Seethe Ramudi Katnam Serial Today April 29th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఒక్కటైన అన్నాచెల్లెళ్లు, సుమతి గతం తెలిసి కుమిలిపోయిన శివకృష్ణ కుటుంబం.. జైలుకి వెళ్లనున్న సీత,రామ్‌లు!
Seethe Ramudi Katnam Serial Today Episode : సూర్యని కలవాలి అని సీత తన భర్తని తీసుకొని జైలుకి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి, మధుమితలకు వార్నింగ్ ఇచ్చి సీత తన గదికి వస్తుంది. రామ్‌ని చూసి తనని గట్టిగా పట్టుకోమని అడుతుంది. రామ్ పట్టుకోగానే ఏడుస్తుంది. రామ్ తనకి ఎక్కడ దూరమైపోతాడో అని సీత ఫీలైతే రామ్ సీతకు ధైర్యం చెప్తాడు. సీతని లవ్ చేస్తున్నా అని అంటాడు.
రామ్: నేను నీకు మాటిస్తున్నా సీత. ఎప్పటికీ మనం విడిపోం. ఆ సీతారాములను ఆదర్శంగా తీసుకొని ఆనందంగా ఉందాం. సరేనా..
సీత: ఐలవ్‌యూ మామ.
సుమతి: అన్నయ్య ఏడమ్మా.. అన్నయ్య వస్తే ఏం అంటాడా అని భయంగా ఉంది.
లలిత: మేమంతా ఉన్నాంగా సుమతి ధైర్యంగా ఉండు. ఇంతలో శివకృష్ణ వస్తాడు. సుమతి భయపడుతుంది. సుమతిని లలితా వాళ్లు వేరే గదిలో ఉండమని తాము శివకృష్ణకి సర్దిచెప్తామని అంటాడు.
శివకృష్ణ: ఏంటి అందరూ అలా ఉన్నారు. అందరూ కంగారుగా ఉన్నారు ఏంటి. అందరూ కంగారుగా శివకృష్ణతో ప్రవర్తిస్తారు.
సుమతి: నన్ను ధైర్యంగా ఉండమని చెప్పి వీళ్లు కంగారు పడుతున్నారేంటి.
శివకృష్ణ ఫ్రెష్ అయి వస్తే లలిత సుమతి గతంలో శివకృష్ణ కోసం కుట్టిన షర్ట్ తీసుకొని వచ్చి ఇస్తుంది. అది వద్దని శివకృష్ణ అంటే మిగతా షర్ట్‌లు ఉతకడానికి నీటిలో పెట్టేశాను అంటుంది. సుమతి కుట్టిన షర్ట్ అయితే ఏమైంది వేసుకోండి అని ముగ్గురు ఆడవాళ్లు శివకృష్ణని కంగారు పెట్టేస్తారు. దీంతో శివకృష్ణ షర్ట్ వేసుకుంటాడు. సుమతి చూసి మురిసిపోతుంది. ఇక శివకృష్ణ ఆకలి వేస్తుందని అనడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తారు. లలిత కంగారులో సుమతి కోసం కూడా ప్లేట్ పెడుతుంది.
శివకృష్ణ: ఏమైంది మీ అందరికీ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా తేడాగా ప్రవర్తిస్తున్నారు. సీతకానీ మధు కానీ వచ్చారా.. ముందు విషయం చెప్పండి..
త్వరగా ఎవరో ఒకరు చెప్పండి.
శివతల్లి: నీ చెల్లి సుమతి వచ్చింది శివ..
లలిత: అమ్మా సుమతి రా..
సుమతిని చూసిన శివకృష్ణ షాక్ అయిపోతాడు. అందరూ శివకృష్ణకు తన చెల్లి మీద ఉన్న ప్రేమను గుర్తు చేస్తారు. చెల్లిని దగ్గరకు తీసుకోమని చెప్తారు. సుమతి శివకృష్ణ దగ్గరకు వస్తుంది. అన్నయ్య అని పిలిచి, క్షమాపణలు చెప్పగానే కరిగిపోతాడు. చెల్లిని దగ్గరకు తీసుకొని ఏడుస్తాడు. అందరూ కలిసి భోజనం చేస్తారు.
రామ్: సీత ఏం ఆలోచిస్తున్నావ్.
సీత: మా అక్క గురించి మామ. మా అక్క సమస్య ఇంకా అలాగే ఉంది.
రామ్: మీ అక్క గురించి మా పిన్ని చూసుకుంటుందిలే సీత. నువ్వు టెన్షన్ పడకు.
సీత: లేదు మామ మనం కూడా మా అక్కాబావల గురించి ఆలోచించాలి. మనకు బాధ్యత ఉండాలి.
రామ్: అటు మీ నాన్న. ఇటు మా పిన్ని ఇద్దరూ ప్రయత్నస్తున్నారు కదా ఇక మనం ఎందుకు.
సీత: ఒకసారి మనం జైలుకి వెళ్లి మా బావని కలిసి వద్దాం. సూర్య బావకి ధైర్యం చెప్దాం.
రామ్: జైలుకా..
సీత: ఏం మామ నువ్వు జైలుకి రావా.. నీకు ఇబ్బంది ఉంటే నేను వెళ్తాను.
రామ్: నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావ్ నేను వస్తా..
సీత: థ్యాంక్స్ మామ. సూర్య బావ బయటకు వస్తే మన ఇద్దరిలా మా అక్క బావ కూడా సంతోషంగా ఉంటారు.
రామ్: సరే సీత కానీ..
సీత: ఏంటి మామ.
రామ్: కానీ ఒకసారి నేను మీ అక్క కలిసి వెళ్లి మీ బావని కలిశాం ఇప్పుడు వెళ్తే. సూర్య ఆ రోజు మీ అక్కని తిట్టినట్లు నిన్ను తిడితే తట్టుకోగలవా..
సీత: తిట్టేది మా బావే కదా పర్లేదులే మామ. అయినా బాధలో ఉండి ఏమైనా అంటాడు. నేను ఏం అనుకోను మామ రేపు జైలుకి వెళ్దాం అలాగే మా ఊరు వెళ్దాం పక్కనే కదా.
సుమతి: ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది.
శివతల్లి: మీ అన్నయ్య కూడా ఈ రోజు చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నాడు.
శివకృష్ణ: ఇంత కాలం ఎక్కడున్నావ్ సుమతి. నీ భర్త పిల్లలు ఎక్కడున్నారు.
లలిత: మాకు కూడా సుమతి కుటుంబం గురించి తెలుసుకోవాలి అని మాకు ఆత్రంగా ఉంది.
శివకృష్ణ: ఏంటమ్మా ఆలోచిస్తున్నావ్ ఏదైనా సమస్యా..
సుమతి: కాదు అన్నయ్య ఆ రోజు మిమల్ని కాదు అని ఇంటి నుంచి వెళ్లిపోయాను. నేను ప్రేమించిన వాడిని పెళ్లిచేసుకున్నాను. మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక అమ్మాయి. ఒక అబ్బాయి. పెళ్లి తర్వాత ఆయన చిన్న వ్యాపారం పెట్టారు. అది కలిసొచ్చి పెద్ద వ్యాపారంగా మారింది. జీవితం ఆనందంగా సాగుతున్న సమయంలో నాకు యాక్సిడెంట్ అయింది. కొన్ని సంవత్సరాల పాటు అలా కోమాలో ఉండిపోయాను. యాక్సిడెంట్‌లో చనిపోయాను అని ఆయన పిల్లలు అనుకున్నారు. నేను ఓ ఆశ్రమంలో చికిత్స పొందాను. ఆ విషయం వాళ్లకి తెలీదు. ఈ మధ్యే కోమా నుంచి బయట పడ్డాను.
శివతల్లి: ఎంత ఘోరం జరిగిపోయింది.
లలిత: పోనిలే సుమతి నువ్వు ప్రాణాలతో ఉన్నావ్ అది చాలు.
శివకృష్ణ: నువ్వు బతికున్నట్లు నీ భర్త పిల్లలకు తెలుసా సుమతి.
సుమతి: దూరం నుంచి చూశాను అన్నయ్య. ఇప్పుడు వాళ్ల దగ్గరకు నేను వెళ్లలేను. నేను లేను అనుకొని ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారు వదిన. తను నా భర్తని పిల్లలను నా కంటే చాలా బాగా చూసుకుంటుంది. వాళ్లు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్లి వాళ్ల ఆనందాన్ని పాడుచేయలేను. వాళ్లని అలా చూశాకా వాళ్లకి నా అవసరం లేదు అనిపించి నా ముఖం చూపించకుండా వచ్చేశాను.
లలిత: నీ పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.