Seethe Ramudi Katnam Serial Today February 15th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత లాంటి మిధున.. ఎంట్రీ ఎప్పుడో.. ఫ్యూచర్ కోసం సీతకి మహా సపోర్ట్.. ముఖర్జీ సీరియస్!
Seethe Ramudi Katnam Today Episode సీతకి కంపెనీ బాధ్యతలు ఇవ్వకుండా విద్యాదేవికి ఇచ్చారని ముఖర్జీ మహాలక్ష్మీ ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత, రామ్‌లు ఉన్న చోటుకే మహాలక్ష్మీ వస్తుంది. రామ్ సీతలు చూసి ప్రశ్నించడంతో డబ్బు వాళ్లకి ఇచ్చేస్తుంది. రామ్ పిన్నిని పొగిడేస్తే సీత మాత్రం లైటర్ దొంగకి మహాలక్ష్మీ అత్తయ్యకు ఏదో సంబంధం ఉందని అందుకే డబ్బు తీసుకొని వచ్చిందని ఆలోచిస్తుంది. మహాలక్ష్మీ బయటకు వెళ్లగానే గౌతమ్ డబ్బు గురించి అడుగుతాడు.
మహాలక్ష్మీ గౌతమ్‌తో రామ్, సీత ఉన్నారని నాకు ఎందుకు చెప్పలేదు అంటుంది. నువ్వు ఫోన్ చేయకుండా ఎందుకు లోపలికి వచ్చావ్ అంటాడు. ఇక గౌతమ్ సీత తనని గుర్తు పట్టిందని చెప్తాడు. డబ్బు గురించి అడిగితే సీత తీసుకుందని.. ఇక నా దగ్గర డబ్బు లేదని చెప్పి మహాలక్ష్మీ వెళ్లిపోతుంది. సీత డబ్బు తీసుకుందని గౌతమ్ రగిలిపోతాడు. ఇంతలో గౌతమ్ లవర్ వచ్చి గిఫ్ట్ కొనమని అడిగితే ఆమెను కొట్టి వెళ్లిపోతాడు. రామ్ సీతతో పార్టీలో ఇబ్బంది పడ్డావు కదా సారీ అంటాడు. దానికి సీత ఇబ్బంది పడినా మీ పిన్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బు ఇవ్వడం సంతోషంగా ఉందని అంటుంది. మోడ్రన్ డ్రస్‌లో అయితే బాగుండేదానివి సీత అని రామ్ అంటే చీరలో ఉన్నానని నన్ను వదిలేస్తావా అని అడుగుతుంది.
అచ్చం సీతలానే ఉందే..
మహాలక్ష్మీ, జనార్థన్‌లకు బిజినెస్ పార్టనర్ ముఖర్జీ తన కూతురు మిధునతో ఫోన్‌లో మాట్లాడుతాడు. మిధున పారెన్‌లో గ్రాడ్యుయేట్ చేస్తుంటుంది. మిధున ఫేస్ కనిపించదు కానీ అచ్చం సీతలా అనిపిస్తుంది. మిధున తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. త్వరలో గ్రాడ్యుయేట్ అయిపోతుందని చెప్తుంది. త్వరలోనే ఇండియాకు రమ్మని చెప్తారు. మిధున త్వరలోనే వస్తుందని సంబంధం వెతుకుదామని అనుకుంటారు.
కుమిలిపోతున్న విద్యాదేవి
సీతని కొట్టినందుకు విద్యాదేవి బాధ పడుతుంది. అన్ని విషయాల్లో తనకు సపోర్ట్‌గా ఉంటున్న సీతకు తనకు గొడవలు వస్తున్నాయని ఆ విషయం అన్నావదినలకు చెప్పాలని ఫోన్ చేస్తుంది. ఎందుకు బాధగా ఉన్నావని లలిత అడుగుతుంది. ఈ ఇంట్లో ఎందుకు ఉన్నానో అర్థం కావడం లేదని తానే సుమతి అని తెలియకుండానే చనిపోతానేమో అని బాధగా ఉందని చెప్తుంది. అలా అనొద్దని లలిత అంటుంది. నా రూపం మరి తిరిగి రాదు కదా అంటే ప్లాస్టిక్ సర్జరీ టైంలో తిరిగిన చోట నీకు సంబంధించిన బలమైన ఆధారాలు ఏమైనా ఉంటాయి వెతుకుదామని అంటాడు. ఎక్కడ నీ ముఖం మారిపోయిందో అక్కడ నుంచే మొదలు పెడదామని అనుకుంటారు.
మహా ఫ్యామిలీతో ముఖర్జీ గొడవ
ముఖర్జీ మహాలక్ష్మీ వాళ్ల ఇంటికి వస్తాడు. జనార్థన్ మహాలక్ష్మీ విద్యాదేవిల మీద అరుస్తాడు. మీ అన్ని బిజినెస్‌లలో నేను పార్టనర్ అని నేను చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి అని కోప్పడతాడు. ఏమైందని అందరూ అడిగుతారు. దాంతో ముఖర్జీ సీత కంపెనీ విషయాలు చూసుకోవాలని చెప్పాను కదా.. నా మాట కాదని మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటారేంటి సీతని తప్పించి ఈ విద్యాదేవిని ఎందుకు అపాయింట్ చేశారని కోప్పడతాడు. సీత చిన్న పిల్ల అని విద్యాదేవి అంటే పని చేస్తూ ఉంటే తానే నేర్చుకుంటుందని ఇంతకు ముందు మహాలక్ష్మీ ఇలా చేసింది ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారా అని అంటే అర్చన గిరిలు మహా చనిపోయిందని విద్యాదేవిని పెళ్లి చేసుకొని కంపెనీ అప్పగించారని అంటారు. ఇక రెండు లక్షలు కోసం సీతతో గొడవ పడతావా నీకు ఏం హక్కు ఉందని ముఖర్జీ కోప్పడతాడు. రామ్ మీద కూడా కేకలేస్తారు. కుటుంబ గొడవలు ఆఫీస్‌కి తీసుకురావొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు.
సీత మీద నింద
సీతే ముఖర్జీకి చెప్పుంటుందని అందరూ సీత మీద నింద వేస్తారు. విద్యాదేవి సీతకి సారీ చెప్తుంది. ఇక అర్చన మహాలక్ష్మీ దగ్గరకు వెళ్లి సీతే చెప్పుంటుంది అని అంటే దానికి మహాలక్ష్మీ తానే స్టాఫ్ ద్వారా ముఖర్జీకి చెప్పించానని అంటుంది. ఫ్యూచర్‌లో ఇవన్నీ తనకు ఉపయోగపడతాయనే ఇలా చేస్తున్నానని మహాలక్ష్మీఅంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని నిజాలు దాస్తావు జ్యోత్స్న.. వారసురాలి గురించి తెలుసుకున్న దశరథ్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

