Chiranjeevi Lakshmi Sowbhagyavathi August 13th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ప్రజెంటేషన్ అదరగొట్టిన మిత్ర, అర్జున్.. ప్రాజెక్ట్ దక్కించుకునేది ఎవరు?
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర, అర్జున్ ఇద్దరి ప్రజెంటేషన్ బాగుందని ఇద్దరిలో ఎవరో ఒకరికే ప్రాజెక్ట్ దక్కుతుందని సంయుక్త చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode ప్రాజెక్ట్ కోసం జేఎమ్మార్ కూతురు సంయుక్తని కాకా పడుతున్నావని మిత్ర అర్జున్‌తో అంటాడు. దానికి అర్జున్ తన బలాన్ని నమ్ముకుంటానని మరోకరు చూపించే జాలి దయని నమ్ముకోనని ఈ ప్రాజెక్ట్ గెలిచేసి నేనే అని అర్జున్ అంటాడు.
మిత్ర: అదే కానీ జరిగితే లక్కీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్లో ఒక వింగ్ కంప్లీట్‌గా క్లోజ్ చేసేస్తా. నీ ముందు ఓడి పోయినందుకు నాకు నేనే ఆ శిక్ష వేసుకుంటా.
అర్జున్: మిత్ర రేస్లో ఓడిపోయిన వాడు రెండు కాళ్లు నరుక్కునట్లు ఉంది నీ ఆలోచన. గెలవడానికి ఆలోచించు ఓడిపోతే ఏం చేయాలని కాదు. కానీ నువ్వు ఎంత ట్రై చేసినా ప్రాజెక్ట్‌ని నా చేతుల్లోంచి నువ్వు లాక్కోలేవు.
మిత్ర: సేమ్ నువ్వు ఎంత ట్రై చేసినా ఈ మిత్రని కాదని ఒక్క అడుగు ముందుకు వేయలేవు.
జాను, సంయుక్తలు ప్రజెంటేషన్ ప్రారంభిస్తారు. ముందుగా అశోక్ అనే వ్యక్తి వెళ్లి తన ప్రజెంటేషన్ ఇస్తాడు. సంయుక్త జానుతో జేఎమ్మార్ స్టాండర్స్ వేరు కొందరు ఆయన ఆలోచనలకు ఏ మాత్రం సరిపోవడం లేదని కొందరు ప్రజెంటేషన్ ఇచ్చి ఇవ్వనట్లు ఇచ్చారని అంటుంది. మరోవైపు లక్కీ, జున్ను ఇద్దరూ ఎవరి ఇంట్లో వాళ్లు పూజలు చేస్తుంటారు. మిత్ర కోసం లక్కీ, అర్జున్ కోసం జున్నులు ప్రాజెక్ట్ దక్కాలని పూజ చేస్తున్నామని ఇంట్లో వాళ్లకి చెప్తారు. మంచి వాళ్లకి మంచే జరుగుతుందని అర్జున్ బాబకి మంచే జరగాలి అని జున్ను అంటాడు. ఇక మిత్రని ప్రజెంటేషన్‌కి పిలుస్తారు.
తాను రంగంలోకి దిగుతున్నానని నిన్ను సంయుక్త పిలవదని అంటాడు. మిత్ర లోపలికి వెళ్తాడు. సంయుక్త మిత్రకు ప్రజెంటేషన్ ప్రారంభించమని అంటుంది. మిత్ర చెప్తాడు. సంయుక్త చాలా బాగుందని చాలా గొప్పగా ప్రజెంటేషన్ ఇస్తారని గ్రాండ్‌గా ప్రాజెక్ట్ ఇస్తారని అనుకోలేదని రాత్రంతా మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని అంటుంది. ఇక మిత్ర వేరే వాళ్ల ప్రజెంటేషన్ చూడటానికి వీల్లేదు అనుకుంటా అంటాడు. దానికి సంయుక్త అలా అనుకోవడానికి లేదని వేరే వాళ్ల ఆలోచన ఎలా ఉందో చూడాలని అంటుంది. దానికి మిత్ర తనమీద తనకు చాలా నమ్మకం ఉందని అదే తనని గెలిపిస్తుందని చెప్పి బయటకు వస్తాడు. ఇక అర్జున్‌ని పిలుస్తారు. మిత్ర అర్జున్‌తో తన ప్రజెంటేషన్ సంయుక్తకి పిచ్చిపిచ్చిగా నచ్చేసిందని అంటాడు. అర్జున్ లోపలికి వెళ్తాడు.
ప్రజెంటేషన్ ఇవ్వమని సంయుక్త అంటే అర్జున్ ప్రజెంటేషన్ ఇవ్వాలా అని అడుగుతాడు. ఎందుకు అలా అన్నారని సంయుక్త అంటే మిత్ర ప్రజెంటేషన్‌కి మీరు ఇంప్రెస్ అయ్యారని అతనికే ప్రాజెక్ట్ ఇస్తారని అనుకోవచ్చా అంటాడు. దానికి సంయుక్త మీరే గెలవొచ్చు ఏమో మీరు ప్రెజెంటేషన్ ఇవ్వండని చెప్తుంది. అర్జున్ కూడా ప్రజెంటేషన్ ఇస్తాడు. అర్జున్ ప్రజెంటేషన్‌కి కూడా సంయుక్త ఇంప్రెస్ అవుతుంది. చాలా అద్భుతంగా ఉందని చెప్తుంది. అర్జున్ బయటకు వెళ్తాడు. సంయుక్త ఆలోచనలో పడుతుంది. ఇద్దరి ప్రజెంటేషన్ బాగుందని ప్రాజెక్ట్ ఎవరికి ఇస్తామని అనుకుంటారు. ఇక అర్జున్ బయటకు వెళ్తే ఏదో కోల్పోయినట్లు వస్తాడని అనుకుంటే ఇంత సంతోషంగా వచ్చేశాడేంటని మిత్ర అనుకుంటాడు. ఇద్దరూ మాటల యుద్ధం చేసుకుంటారు. నేను గెలిస్తే నేను గెలుస్తా అనుకుంటారు. ఇక మిత్ర, అర్జున్‌ని సంయుక్త లోపలికి రమ్మని పిలుస్తుంది. ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఇద్దరి ప్రజెంటేషన్‌లు తనకు బాగా నచ్చాయని ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుందని సంయుక్త అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కనకమహాలక్ష్మీ సీరియల్: అవినాష్‌తో కనకం పెళ్లి చేయనని తేల్చేసిన సౌధామణి.. ఆది కేశవ్‌కి ఘోర అవమానం!