అన్వేషించండి

Seethe Ramudi Katnam August 13th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ప్రీతిపై విక్కీ అత్యాచారం.. చితక్కొట్టిన శివకృష్ణ, మహాలక్ష్మీకి మైండ్ బ్లాంక్!  

Seethe Ramudi Katnam Today Episode ప్రీతిని తన బాయ్‌ఫ్రెండ్ విక్కీ ఇబ్బంది పెట్టడం చూసిన శివకృష్ణ విక్కీని కొట్టి ప్రీతిని కాపాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode త్వరలోనే ఊరు వచ్చి కలుస్తామని శివకృష్ణ, లలితలు మధుమితతో చెప్తారు. మధు సంతోషంతో ఎదురు చూస్తానని అంటుంది. ఇక మధు సీతకు థ్యాంక్స్ చెప్తుంది.  అమ్మనాన్నలతో మాట్లాడినందుకు సంతోషంగా ఉందని అంటుంది. ఇక సీత ఆషాఢం అయిపోయిన తర్వాత అందరం వచ్చి నిన్ను బావని కలుస్తామని అంటారు. నీ లాంటి కూతురు ఉండటం మా అదృష్టం అని లలిత, శివకృష్ణలు సీత నుదుటిన ముద్దు పెట్టుకొని సంతోషం వ్యక్తం చేస్తారు.

రాత్రి ఇక్కడ సీత అక్కడ రామ్ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ నిద్ర పోకుండా ఉంటారు. ఒకర్ని ఒకరు మిస్ అవుతూ నిద్ర పోరు. ఇద్దరూ ఒకరికి ఒకరు ఫోన్ చేయాలి అనుకుంటారు. ఇద్దరూ ఒకే సారి ఫోన్ చేయడంతో ఒకరి ఫోన్ ఒకరికి బిజీ వస్తుంది. మళ్లీ మళ్లీ ప్రయత్నించడంతో బిజీ వస్తుంది. సీత ఇంత సేపు ఎవరితో మాట్లాడుతుందని రామ్ అనుకుంటే రామ్ ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడని అనుకుంటాడు. ఇక రామ్ సీతకు వీడియో కాల్ చేస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటారు. పదే పదే గుర్తొస్తున్నావని అనుకుంటారు. వారం రోజుల్లో ఆషాఢం అయిపోతుందని సీత అంటుంది. ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటారు.

ఉదయం ప్రీతి వెళ్తుంటే వివేక్ కలుస్తాడు. చాలా రోజులు అయిందని నిన్ను కలిసి అని ప్రీతిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్లడానికి రెడీ అవుతాడు. ఇంతలో శివకృష్ణ చూసి ఇద్దర్ని అడ్డుకుంటాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని శివకృష్ణ ప్రీతిని పిలిస్తే ప్రీతి మామ మీద కోప్పడి తన బాయ్‌ ఫ్రెండ్‌తోనే వెళ్తానని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు సీత, లలిత మాట్లాడుకుంటారు. ఆషాఢం పూర్తి అయిపోతుందని మహాలక్ష్మీతో నువ్వే నా కోడలివి అని అనిపించుకుంటానని ఇప్పటి వరకు ఏ ప్రయత్నం చేయడం లేదని లలిత సీతకి చివాట్లు పెడుతుంది. నవ్వు అనుకున్నది జరగకపోతే ఆ ఇంట్లో నీ స్థానం తగ్గిపోతుందని అంటుంది. సీత ఎలా అయినా గెలుస్తానని మహాలక్ష్మీతోనే కోడలు అనిపించుకుంటానని అంటుంది. ఇంతలో శివకృష్ణ సీతకి కాల్ చేస్తాడు. సీత షాక్ అయిపోతుంది.

విక్కీ ప్రీతిని తన రూమ్‌కి తీసుకొస్తాడు. తన రూమ్‌లో ప్రైవసీ ఉంటుందని కాసేపు మాట్లాడుకొని వెళ్లిపోదాం అని ప్రీతిని లోపలికి తీసుకెళ్తాడు. ప్రీతి ఇంట్లోకి వెళ్లగానే తలుపు గడియ పెట్టేస్తాడు. ప్రీతికి జూస్ ఇస్తాడు. మీద మీద చేయి వేస్తాడు. ప్రీతి చిరాకు పడుతుంది. త్వరలో మనం పెళ్లి చేసుకుందామని మీ ఇంటికి అల్లుడు అవుదామని  అనుకుంటున్నాను అని విక్కీ అంటే ప్రీతి కోప్పడుతుంది. నువ్వు నా ఫ్రెండ్ మాత్రమే అని అంటాడు. ఇక విక్కీ ప్రీతిని పట్టుకొని నీతో కమిట్ అయితే నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటావని ప్రీతి మీద అఘాయిత్యానికి పాల్పడతాడు. ఇంతలో శివకృష్ణ వచ్చి విక్కీ చెంపలు వాయిస్తాడు. ప్రీతికి ధైర్యం చెప్తాడు. నేనో పోలీస్‌రా అని విక్కీని చితక్కొడతాడు. విక్కీని లాక్కొని మహాలక్ష్మీ ఇంటికి తీసుకెళ్తాడు. 

శివకృష్ణ: మహాలక్ష్మీ, జనార్థన్‌ బావ బయటకి రండి.
మహాలక్ష్మీ: ఏంటి మా ఇంటి ముందు అరుస్తున్నారు. 
రామ్: ఏమైంది మామయ్య.  
శివకృష్ణ: కిందకి రండి. వీడు ఎవడో తెలుసా మీకు వీడు ప్రీతిని బైక్‌ మీద ఎక్కించుకొని వెళ్లాడు. వీడు ప్రీతిని ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా. ప్రీతిని వీడు రూమ్‌కి తీసుకెళ్లాడు. 
మహాలక్ష్మీ: విక్కీ మా ఇంటికి  వస్తాడు అలానే ప్రీతిని తన ఇంటికి తీసుకెళ్లుంటాడు అందులో తప్పేముంది.
శివకృష్ణ: మహాలక్ష్మీ అని కొట్టడానికి చేయి ఎత్తుతాడు. ఛీ ఇక ఆడపిల్లని పెంచిన తల్లిలానే మాట్లాడుతున్నావా. వాడు ప్రీతిని రూమ్‌కి తీసుకెళ్లాడు అంటే ఇంటికి వస్తాడు రూమ్‌కి తీసుకెళ్తాడు అని మాట్లాడుతున్నావ్. రూమ్‌లో వాడు ఏం చేశాడో తెలుసా ప్రీతిని బలాత్కారం చేయబోయాడు. వాడితో వెళ్లొద్దని ప్రీతిని హెచ్చరించాను అయినా వెళ్లింది నేను వెళ్లడం కొంచెం ఆలస్యం అయింటే ప్రీతి లైఫ్ నాశనం అయిండేది.
రామ్: ఫ్రెండ్ అని చెప్పి ప్రీతిని ఇబ్బంది పెడతావా నిన్ను బతకనివ్వను అని రామ్‌ కొట్టబోతే శివకృష్ణ అడ్డుకుంటాడు. 

ఇలాంటి వాడిని ఇంటికి రప్పించినందుకు అందర్ని శివకృష్ణ తిడతాడు. నా మేనకోడలి జీవితాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని శివకృష్ణ అరుస్తాడు. మహాలక్ష్మీ శివకృష్ణతో కావాలనే మీరు ఈ సీన్ క్రీయేట్ చేసినట్లు ఉందని అంటుంది. ఇక విక్కని చితక్కొడుతుంది. నీతో ఇలా ఎవరు చేయించారని అడుగుతుంది. చెవిలో శివకృష్ణ పేరు చెప్పమని అంటుంది. విక్కీ అలాగే అని శివకృష్ణ ఇదంతా చేయమని అన్నాడని చెప్తాడు. ఈ పని చేయను అంటే బెదిరించాడని విక్కీ చెప్తాడు. జనార్థన్‌తో పాటు అందరూ శివకృష్ణని తిడతారు. సీత క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది. ఇక సీత కొంత మంది అమ్మాయిల్ని పిలిపిస్తుంది. రిషిక, పూజ అనే ఇద్దరు ప్రీతి ఫ్రెండ్స్ వచ్చి విక్కీ బ్యాడ్ బాయ్ అని వాళ్ల లైఫ్ నాశనం చేశాడని సీక్రెట్‌గా ఫొటోలు తీసి డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్తారు. ప్రీతి విక్కీని చితక్కొడుతుంది. రామ్ కూడా విక్కీని కొడతాడు. శివకృష్ణ ఆపుతాడు.  వాడిని పోలీసులకు అప్పగిస్తారు. ఇక శివకృష్ణ ఇంటికి వెళ్లిజరిగింది అంతా లలితకు చెప్తాడు.. ప్రీతి మామయ్య అని శివకృష్ణ దగ్గరకు వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ప్రజెంటేషన్ అదరగొట్టిన మిత్ర, అర్జున్.. ప్రాజెక్ట్ దక్కించుకునేది ఎవరు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Embed widget