అన్వేషించండి

Seethe Ramudi Katnam Today August 26th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీ నుంచి ఇంటి తాళాలు, బాధ్యతలు తీసుకోమని సీతతో చెప్పిన విద్యాదేవి!

Seethe Ramudi Katnam Today Episode ఇంటి కోడలిగా మహాలక్ష్మీ నుంచి ఇంటి తాళాలు, బాధ్యతలు తీసుకోమని విద్యాదేవి సీతతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సుమతి ఇంటికి రాకపోవడానికి కారణం ఏంటని, నీకు సుమతికి ఏమైనా గొడవలు ఉన్నాయా అని జనార్థన్‌ మహాలక్ష్మీని ప్రశ్నిస్తాడు. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. అలా ఎందుకు అడుగుతావని మహాలక్ష్మీ అడిగితే నీతో ఏమైనా గొడవలు ఉండి అందుకే ఇంటికి రాలేదేమో అని అంటాడు. 

మహాలక్ష్మీ: సుమతి నీ కంటే ముందు నాకు ఫ్రెండ్. మేం ఎప్పుడూ గొడవ పడలేదు. నాతోనే కాదు సుమతి ఎవరితోనూ గొడవ పడే రకం కాదు. స్నేహానికి ప్రాణం ఇచ్చే రకం సుమతి నా మీద నమ్మకంతోనే కదా సుమతి ఈ ఇంటిని పిల్లల్ని నాకు అప్పగించింది. 
జనార్థన్: నిజమే కదా కానీ సుమతి ఇంటి వరకు వచ్చి ఎందుకు మనల్ని కలవకుండా వెళ్లిపోయింది. 
మహాలక్ష్మీ: సుమతి బతికి ఉందని తెలిసిన తర్వాత ఆ ప్రశ్న నాకు నేనే వంద సార్లు వేసుకున్నా. దాని గురించే ఆలోచిస్తున్నాను. సుమతి గురించి అంతగా ఆలోచిస్తున్నాను కాబట్టే ఈ రోజు తొందరపడి ఆ విద్యాదేవినే సుమతి ఏమో అని అనుమానించాను.
జనార్థన్: అర్థమైంది మహా ఇంత మంది సుమతి గురించి ఆలోచించేవారు ఉన్నారు కదా మరి ఎందుకు రాలేదు అన్నదే నా బాధ. ఎప్పటికైనా  సుమితికి ఈ ఇంట్లో తన స్థానమే ఉంటుంది.
మహాలక్ష్మీ: ఎన్నడూ లేనిది జనార్థన్‌ కూడా నన్ను అనుమానిస్తున్నాడు. ఆ సీత, విద్యాదేవి కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఇది అంటు వ్యాధిలా పాకుతుంది. సుమతి ఇంటికి వస్తే నా పరిస్థితి ఏంటి ఈ ఇంట్లో నా స్థానం ఏంటి. సుమతి ఎక్కడుందో కనిపెట్టి తన అడ్డు తప్పించాలి. 

ఉదయం అందరూ హాల్‌లో కూర్చొంటారు. సాంబ పేపర్ చుట్టి ఏదో ఫ్రేమ్ తీసుకొస్తే ఏంటదని అడిగితే సీత తానే తీసుకొచ్చానని అంటుంది. ఇక మహాలక్ష్మీనే విప్పి చూడమని అంటుంది. మహాలక్ష్మీ పేపర్ తీయడంతో అందులో సీత, రామ్‌ల పెళ్లి ఫొటో ఫ్రేమ్ ఉంటుంది. అది చూసి మహా షాక్ అయిపోతుంది.  రామ్ చాలా సంతోషపడతాడు. ఇక సీత ఆ ఫొటోనే హాల్‌లో పెడతాను అని అంటుంది. రామ్ మాత్రం మంచి పని అని అంటాడు మహా ఫొటో హాల్‌లో పెట్టాల్సిన అవసరం ఏముందని అంటుంది. దానికి సీత ఈ ఫొటో చూస్తే మేం జంట అని అందరికీ అర్థమైపోతుందని అంటుంది. రామ్ కూడా సీతకే వత్తాసు పలుకుతాడు. 

సీత రామ్ ఇద్దరూ కలిసి ఫొటోని హాల్‌లో పెడతారు. మహాలక్ష్మీ కోపంతో రగిలిపోతుంది. మహా అర్చనకు సైగ చేస్తుంది. దాంతో అర్చన మీ ఫొటో పెట్టారు బాగుంది కానీ నిజానికి ఇంటికి పెద్ద అయిన మహా జనార్థన్‌ల ఫొటో హాల్‌లో ఉండాలని అంటుంది. రామ్ జనా, మహాల ఫొటో ఫ్రేమ్ కట్టించి పెడతానని అంటాడు. సీత అడ్డుకుంటుంది. వద్దని మీ ఫొటో పెడితే సమస్య వస్తుందని అంటుంది. 

సీత: హాల్‌లో మీది మామయ్యది ఫొటో పెడితే రేపు సుమతి అత్తయ్య వచ్చి చూసి ఫీలవుతుంది కదా. ఫొటోలో మామయ్య పక్కన ఉండాల్సింది మామయ్య సుమతి అత్తయ్యది కదా సుమతి అత్తమ్మ అడిగితే ఏంటి పరిస్థితి.
రామ్: అప్పుడు పిన్ని, నాన్నల ఫొటో తీసేసి అమ్మనాన్నల ఫొటో పెట్టాల్సి వస్తుంది. 
సీత: కరెక్ట్‌గా చెప్పావు మామ కానీ మహాలక్ష్మీ అత్తయ్య ఫీలవుతుంది.
గిరిధర్: మరి హాల్‌లో అన్నయ్య పక్కన సుమతి వదిన ఉండాలా మహాలక్ష్మి వదిన ఉండాలా..
సీత: అందుకే సుమతి అత్తమ్మ వచ్చే వరకు హాల్‌లో మామయ్య వాళ్ల పొటో వద్దు అత్తమ్మ వస్తే అడిగి అప్పుడు నిర్ణయించుకుందాం. అప్పటి వరకు మన ఫొటోనే ఉంటుంది. మన జంటలో ఏ కన్ఫ్యూజన్ లేదు కదా.
రామ్: సూపర్ సీత మనది ఒకటే జంట ఒకటే ఫ్రేమ్. 
మహాలక్ష్మీ: చాలా తెలివిగా దెబ్బ కొడుతున్నావే ప్రతి సారి ఇలాగే నన్ను ఇరికిస్తున్నావ్. 

రామ్ అందరూ వెళ్లిపోగానే సీతకి ముద్దు పెడతాడు. హగ్ కూడా చేసుకోబోతే సీత నెట్టేసి వెళ్లిపోతుంది. ఇక రామ్ రాత్రి గదికి వస్తే నీ పని అప్పుడు చెప్తా అని అంటాడు. విద్యాదేవి సీత దగ్గరకు వెళ్లి మంచి పని చేశావ్ అని ఫొటో గురించి పొగుడుతుంది. మామయ్య పక్కన ఎప్పుడూ మా సుమతి అత్తయ్యే ఉండాలని అంటుంది. ఇక విద్యాదేవి ఇంటి కోడలిగా పూర్తిగా నీకు రావాలి అంటే ఇంటి తాళాలు బాధ్యతలు నీకు రావాలని అంటుంది. మహాలక్ష్మీ దగ్గర నుంచి ఇంటి పెత్తనం తీసుకోమని అంటుంది. సీత సరే అంటుంది. రాత్రి సీత రామ్ కోసం గది మొత్తం వెతుకుతుంది. రామ్ చాటుగా వచ్చి తలుపు గడియ పెడతాడు. సీతని వెనక నుంచి హగ్ చేసుకుంటాడు. సీత అరుస్తుంది. రామ్ సీత నోరు నొక్కుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: పెట్టె తెరచిన గాయత్రీదేవి.. పూతని చితక్కొట్టిన ఆత్మ, మోసపోయిన తిలోత్తమ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget