అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today April 17th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహా ఇంటికి సుమతి పేరు.. మధుమిత మాటలకు సీత మైండ్ బ్లాంక్, రేపు ట్విస్ట్‌ ఇవ్వనున్న సుమతి!

Seethe Ramudi Katnam Serial Today Episode సూర్య ఫొటో మధుమిత చింపేయడం తెలుసుకున్న సీత మధుని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode సీత మిగిలిన ఫుడ్ డస్ట్‌బిన్‌లో వేయడానికి వెళ్లి సూర్య ఫొటో చెత్త బుట్టలో చూస్తుంది. ఆ ఫోటో తీసుకొని బావ ఫొటో ఎవరు చింపేసుంటారా అని ఆలోచిస్తుంది. తన అక్క బ్యాగ్‌లో ఉన్నా బావ ఫొటోని అత్త తీయలేదు అనుకుంటుంది. తన అక్కే ఆ ఫొటో చింపేసి ఉంటుందని అనుకుంటుంది.

మరోవైపు మధుమిత మహాలక్ష్మి మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సీత సూర్య ఫొటోని తీసుకొని వస్తుంది. ఆ ఫొటో చెత్త బుట్టలో దొరికింది అని.. నువ్వే చింపావని తెలుసని అంటుంది.

సీత: పొద్దున్న నువ్వు ఆఫీస్‌కు వెళ్తున్నప్పుడు నీ వేషం మాత్రమే మారింది అనుకున్నా నీ మనసు కూడా మారిపోయిందా. ఎంతో ఇష్ట పడి ప్రేమించి అందర్ని కాదు అని పెళ్లి చేసుకున్న నీ మనసు మారిపోయిందా ఆ మహాలక్ష్మి మార్చేసిందా..
మధు: చాల్లే ఆపు.. నీకు ఏం తెలుసు అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావ్. నేను చేసేది నీకు కనిపిస్తుంది కానీ సూర్య చేసింది నీకు కనిపించలేదా..
సీత: ఫొటో చింపేసే అంత తప్పు ఏం చేశాడు. 
మధు: నా మనసు విరిచేశాడు. నా గురించి చెడుగా మాట్లాడాడు. నా క్యారెక్టర్‌ని కించపరిచాడు. సూర్య నన్ను అర్థం చేసుకోవడం లేదు. తన కోసం నేను ఇక్కడ కష్టపడుతుంటే తను నాకోసం చెడుగా మాట్లాడుతున్నాడు. సూర్యకు సంస్కారం లేదు. ఎంత సేపు స్వార్థంగా తనకోసమే ఆలోచిస్తాడు. అలాంటి వాడిని ఏం చేయాలి. నీకు సూర్య గురించి తెలీదు సీత.
సీత: అన్నీ తెలిసే కదా పెళ్లి చేసుకున్నావ్. తనకోసం అందర్ని ఎదురించావ్ కదా..
మధు: అప్పుడు సూర్య వేరు ఇప్పుడు వేరు మారిపోయాడు. 
సీత:  మారింది బావ కాదు నువ్వు. 
మధు: అసలు నువ్వు ఇలా మాట్లాడే నన్ను చావు వరకు తీసుకెళ్లావ్. నిన్ను చంపాలి అని ఉంటే గొంతు పట్టి చంపేయ్. ఇలా మాటలతో చంపకు. ఆరోజు నేను చావాలి అనుకోవడానికి కారణం నువ్వే. మహాలక్ష్మి గారి దయవల్ల బతికాను. నేను సంతోషంగా ఉండాలి అంటే నా దగ్గర సూర్య ప్రస్తావన తీసుకురాకు. లేదంటే ఈ సారి నా శవాన్ని చూస్తావ్.
సీత: మహాలక్ష్మి నిన్ను పూర్తిగా మార్చేసింది. నిన్ను విషం చేసేస్తుంది. లాభం లేదు వెంటనే బావని విడిపించాలి. మీ ఇద్దర్ని కలపాలి. 

శివకృష్ణ తల్లి పేపర్ తీసుకొని వచ్చి చిన్నప్పుడు తప్పిపోయిన పిల్ల ఇప్పుడు దొరికింది అని మనం కూడా సుమతి గురించి పేపర్‌లో ప్రకటన వేయిద్దామని అంటుంది. అప్పుడే వచ్చిన శివకృష్ణ వద్దు అని అరుస్తాడు. దీంతో సుమతి తల్లి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి సుమతి ఫొటో చూస్తూ తన బాధ చెప్పుకుంటుంది.

మరోవైపు సుమతి ఆశ్రమంలో దిగులుగా ఉంటుంది. స్వామిజీ వచ్చి అడిగితే తన వాళ్లు గుర్తొస్తున్నారు అని తాను వెళ్లి వాళ్లని కలవాలి అంటుంది. రేపే బయల్దేరి మహాలక్ష్మిని తన పిల్లల్ని కలవాలి అంటుంది. 

ఇక సీత సాంబతో చెప్పి గేటుకు సుమతి నిలయం అని బోర్డు పెట్టిస్తుంది. అది చూసిన ప్రీతి, ఉషలు మహాలక్ష్మి దగ్గరకు వచ్చి సీత బయట ఏదో బోర్డు పెడుతుందని చెప్తుంది. మహా రామ్‌కి పిలిచి ఏదైనా చెప్పావా అని అడుగుతుంది. అందరూ గేటు చూసి ఇంట్లోకి వస్తారు అని సీత పిచ్చి పిచ్చిగా పెట్టే వాటి వల్ల తన పరువు పోతుందని అంటుంది. ఇక రామ్ సీత పిచ్చి పని చేస్తే తన అంతు చూస్తానని అందర్ని తీసుకొని వెళ్తాడు. 

మహాలక్ష్మి సీతని బోర్డు తీయమని చెప్తుంది. దీంతో సీత తాను పెట్టిన బోర్డు చూస్తే అందరూ షాక్ అయిపోతారు అని తనని మెచ్చుకుంటారు అని అంటుంది. అంతలా ఆ బోర్డులా ఏముందని అందరూ చూస్తారు. దానిమీద సుమతి నిలయం అని రాసి ఉంటుంది. అది చూసి నిజంగానే అందరూ షాక్ అయిపోతారు. మహాలక్ష్మి అయితే రగిలిపోతుంది. రామ్, జనార్థన్ సంతోషిస్తారు. సీతని రామ్ పొగిడేస్తాడు. రేవతి, చలపతిలు కూడా సీతని పొడుగుతారు. జనార్థన్ కూడా సీత చేసింది కరెక్ట్ అని ఈ ఇంటికి సుమతి పేరే ఉండాలి అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: డాక్టర్‌ని కలిసి మాస్టర్ ప్లాన్ వేసేసిన ముకుంద.. త్వరలోనే బిడ్డనిస్తానని భవానికి మాటిచ్చిన కృష్ణ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget