Seethe Ramudi Katnam Serial Today February 17th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి చేతిలో పచ్చడైన గౌతమ్.. మహాలక్ష్మీ జుట్టు ఇప్పుడు త్రిలోక్ చేతిలో..!!
Seethe Ramudi Katnam Today Episode గౌతమ్ రోడ్డు మీద ఓ అమ్మాయిని ఏడిపించడం విద్యాదేవి గౌతమ్‌ని కొట్టి అరెస్ట్ చేయించడం గౌతమ్ మహా కొడుకు అని త్రిలోక్ తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode గౌతమ్ రోడ్డు మీద సిగరెట్ తాగుతూ ఓ అమ్మాయిని ఏడిపిస్తాడు. చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తిస్తాడు. చాలా మంది చూస్తారు కానీ ఎవరూ ఏం అనరు. నిన్ను ఎవరూ కాపాడరు అని గౌతమ్ అంటాడు. ఎవరైనా ముందుకు వస్తే చంపేస్తా అని అ అమ్మాయిని బండి ఎక్కించడానికి ప్రయత్నిస్తాడు.
విద్యాదేవి: ఆ అమ్మాయిని వదలరా.
గౌతమ్: నువ్వు ఎవరు.
విద్యాదేవి: నువ్వు పదమ్మా.
గౌతమ్: హలో ఇది నా ఫిగర్ నువ్వు అడ్డు వస్తే చంపేస్తా.
విద్యాదేవి: చెంపలు వాయించి ఫిగర్ ఏంట్రా ఫిగర్. నీకు అమ్మా అక్క చెల్లి ఎవరీ లేరా. ఈ అమ్మాయిని ఏడిపిస్తుంటే చూస్తూ ఉంటారా. అని అక్కడున్న వాళ్లని కూడా తిడుతుంది టీచర్.
గౌతమ్‌ని పోలీసులకు పట్టిస్తానని లాక్కెళ్తుంది విద్యాదేవి. ఆమెతో పాటు కొందరు ఆడవాళ్లు వస్తారు. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే మిగతా వాళ్లు సాక్ష్యం చెప్తారు. కేసు పెట్టడానికి అమ్మాయి భయపడుతుంది. దాంతో గౌతమ్ నవ్వుతూ నా మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఇక్కడ ఎవరికీ లేదని గౌతమ్ విర్రవీగితే విద్యాదేవి కంప్లైంట్ ఇస్తుంది. దాంతో పోలీసులు గౌతమ్‌ని అరెస్ట్ చేస్తారు. మరోవైపు సీత తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుతుంది.
సీత: ఈ మధ్య సుమతి అత్తమ్మ ప్రవర్తన ఏం అర్థం కావడం లేదు నాన్న. ప్రతీ దానికి నాతో గొడవ పడుతుంది.
లలిత: ఏమంటున్నావ్ సీత అత్తమ్మ నీతో గొడవ పడటం ఏంటి తమాషా చేస్తున్నావా.
సీత: లేదమ్మా అత్తమ్మ నాతో మాటి మాటికీ గొడవ పడుతుంది. ఆ మధ్య కొట్టింది కూడా.
లలిత: మాకు తెలిసి సుమతి ఏ తప్పు చేయదు సీత. నువ్వు అలాంటి దానివి కాదు. ఎక్కడో ఏదో జరిగింది.
శివకృష్ణ: ఆ మహాలక్ష్మీ ఏమైనా పుల్లలు పెడుతుందేంటో చూడు.
సీత: లేదు నాన్న ఈ మధ్య మహాలక్ష్మీ అత్తయ్యని ఏం అన్నా నన్నే అంటుంది.
శివకృష్ణ: ఓపికగా ఉండు సీత మీరు గొడవ పడితే మహాలక్ష్మీ లాభపడుతుంది. ఈ విషయం మహాలక్ష్మీకి తెలిస్తే మిమల్ని ఇంకా ఇబ్బంది పెడుతుంది.
లలిత: ఏంటండీ ఇది మొన్న సుమతి ఫోన్ చేసి అలా మాట్లాడింది ఇప్పుడు సీత ఇలా మాట్లాడుతుంది. మనం ఒకసారి వెళ్లి ఇద్దరినీ కూర్చొపెట్టి మాట్లాడుదాం అండీ.
శివకృష్ణ: వెళ్దాం లలిత ఎలాగూ సుమతి అసలు రూపం గురించి ఎంక్వైరీ చేయాలి కదా వెళ్దాం.
త్రిలోక్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి గౌతమ్ గురించి అడుగుతాడు. విషయం తెలుసుకొని త్రిలోక్ సెల్ లోపలికి వెళ్లి ఎవడ్రా నువ్వు అని ప్రశ్నిస్తాడు. త్రిలోక్ గౌతమ్ని కొట్టడానికి కర్ర తీస్తే నా ఒంటి మీద చేయి వేస్తే జాతర అయిపోతుందని అంటాడు. దాంతో త్రిలోక్‌కి కోపం వచ్చి అమ్మాయిల్ని ఏడిపించడం ఫ్యాషన్ అయిపోయిందా అని గౌతమ్‌ని చితక్కొడతాడు. మరోవైపు ముఖర్జీ చెప్పిన మాటలు గురించి మహాలక్ష్మీ వాళ్లు మాట్లాడుకుంటారు. సీతని కాదు కానీ మహాని మళ్లీ ఆఫీస్‌లో కూర్చొపెట్టండి అని అర్చన, గిరి అంటారు. సీత, రామ్ రావడం చూసిన మహా సీతని ఇన్‌ఛార్జిని చేయమని అంటుంది. ఇక విద్యాదేవి డల్‌గా ఇంటికి వచ్చి ఎవరినీ ఏం అనకుండా వెళ్లి నీరు తాగుతుంది.
సీత ఏమైందని ఎందుకు అలా ఉన్నారని అడుగుతుంది. దాంతో అబ్బాయిలు మరీ వెదవల్లా తయార్యారు అమ్మాయిల పట్ల కనీసం మర్యాద లేకుండా తయారయ్యారని. ఓ అమ్మాయిని ఓరోగ్ ఏడిపిస్తే కేసు పెట్టి వచ్చానని అంటుంది. మీరు కాబట్టి కొట్టి కేస్ పెట్టారు. నేను అయితే కాల్చేసేదాన్ని అని మహాలక్ష్మీ అంటుంది. అటు ఇటు తిప్పి సీత దొంగని మహాలక్ష్మీ తప్పించిందని అంటుంది. ఇప్పుడు ఆ గొడవ ఎందుకని రామ్ సీతని తీసుకెళ్తాడు.విద్యాదేవిని జనార్థన్ పొగుడుతాడు. దాంతో అర్చన వాళ్లు బావగారు ఆ సుమతి వైపు వెళ్తున్నారని అంటుంది.
త్రిలోక్ మహాలక్ష్మీకి కాల్ చేసి త్వరగా జైలుకి రమ్మని పిలుస్తాడు. విషయం ఏంటి అని మహాలక్ష్మీ అడిగినా చెప్పకుండా రమ్మని అంటాడు. దాంతో మహాలక్ష్మీ హడావుడిగా వెళ్తుంది. త్రిలోక్ మహాలక్ష్మీకి డబ్బు అడుగుతాడు. మీతో డీల్ చేసుకుంటా నాకు డబ్బు కావాలి అంటాడు. మెకానిక్ దొరికాడా అని మహాలక్ష్మీ అంటే మెకానిక్ చేప అని తనకు తిమింగలం దొరికిందని చూపిస్తాను రండీ అని లోపలికి తీసుకెళ్తాడు. సెల్‌లో గౌతమ్‌ని చూసిస్తాడు. మహాలక్ష్మీ బిత్తరపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. భర్తకి అండగా దీప.. సమస్యల ఊబిలో జ్యోత్స్న!





















