Seethe Ramudi Katnam Serial Today April 30th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఒకే గదిలో రామ్, మిథున.. మహాలక్ష్మీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా!
Seethe Ramudi Katnam Today Episode సీతలా ఉన్న మిథున మీద రామ్‌కి అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode రామ్, మిథునలు రిసార్ట్‌కి వెళ్తుంటారు. మధ్యలో సీత మామిడి కాయల తోట చూసి రామ్‌కి కారు ఆపించి మామిడి తోటకి పరుగులు తీస్తుంది. ఇప్పుడు ఎందుకు మిథున అని రామ్ అడుగుతాడు. కానీ మిథున పరుగులు తీస్తుంది. రామ్ మనసులో మిథున ఏంటి సీతలా ప్రవర్తిస్తుందని అని అనుకుంటాడు. మిథున మామిడి కాయలు కోసి రామ్‌కి క్యాచ్ ఇస్తుంది. ఇంతలో తోటమాలి కేక వేయడంతో పరుగులు పెడుతుంది.
తను మిథునా సీతనా..
మిథునతో రామ్ నువ్వు మిథునవేనా నువ్వు ఎందుకో సీతలా ప్రవర్తిస్తున్నావ్ అని అంటాడు. నేను సీతలా ప్రవర్తించడం ఏంటి అని మిథున అంటే నువ్వు సీతలా ఉండటమే కాదు బుద్ధులు కూడా సేమ్ ఉన్నాయి. దానికి మిథున తెలుగు మూవీస్‌లో చూశా కొని తిన్న వాటికంటే కొట్టేసి తిన్నవే టెస్టే ఎక్కువ అని అంటుంది. దాంతో రామ్ గతంలో సీత సేమ్ డైలాగ్ తనకు చెప్పడం గుర్తు చేసుకుంటాడు. సీతలా కాకి ఎంగిలి రామ్‌కి ఇస్తుంది. అది చూసిన రామ్ తను నిజంగా మిథున ఏనా సీతలా ప్రవర్తిస్తుంది ఏంటి అని అనుకుంటాడు. తర్వాత ఇద్దరూ స్టార్ట్ అవుతారు.
మిస్ అయిన గౌతమ్ టార్గెట్..
గౌతమ్, రేఖలు మిథున, రామ్‌ల కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంకా రాలేదేంటి అనుకుంటారు. ఇంతలో రామ్, మిథునలు వస్తారు. రామ్‌ని కాల్చేయ్ గౌతమ్ అని రేఖ చెప్తుంది. గౌతమ్ గురి పెడతాడు. మేనేజర్ వాళ్లు అడ్డు రావడంతో గౌతమ్ కాల్చలేకపోతాడు. మేనేజర్ రామ్‌తో మిథున రామ్ భార్య అని రామ్‌ని విసిగిస్తాడు. రామ్ మేనేజర్ మీద సీరియస్ అవుతాడు. ఇక గౌతమ రామ్‌ని షూట్ చేయడం కుదరలేదని మరో చోటు నుంచి ప్రయత్నిస్తాడు. సరిగ్గా కాల్చే టైంకి గన్‌లో బులెట్స్ లేవని గుర్తిస్తాడు. గన్ ఆప్షన్ వేస్ట్ అయిపోయిందని అనుకుంటారు. తర్వాత ఇక చాక్ తీస్తాడు.
ఒకే గదిలో రామ్, మిథున..
రామ్, మిథునలకు మేనేజర్ గది చూపిస్తాడు. ఇద్దరికీ ఒకే గది ఇస్తారు. రామ్ మరో గది అడిగితే మీరు కపుల్స్ అనుకొని ఒకే గది బుక్ చేశానని అంటాడు. ఇంకో గది బుక్ చేయమని అంటే గదులు ఖాళీ లేవని అంటారు. ఇక మిథున నాకు రూం షేర్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ లేదని చెప్తుంది. సీతతో తప్ప మరెవరితో రూం షేర్ చేసుకోలేనని అంటాడు. నీతో ఇలా ఉండాలి అంటే గిల్టీగా ఉందని అంటాడు. దానికి మిథున గిల్టీ ఎందుకు నా మనసులో ఏం లేదు నీ మనసులో సీత ఉంది కదా అంటుంది. రామ్ డే అంతా ఓకే కానీ నైట్ అయితే నేను బయటకు వెళ్లిపోతా అని అంటాడు. నేను ఉంటే నీకు ప్రాబ్లమా అని అంటుంది. సీత మనసులో నీ పని ఇప్పుడు కాదు మామ రాత్రికి చెప్తా మహాలక్ష్మీ అత్తయ్య ఇచ్చిన ఐడియా అమలు చేస్తా అనుకుంటుంది.
సీత కోసం రేవతి ఇంటికి అత్తలు..
మహాలక్ష్మీ, అర్చనలు కారులో వెళ్తూ మిథున రామ్‌తో కలిసిపోతే వాళ్లిద్దరికీ పెళ్లి చేసేస్తా అప్పుడు సీత పని అయిపోతుందని జీవితాంతం ఏడుస్తూ కూర్చొంటుందని అనుకుంటుంది. అర్చన మహాలక్ష్మీతో ఒక సారి సీతని చూసి వద్దాం అంటుంది. ఇద్దరూ రేవతి ఇంటికి వెళ్తారు. రేవతి వాళ్లని చూసి తలుపు మూసేస్తుంది. రేవతిని సీత గురించి అడిగితే సీత నిద్ర పోతుందని చెప్తుంది. మహాలక్ష్మీ వెళ్లిపోదాం అంటే అర్చన ఊరుకోదు. ఇద్దరూ లోపలికి వెళ్తారు. రేవతి సీత గది దగ్గర నిల్చొని పిలిస్తే కిరణ్ సీత వాయిస్ పెట్టి ఇద్దరినీ తిట్టిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: దేవేంద్రవర్మ ఎవరో తెలుసుకున్న సత్యం.. చెల్లి నిర్దోషి అని నిరూపించుకోగలడా!





















