అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today April 1st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అత్త మహాలక్ష్మికి బోడి గుండు కొట్టిస్తానన్న సీత.. మామని అవమానించిన సూర్య!

Seethe Ramudi Katnam Serial Today Episode సీత రామ్‌కి ఇచ్చిన పాలలో మత్తు మందు కలిపింది అని మహాలక్ష్మి రచ్చ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode తన చేతిలో హారతి కర్పూరం పెట్టి సీత ఇచ్చిన వార్నింగ్‌ను మహాలక్ష్మి గుర్తు చేసుకుంటుంది. ఇంతలో కుట్టు మెషిన్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్‌కు మహాలక్ష్మి ఇరిటేట్ అవుతుంది. సుమతి ఫొటో తగలబెట్టినట్లు ఈ మెషిన్ కూడా తగలబెట్టేయాలి అనుకుంటుంది. ఇక సౌండ్ వచ్చిన దగ్గరకు మహాలక్ష్మి వెళ్తుంది. అక్కడ సుమతిని చూసి షాక్ అవుతుంది. కళ్లును తుడుచు కొని చూస్తే సీత కనిపిస్తుంది. ఇంతలో సీతకు ఫోన్ రావడంతో మాట్లాడటానికి పక్కకు వెళ్తుంది. ఇక మహాలక్ష్మి మెషిన్ దగ్గరకు వెళ్తుంది. 

మహాలక్ష్మి: ఆ సుమతికి ఈ సీత మేనకోడలు అనేనా సీత స్థానంలో సుమతి కనిపించింది. ఈ మధ్య ఆ సుమతి జ్ఞాపకాలు నన్ను తరచూ వెంటాడుతున్నాయి. ఈ మెషిన్ చూస్తుంటే ఆ సుమతే గుర్తొస్తుంది. దీన్ని.. అని మహాలక్ష్మి మెషిన్ తాడు కట్ చేయబోతే సీత మహాలక్ష్మి జుట్టు పట్టుకుంటుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నా జుట్టే పట్టుకుంటావ్.
సీత: మీకు ఎంత ధైర్యం ఉంటే మీరు నా మెషిన్ తాడు కట్ చేయాలి అనుకుంటారు. మీరు నా మెషిన్ తాడు కట్ చేస్తే నేను మీ జుట్టు కట్ చేస్తా.
మహాలక్ష్మి: ఎంత ధైర్యముంటే నన్నే బెదిరిస్తావ్.. నా జుట్టు కట్ చేస్తా అంటావ్..
సీత: మీకు మీ జుట్టు అందం అయితే నాకు నా మెషిన్ ఆధారం. నేను పని చేసే మెషిన్ నాకు పూజించే దైవంతో సమానం. ఇంకోసారి నా మెషిన్ జోలికి వస్తే మీరు నిద్రపోయేటప్పుడు మీ జుట్టు అంతా కట్ చేసేస్తా. బోడి గుండు అయిపోగలవు.
మహాలక్ష్మి: నన్ను బోడి గుండు చేస్తా అంటావా..
సీత: నా మెషిన్ టచ్ చేసి చూడండి. మీకు బోడి గుండు చేస్తానో లేదో మీరే చూస్తారు. 
మహాలక్ష్మి: ఈ బోడి మెషిన్ కోసం నాకే బోడి గుండు కొడతా అంటావా ఎంత పొగరే నీకు. ఏదో ఒక రోజు నీ పొగరు అణిచేస్తా.. 
సీత: ఏదో ఒకరోజు నేనే మీ గర్వం అణిచేస్తా అప్పుడు నాలో వినయం మీకు తెలుస్తుంది. 

జైలులో సూర్య పనులు చేస్తూ ఉంటే..

శివకృష్ణ: సూర్య నాతో మాట్లాడటం చూటడం నీకు ఇష్టం లేదు అని నాకు తెలుసు. నేను ఇక్కడికి పోలీస్‌గా రాలేదు. మధు తండ్రిగా నీ మామగా వచ్చాను. నీకు ఇలా జరగడం నాకు బాధగా ఉంది. 
సూర్య: అందుకే నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారా.
శివకృష్ణ: నా డ్యూటీ నేను చేశాడు. నాకు ఇష్టం లేకుండా మధుని పెళ్లి చేసుకున్నావ్ అనీ నీ మీద నాకు కోసం ఉండేది సూర్య.
సూర్య: ఆ కోపంతోనే కదా ఇలా చేశారు.
శివకృష్ణ: కాదు. తర్వాత కాంప్రమైజ్ అయ్యాను. పోలీస్‌గా నా డ్యూటీ నేను చేశాను. ఇప్పుడు నిన్ను విడిపించడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. త్వరలోనే నేను నిన్ను విడిపిస్తా..
సూర్య: నా సంగతి వదిలేయండి. నేను ఇక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నా ఒక్కటే అని నాకు అర్థమైంది. అవును ఇంతకీ మీ కూతురు ఎక్కడుందో అది చెప్పండి. మధు మీ  డబ్బున్న అల్లుడు రామ్ దగ్గర ఉంది కదా. చేయని నేరానికి నేను జైలులో కష్టాలు పడుతుంటే తను నన్ను వదిలేసి ఆ డబ్బున్న వాడికి దగ్గరకు వెళ్లింది. జైలులో ఉన్నాను అని నాకు ఏం తెలీదు అనుకుంటున్నారా.. మా అన్న వదినలు అన్నీ చెప్తున్నారు. అయినా మిమల్ని కాదు అని మధు అక్కడికి ఎలా వెళ్లుంది. రామ్ నా కంటే ఎంత గొప్పొడో నాకు తెలియాలి అని మీరు చూశారు. ఇన్నాళ్లు మీకు మాత్రమే నా మీద కోపం ఉండేది అనుకున్నా కానీ ఇప్పుడు మధుకి కూడా నా మీద ప్రేమ పోయింది. మీరు గెలిచారు సార్.. మీరే గెలిచారు. సార దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపోండి.  

అర్చన: ఈరోజు సీతని షేక్ చేశావు మహా. మధు ఫ్రెండ్స్ ముందు సీత పరువు పోయింది.
మహాలక్ష్మి: ఇప్పుడే ఏమైంది ముందు సీతకి అసలు సినిమా చూపిస్తాను. 

ఇంతలో సీత అటుగా వస్తుంది. మహాలక్ష్మి సీత ఏదో చేయబోతుంది అని దాని చూపులో తెలుస్తుంది అని కిచెన్‌లోకి వెళ్లి చూడమని మహా అర్చనకు చెప్తుంది. అర్చన చాటుగా చూటడం సీత చూస్తుంది. దీంతో కావాలనే ఏదో కలిపినట్లు ప్రవర్తిస్తుంది. సీత ఆ పాలు తీసుకొని రామ్ దగ్గరకు వెళ్తుంది. అర్చన వచ్చి సీత పాలలో ఏదో కలిపింది అని చెప్తుంది. జనార్థన్ ఆ పాలు సీత రామ్‌కి ఇస్తుంది అని అందులో మత్తు మందు కలిపింది ఏమో అని అంటాడు.

సీత రామ్ దగ్గరకు పాలు తీసుకెళ్లి ఇస్తుంది. రామ్ ఆ పాలు తాగుతుంటే మహాలక్ష్మి ఆపుతుంది. ఆ పాలు తాగొద్దని సీత అందులో మత్తు మందు కలిపింది అని అందరూ చెప్తారు. రామ్ సీతని తిడతాడు. సీత తను ఏం కలపలేదు అని చెప్తుంది. పాలలో చక్కెర మాత్రమే కలిపాను అని సీత అంటుంది. అయినా మహా సీతని ఆ పాలు తాగమని చెప్తుంది. సీత తాగేస్తుంది. ఇక సీత తాగిని ఎంగిలి పాలు రామ్ తాగేస్తాడు. సీత బయటకు వచ్చి మహాలక్ష్మితో మేం పాలు పంచుకొని తాగేలా చేశారు అని సీత సెటైర్లు వేస్తుంది. తర్వాత అందరూ నిద్ర పోతారు. సీత పెద్ద గన్ తీసుకొని వచ్చి మహాలక్ష్మి బయటకు రావే అని పిలుస్తుంది. గన్‌తో షూట్ చేస్తుంది. అందరూ కంగారు పడి హాల్‌లోకి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 1st: షాక్ ఇచ్చిన భవాని, ఆస్తి అడిగిన ఆదర్శ్‌ని ఇంట్లో నుంచి గెంటేస్తుందా.. మీరా ఆదర్శ్‌కు దగ్గరవుతుందేంటి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
KA Movie OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
Anantapur News Today: వస్తున్నా నాన్న అన్నాడు- వదిలి వెళ్లిపోయాడు- అనంతపురంలో చదువు ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య
వస్తున్నా నాన్న అన్నాడు- వదిలి వెళ్లిపోయాడు- అనంతపురంలో చదువు ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య
Embed widget