(Source: Poll of Polls)
Chinni Serial Today April 30th: చిన్ని సీరియల్: దేవేంద్రవర్మ ఎవరో తెలుసుకున్న సత్యం.. చెల్లి నిర్దోషి అని నిరూపించుకోగలడా!
Chinni Today Episode లాయర్ హరి సత్యంబాబుకి దేవేంద్ర వర్మని చూపించడం సత్యంబాబు ఆవేశ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode కావేరిని తనని పెళ్లి చేసుకోమని లేదంటే ఎఫైర్ అయినా ఓకే అని దేవేంద్ర వర్మ కావేరితో చెప్పి చేయి పట్టుకుంటాడు. దాంతో కావేరి దేవేంద్ర వర్మని లాగిపెట్టి కొడుతుంది. మనిషిలా పుట్టినందుకు మనిషిలా ప్రవర్తించు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. దేవా చెంప మీద చేయి వేసుకొని అదే దెబ్బ అప్పుడు ఎలా కొట్టావో ఇప్పుడు అలాగే కొట్టావ్ ఇక నీకు నా చేతిలో చావు దెబ్బ తప్పదు అని అనుకుంటాడు.
దేవేంద్ర వర్మ తర్వాత సత్యంబాబు దగ్గరకు వెళ్లి స్నాక్స్ ఇస్తాడు. సరళ దేవాతో చిట్ కట్టమని చెప్తే దేవా వాళ్లతో రెడీ మేడ్ డిజైన్స్ వ్యాపారం చేయిస్తానని అంటాడు. నెలకు పది లక్షల వరకు లాభం రావొచ్చు ఈ టీచర్‌ని కూడా పార్టనర్‌గా పెట్టుకోండి అంటాడు. పది లక్షలు అన్న మాట వినగానే సరళ కళ్లు తిరిగి పడిపోతుంది. కావేరి ఫోన్ రావడంతో మాట్లాడటానికి బయటకు వెళ్తుంది. నాగవల్లి తన రౌడీలకు కాల్ చేసి ఉష బయటకు వచ్చిందని చెప్తుంది. వాళ్లు కావేరికి కరెంట్ షాక్ పెట్టడానికి రెడీగా ఉంటారు. కావేరి ఫోన్ మాట్లాడుతూ వైర్ల దగ్గరకు వస్తుంది. ఆ కరెంట్ వైర్ల మీద కాలు వేసి కావేరి కింద పడిపోతుంది. ఏం కాలేదని నాగవల్లి నోరెళ్ల బెడుతుంది. ఇక చిన్ని చూసి తల్లిని పైకి లేపుతుంది. వెంటనే రౌడీలకు కాల్ చేసి ఏమైందని అంటుంది. ఎందుకు షాక్ కొట్టలేదో అర్థం కాలేదని రౌడీలు అంటారు. అందంతా చూసిన బాలరాజు నువ్వు వేసే ఈ ముష్టి ప్లాన్స్ నుంచి కాపాడటానికి దేవుడు అవసరం లేదు ఈ బాలరాజు చాలు అనుకుంటాడు.
మహి భర్త్‌డే కేక్ కటింగ్ జరుగుతుంది. అందరూ సందడిగా కేక్ కటింగ్ చేయిస్తారు. తర్వాత భోజనాలకు వెళ్తారు. కావేరి సరిగా తినకపోవడంతో సత్యంబాబు ఏమైందని అడిగితే తలనొప్పిగా ఉంది అని చెప్తుంది. దాంతో సత్యంబాబు త్వరగా తినమని వెళ్లిపోదామని అంటాడు. కరెంట్ ఎందుకు ఉషకి షాక్ కొట్టలేదా అని నాగవల్లి వెళ్లి వైర్లు పట్టుకుంటుంది. దాంతో వల్లికి షాక్ కొడుతుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. వల్లిని ప్రమీల లోపలికి తీసుకెళ్తుంది. ఇక సత్యంబాబు వాళ్లు చెప్పి బయల్దేరుతారు. రిటర్న్ గిఫ్గ్‌లు తీసుకుంటారు. ఇక కారులో వెళ్లండి అని దేవా సత్యంబాబుకి చెప్తే మేం ఆటోలోనే వెళ్తామని సత్యంబాబు చెప్తాడు.
లాయర్ హరి సత్యంబాబుకి ఈ విషయం చెప్పాలని కంగారుగా తన సైకిల్ మీద వస్తుంటాడు. మరోవైపు సత్యంబాబు ఆటో కోసం వెయిట్ చేస్తుంటే అక్కడికి హరి వచ్చి మనం వెతుకుతున్న దేవేంద్ర వర్మ చివరి అడ్రస్ ఇదే అని చెప్తాడు. ఈ ఇళ్లా అని సత్యంబాబు నోరెళ్ల బెడతాడు. పేపర్లో హరి దేవేంద్ర వర్మని చూపించడంతో సత్యంబాబు షాక్ అయి వీడింటికే భర్త్‌డే పార్టకి వచ్చాం హరి అని అంటాడు. దేవేంద్ర వర్మ మాటలు గుర్తు చేసుకొని రగిలిపోతాడు. వాడిని వదిలిపెట్టను అని సత్యంబాబు అంటే వాడు చాలా దుర్మార్గుడు ఇప్పుడు నువ్వు వెళ్తే నిన్ను జైల్లో పెడతాడు. ఆవేశంతో కాదు ఆలోచనతో వాడిని దెబ్బకొట్టాలి అని హరి అంటాడు. తను ఆలోచించి ఐడియా చెప్తా అప్పటి వరకు నువ్వు తొందర పడుకు అని చెప్తాడు. దేవా వచ్చి మాట్లాడటంతో సత్యంబాబు రగిలిపోతాడు. సత్యంబాబు ఫ్యామిలీని తీసుకొని వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర





















