Seethe Ramudi Katnam Serial Today April 24th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ముఖర్జీతో డీల్ క్యాన్సిల్ చేసేయమన్న రామ్.. డిటెక్టివ్ అవతారమెత్తిన సీత!
Seethe Ramudi Katnam Today Episode మిధునని పెళ్లి చేసుకోనని సీతే తన భార్య అని రామ్ మహాలక్ష్మీ వాళ్లకి తెగేసి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode రామ్‌ని మిధునతో పెళ్లికి ఒప్పించాలని మహాలక్ష్మీ వాళ్లు అనుకుంటారు. చలపతి మాత్రం రామ్ సీతని వదలడు అది అంత ఈజీ కాదు అంటారు. రామ్ రావడంతో అందరూ రామ్‌తో మిధున పెట్టిన కండీషన్ పెట్టిందని చెప్తారు. మిధునని నువ్వు పెళ్లి చేసుకుంటేనే బిజినెస్ కంటిన్యూ చేస్తానని మిధున కండీషన్ పెట్టిందని అందరూ రామ్‌తో చెప్తారు. రామ్ షాక్ అయిపోతాడు.
రామ్: వ్యాపారం కోసం ఎవరైనా పెళ్లి చేసుకుంటారా. సీతకి తప్ప మరో అమ్మాయికి నా జీవితంలో చోటు లేదు.
మహాలక్ష్మీ: ఇప్పుడు సీత నీతో లేదు కదా.
గిరి: సీత నీతో లేదు కదా నువ్వు మిధునని పెళ్లి చేసుకో.
రామ్: ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ సీత లేకపోవడం ఏంటి. నేను సీతకు దూరంగా ఉన్నా అంతే విడాకులు తీసుకోలేదు కదా.
గౌతమ్: కావాలంటే విడాకులు తీసుకో బ్రో.
మహాలక్ష్మీ: అవును రామ్ నన్ను మర్డర్ చేయాలనుకుందని సీతని నువ్వు వద్దు అనుకున్నావ్ కదా ఇప్పుడు మిధునని పెళ్లి చేసుకో.
రామ్: అలా ఎలా చేసుకుంటాను పిన్ని. సీత తప్పు చేసుండొచ్చు క్షమించరాని తప్పే అయిండొచ్చు కానీ నిరూపించుకుంటాను అంది కదా. సీత వచ్చినా రాకపోయినా తను ఎప్పటికీ నా భార్యనే. తనని కాదని మరెవరినీ పెళ్లి చేసుకోను.
మహాలక్ష్మీ: ఒకసారి నా మాట విను రామ్. తప్పు చేసిన తనని నువ్వు ఎప్పుడూ క్షమించవు అని నాకు తెలుసు. ఎన్నాళ్లు ఇలా ఒంటరిగా ఉంటావ్.
జనార్థన్: అవును రామ్ నువ్వు ఇలా ఒంటరిగా ఉండొద్దు నీకు ఓ తోడు ఉండాలి. నువ్వు వారసుల్ని ఇవ్వాలి. వంశం నిలబడాలి.
రామ్: నాకు బిజినెస్ అవసరం లేదు కావాలంటే ఆ డీల్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పండి. నేను మిధునని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. తన కండీషన్‌కి ఒప్పుకోను.
అందరూ షాక్ అయిపోతారు. మహాలక్ష్మీ రామ్‌ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. రామ్ వద్దు అంటే వద్దు అంటాడు. వాళ్లు కాదు అంటే మనం రోడ్డున పడం మా అమ్మ పెట్టుబడి పెట్టింది నాన్న, మీరు కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు ఎవరో బెదిరిస్తే మనం భయపడటం ఏంటి మన కంపెనీని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని రామ్ అంటాడు.
మహాలక్ష్మీ వాళ్లంతా ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటారు. రామ్ అంత కచ్చితంగా చెప్పిన తర్వాత ఇక్కడ జరిగింది ముఖర్జీకి చెప్పి కొంచెం టైం అడుగుదామని మహాలక్ష్మీ అంటుంది. వెంటనే ముఖర్జీకి కాల్ చేస్తుంది. రామ్ పెళ్లికి ఇష్టపడటం లేదని చెప్తుంది. రామ్ మొండిగా ఉన్నాడు పెళ్లి గురించి రామ్ మనసు మార్చుకోడు బిజినెస్ కోసం మీరు మీ నిర్ణయం మార్చుకోగలరా అంటుంది. మిధునతో మాట్లాడుతాను కానీ గ్యారెంటీ లేదు అని ముఖర్జీ చెప్తారు. మహాలక్ష్మీ ఇక ఆ డీల్ మనకు లేనట్లే వందల కోట్లు మనకు లేనట్లే అని అంటుంది. సీతతో ముఖర్జీ వాళ్లు నువ్వే గెలిచావ్ అంటారు.
మహాలక్ష్మీ గౌతమ్‌ని తిడుతుంది. నువ్వు రేఖ వెంట పడకపోయి ఉంటే బాగుండేది అంటుంది. గౌతమ్ రేఖని జాతర చేస్తా అంటే అర్చన భయపడి మాట మాటకి జాతర అనుకురా బాబు అంటుంది. మహాలక్ష్మీ కూడా గౌతమ్‌ని తిడుతుంది. సుమతి కేసులో నువ్వు దొరికితే సీత నీ పని పట్టేస్తుందని అంటుంది. కేసులో గౌతమ్ గెలుస్తాడో లేదో అని బొమ్మా బొరుసు వెస్తానని అర్చన వేస్తుంది. కాయిన్ బయటకు వెళ్లిపోతుంది. దాని వెనక మహాలక్ష్మీ, అర్చన పరుగులు పెడతారు. ఇంతలో సీత డిటెక్టివ్ గెటప్ వేసుకొని ఇంట్లోకి వస్తుంది. అందరూ ఎవరు నువ్వు అని అడుగుతారు.
చలపతి సీత గుర్తు పట్టలేదా అని అంటాడు. అందరూ నోరెళ్లబెడతారు. డిటెక్టివ్ గెటప్లో ఎందుకు వచ్చావ్ అంటే సుమతి అత్తమ్మ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను అంటుంది. సుమతి అత్తమ్మని చంపిని హంతకుడి ఆనవాళ్లు ఏవైనా దొరుకుతాయని చిన్న బూతద్దం పట్టుకొని హడావుడి చేస్తుంది. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు అరిచినట్లు ఇప్పుడు నీ గోల ఏంటని అర్చన అంటుంది. గదుల్లో ఉండొచ్చని చెప్పి రామ్ గదికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇక నుంచి నువ్వు దేవా భార్యవి.. ఈ ఇంటి చిన్న కోడలివి.. ఓర్నీ ఇదంతా కలా!





















