Seethe Ramudi Katnam Serial Today February 11th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత చెంప పగలగొట్టిన విద్యాదేవి.. మహాకి సపోర్ట్.. ఆఫీస్ డబ్బు తీసేసిన సీత!
Seethe Ramudi Katnam Today Episode సీత మహాలక్ష్మీని పిల్లలు లేని దానివని అనడం విద్యాదేవి సీతని కొట్టడంతో పాటు అందరూ సీతని తట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode ఇద్దరు దంపతులు పాపని తీసుకొచ్చి సీత సుమతి అనే పేరు పెట్టిందని ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయిస్తున్నామని సీతకి చెప్పడానికి వచ్చామని అంటారు. దాంతో మహాలక్ష్మీ అడ్డమైన పేర్లు పెట్టుకొని అడ్డమైన వాళ్లు ఇంట్లోకి వస్తున్నారని మహాలక్ష్మీ అంటుంది. దాంతో సీత ఎవరు అడ్డమైన వాళ్లు అని గొడవ పడుతుంది. దాంతో మహా బ్యాచ్ మొత్తం నీ పుట్టింటి ఖజానా నిండిపోయిందా ఇక్కడ పంచుతున్నావని ప్రశ్నిస్తున్నావ్ అని అడుగుతారు. దాంతో సీత ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. ఇంట్లో గొడవ చూసిన ఆ దంపతులు తాము డబ్బు కోసం రాలేదని దీవెనల కోసం వచ్చామని చెప్తారు. మా కోసం మీరు గొడవ పడొద్దని చెప్పి బయల్దేరుతారు.
సీత: సంస్కారం అంటే అది. చదువు ఆస్తి లేకపోయినా మంచిగా ప్రవర్తించారు. మీరేమో అన్నీ ఉన్నా అడవి మనుషుల్లా ప్రవర్తించారు.
అర్చన: మేం అడవి మనుషులమా ఒళ్లు ఎలా ఉంది సీత.
గిరి: ఎక్కడో పల్లెటూరి నుంచి వచ్చిన నువ్వు సిటీలో పెరిగిన మమల్ని అడవి మనుషులు అంటావా.
సీత: పల్లెటూరిలో పెరిగాను కాబట్టే పద్ధతి ప్రకారం పెరిగాను. మీరేం చేశారు చిన్నపిల్ల చిన్న బుచ్చుకునేలా చేశారు.
మహాలక్ష్మీ: వాగింది చాలు సీత. ఇప్పటికే హద్దు మీరి మాట్లాడావ్.
సీత: పిల్లల్ని కనిపెంచి ఉంటే మీకు ఆ విలువ తెలిసేది. పిల్లలు లేని మీకు ఆ విలువ బాధ్యత ఏం తెలుస్తుంది.
విద్యాదేవి: సీత అని అరుస్తుంది. దగ్గరకు వచ్చి సీత చెంప మీద కొడుతుంది. సీత షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతావా.
మహాలక్ష్మీ: చూశావా జనా సీత నన్ను గొడ్రాలు అంటుంది. సుమతి వెళ్లిపోయాక నీ కోసం పిల్లల కోసం జీవితం త్యాగం చేసిన నన్ను సీత ఎన్ని మాటలు అంటుందో విన్నావా జనా.
గిరి: రామ్, ప్రీతి కోసం పిల్లల్ని వద్దనుకున్న వదినను ఎన్ని మాటలు అంటుంది.
మహాలక్ష్మీ: నేను ఆడదాన్ని కాదా జనా. అమ్మని కాదా. గొడ్రాలినా. అని ఏడుస్తుంది మహాలక్ష్మీ.
సీత: నేను ఆ మాట అనలేదు.
విద్యాదేవి: నువ్వు ఏ అర్థంతో అన్నా సాటి ఆడదాన్ని అలా అనకూడదు సీత.
సీత: నేనేం అనలేదు.
రామ్: సీత ఇంక బుకాయించకు. నువ్వు ఎంతలా అనకపోతే మా పిన్ని అలా బాధ పడుతుంది. పేరుకే తను మా పిన్ని నిజానికి తను మా అమ్మ. నాకు తల్లి లేని లోటు తీర్చిన గొప్ప అమ్మ. అలాంటి అమ్మకి పిల్లల విలువ తెలీదు అంటున్నావా ఇంకోసారి పిన్నిని అలా అంటే బాగోదు సీత. పిన్ని ని అంటే మా అమ్మని అన్నట్లే.
జనార్థన్: ఏదైనా అనే ముందు ఆలోచించుకో సీత. మహా రామ్ వాళ్లకి పిన్ని కాదు అమ్మ. బాధ పడకు మహా పద.
అర్చన: మహా ఈ రోజు నీ వల్ల ఏడ్చింది నీ పాపం ఊరికే పోదు సీత.
గిరి: ఇంటి పెద్ద దిక్కుని ఏడింపించావ్ ఇంతకు ఇంత అనుభవిస్తావ్ సీత.
విద్యాదేవి: కత్తి కంటే మాట చేసే గాయం పదునైంది సీత. నేను కొట్టినందుకు నీకు బాధగా ఉండొచ్చు కానీ మహాలక్ష్మీని నువ్వు అలా అనకూడదు. చాలా పెద్ద మాట అన్నావ్.
సీత: నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలుసు అత్తమ్మా. అందరి ముందు మీ పెద్దరికం నిలబెట్టుకోవడానికి మీరు నన్ను కొట్టుండొచ్చు.
విద్యాదేవి: పెద్దరికమా.
సీత: అవును నా దృష్టిలో మీరు ఇంటి పెద్ద. అలా అని మీరు కూడా మహాలక్ష్మీ అత్తయ్యకు సపోర్ట్ చేస్తే నేను సహించను. మీరు ఆవిడను వెనకేసుకొచ్చి తప్పు చేశారు.
జరిగినదంతా తలచుకొని సీత బాధ పడుతూ పడుకుంటుంది. రామ్ వచ్చి సీతని పిలిచి పట్టుకుంటే సీత బెడ్ మీద నుంచి లేచి వెళ్లిపోతుంది. ఎందుకు అలక అని రామ్ అంటే కావాలనే గొడవ పెట్టుకున్నారని సీత అంటుంది. దాంతో రామ్ మీ టీచర్ నిన్ను కొట్టిందని మా పిన్ని మీద నింద వేస్తున్నావ్ అని అంటాడు. మన ప్రైవసీ టైంలో ఈ గొడవలు ఎందుకు అని సీతని హగ్ చేసుకుంటాడు.
మహాలక్ష్మీ ఒరిజినల్ కొడుకు గౌతమ్ జైలు నుంచి విడుదల అవుతాడు. బయటకు రావడమే ఈ సారి ఏనుగు కుంభస్థలం బద్దలగొట్టి సెటిల్ అయిపోవాలని అనుకుంటాడు. రావడం రావడమే ఓ వ్యక్తి దగ్గర సిగరెట్ తీసుకొని డబ్బు లాక్కొని అతన్ని కొడతాడు. ఇక రామ్ జనార్థన్, విద్యాదేవి ఆఫీస్‌లో ఉంటే సంతోషంగా వెళ్లి మనకు ఈ ఏడాది చాలా లాభాలు వచ్చాయని చెప్తాడు. ఇక సీత రామ్ కోసం క్యారేజ్ తీసుకొస్తుంది. ఇంతలో ఓ వ్యక్తి ఏడుస్తూ తన కొడుకుకి యాక్సిడెంట్ అయిందని అర్జెంట్‌గా డబ్బు కట్టాలని సీతతో చెప్పి ఏడుస్తాడు. జనార్థన్ వాళ్లు కేక్ కట్ చేయించి అందరికీ ఇన్రిమెంట్స్ ఇద్దామని ప్రమోషన్స్ ఇద్దామని అనుకుంటారు. ఇక సీత ఆ వ్యక్తికి రెండు లక్షలు ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: పోస్టర్ చిచ్చు.. జడ్జి పరువు తీసేసిన ఫోన్ కాల్స్.. దేవాకి పురుషోత్తం సలహా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

