికి మీ కొడుకు చిన్న కేసులో ఇరుక్కోలేదు. ఈవ్ టీజింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. వీడిని అరెస్ట్ చేయించింది ఎవరో కాదు మీ ఇంట్లో ఉన్న సుమతినే. పైగా తనతో పబ్లిక్ కూడా వచ్చారు. వాళ్లంతా కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్తారంట. మీరు డబ్బు ఇస్తే నేను అంతా సెట్ చేస్తా.
మహాలక్ష్మీ: మీ అకౌంట్‌కి డబ్బు వస్తుంది వాడిని వదిలేయండి.
త్రిలోక్: మీ అమ్మ చెప్పినట్లు విను అమ్మాయిల్ని ఏడిపించకు. కానిస్టేబుల్ కంప్లైంట్‌లో పేరు మార్పించు వేరే వాడిని రేపు కోర్టుకి తీసుకెళ్లాలి.
మహాలక్ష్మీ కొడుకుని తీసుకెళ్లి రోడ్డు మీద కారు ఆపి గౌతమ్‌ని కొడుకుతుంది. బయట నా పేరు ఆపొద్దని చెప్పాను కదా అంటే నాకు ప్రాబ్లమ్ వస్తే నువ్వే సాల్వ్ చేయాలి కదా నన్ను కన్నది నువ్వే కదా అంటాడు. అటుగా వచ్చిన విద్యాదేవి ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. మహాలక్ష్మీ కన్నకొడుకు వీడా.. మహాలక్ష్మీకి జనార్థన్ గారికంటే ముందు వేరే వ్యక్తితో పెళ్లి అయిందా అని షాక్ అయిపోతుంది. డబ్బు కోసమే మీ నాన్నని అడ్డు తొలగించుకొని జనార్థన్‌కి భార్యనై అతని పిల్లలకు తల్లినై పేరు పలుకుబడి సంపాదించుకున్నానని ఒక్కో ఇటుక పేర్చుకొని ఇంత స్థాయికి వచ్చానని ఇప్పుడు సీత, సుమతి వల్ల నరకం అనుభవిస్తున్నాను ఇప్పుడు నువ్వు వచ్చావని కొడుకుని తిడుతుంది. నాకు దూరంగా ఉండమని మహాలక్ష్మీ కొడుకుని అంటే నాకు తెలీదు నేను ఇప్పుడే నీతో ఇస్తానని గొడవ చేస్తాడు. నువ్వు ఎవరో తెలిసిపోతే నన్ను కట్టుబట్టలతో పంపేస్తారు.
సుమతి, సీతలతో కష్టం అని సుమతిని ఎన్‌కౌంటర్ చేయించాలి అనుకున్నానని సీతని రౌడీలతో చంపించాలని అనుకున్నా జరగలేదని అంటుంది. దాంతో విద్యాదేవి అలియాస్ సుమతి బిత్తరపోతుంది. ఇప్పుడే ఇద్దరి గురించి నిజం ఇంట్లో చెప్పాలని అనుకుంటుంది. సుమతిని మహాలక్ష్మీ చూస్తేస్తుంది. ఇంట్లో చెప్పేస్తుంది. దాన్ని పట్టుకొని చంపేయ్ అని కొడుకుకి చెప్తుంది. గౌతమ్ విద్యాదేవి వెనక పరుగులు తీస్తాడు. మహాలక్ష్మీ చాలా టెన్షన్ పడుతుంది. రాత్రి అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే విద్యాదేవి ఆ ఊరేగింపులో కలిసిపోతుంది.
రాత్రి అయింది అందరూ బయటకు వెళ్లారు ఇంకా
ఎవరూ రాలేదని సీత అనుకుంటుంది. రామ్‌కి కాల్ చేసి ఎప్పుడు వస్తారు. ఇంట్లో ఎవరూ లేరు బోర్ కొడుతుందని అంటుంది. పిన్ని, టీచర్ ఉన్నారు కదా అంటే లేరు బయటకు వెళ్లారని చెప్తుంది సీత. గంటలో వస్తామని తినేసి పడుకోమని సీతకి రామ్ చెప్తాడు. గౌతమ్‌కి కనిపించకుండా ఇంటికి వెళ్లిపోవాలని విద్యాదేవి అనుకొని అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఇంతలో పుష్పలో జాతర సీన్ రీ క్రియేట్ చేస్తూ అచ్చం పుష్పరాజ్‌లా చీర కట్టి మేకప్ వేసుకొని గౌతమ్ కత్తితో డ్యాన్స్ చేస్తూ టీచర్ వెంట పడతాడు. గౌతమ్‌ని గుర్తు పట్టిన టీచర్ పరుగులు తీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. భర్తకి అండగా దీప.. సమస్యల ఊబిలో జ్యోత్స్న!





















