Satyabhama Serial Today March 26th: సత్యభామ సీరియల్: శోభనం రోజు అలా అడిగి అత్తామామలకు షాక్ ఇచ్చిన నందిని.. ఏకాంతంలో సత్య, క్రిష్‌లు!
Satyabhama Serial Today Episode ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్లకుండా నందిని అత్తామామల గది అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode హర్ష ఫస్ట్‌నైట్ గదిలోకి వెళ్లకుండా ఆరుబయట దిగులుగా కూర్చొని ఉంటాడు. అది చూసిన తల్లి విశాలాక్షి భర్తకు చెప్పి హర్షని నచ్చజెప్పమని చెప్తుంది. హర్ష దగ్గరకు విశ్వనాథం వచ్చి కొడుకుకు సర్ది చెప్తాడు. నందిని గురించి చెప్తూ గొప్పింట్లో పుట్టిన తను ఇప్పుడు ఇలాంటి చిన్న ఇంటికి వచ్చినందుకు చాలా బాధపడుతుంది. నువ్వే అడ్జస్ట్ కావాలి అని చెప్తాడు. హర్ష గదిలోకి వెళ్తాడు. మరోవైపు క్రిష్ వాళ్లకు శోభనం ఏర్పాట్లు జరుగుతాయి. భైరవి నగలు తీస్తుండగా పని మనిషి అంటూ పారిజాతం వచ్చి రెచ్చగొడుతుంది.
పారిజాతం: అమ్మా ఈ నగలు నువ్వు పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంకా ఎవరు పెట్టుకున్నా ఆ అందం రాదు. నిజం అమ్మ మీతో అబద్ధం చెప్తే ఈ కళ్లు పోతాయమ్మ. అది సరే అమ్మ ఈ నగలు అన్నీ చిన్నకోడలు దగ్గరకేనా..
భైరవి: అవునమ్మా..
పారిజాతం: మీకు మీ చిన్న కోడలికి అస్సలు పడదు కదా.. మరి ఈ నగలు అన్నీ ఎలా ఇస్తున్నారు.
భైరవి: బలిచ్చే మేకను కూడా అందంగా అలంకరిస్తారు. ఈ శోభనం అయిన తర్వాత దాని అంతు చూస్తా. రేణుక సత్యను రెడీ చేస్తుంటుంది. ఇంతలో భైరవి అక్కడికి వస్తుంది.
భైరవి: నేనేం చెప్పా నువ్వేం చేశావ్.. శోభనం గదికి పోవాలి రెడీ అవ్వమని చెప్పాను కదా. ఇంకా అలాగే ఉన్నావ్ ఏంటి. పక్కన నిలబడి నువ్వేం చేస్తున్నావే. తమాషా చూస్తున్నావా చెప్పవా.
సత్య: నేను రెడీ అయ్యాను అత్తయ్య.
భైరవి: ఓసేయ్ పారిజాతం నువ్వు వచ్చి దీని పక్కన నువ్వు నిల్చొవే. ఇప్పుడు నువ్వు పని మనిషి లెక్క ఉంది. అత్తింటికి వచ్చిన తర్వాత నీ ఇష్టా ఇష్టాలు అన్నీ నీ పుట్టింట్లోనే వదిలి పెట్టి రావాలి. ఇప్పుడు నువ్వు ఆ విశ్వనాథం కూతురివి కాదు మహదేవయ్య కోడలివి. నీ తోటి కోడలికి ఈ నగలు పెట్టుకోమని నువ్వు చెప్పు. మారమని చెప్పు.
సత్య: నాకు ఇష్టం లేదు. ఒక్కసారిగా నేను ఇప్పుడు అలవాటు మార్చుకోలేను ఇలాగే ఉండనివ్వండి అత్తయ్య ప్లీజ్.
పారిజాతం: ఏఅత్త అయినా కోడలికి నగలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది. మీరు అంత ఇష్టంతో ఇస్తే తీసుకోవడానికి ఆమెకు ఏమైంది అమ్మ.
భైరవి: చెప్తా దాని సంగతి. ఎట్లా నా దారిలోకి తీసుకురావాలో చెప్తా.
నందినిని తొలిరేయి గదిలోకి పంపిస్తారు. నందిని తనకు ఆ గది నచ్చలేదు అని అత్తామామల గది కావాలి అని అడుగుతుంది. ఇచ్చే వరకు వేరే గదికి వెళ్లను అని గుమ్మం ముందే కూర్చొంటుంది. ఇంట్లో అందరికీ ఒకటే బాత్ రూమ్ ఏంటని చిరాకు పడుతుంది. రూమ్ డెకరేషన్ చేశాం కదా అని ఈ రోజుకి వెళ్లండని అంటే నందిని ఒప్పుకోదు. ఇక విశాలాక్షికి ఈ రూం నచ్చలేదు అని తమ రూం కావాలి అని అడిగింది అని హర్షకు చెప్పి ఒప్పిస్తుంది. ఇక సంధ్య తల్లీ కొడుకులు సర్దుకుంటూ ఉండండి అని అంటుంది.
ఇక క్రిష్, సత్యల గదిని అందంగా అలంకరిస్తారు. క్రిష్ గది చూసి మురిసిపోతాడు. సత్య రాక కోసం ఎదురు చూస్తుంటాడు.
క్రిష్: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి ఇప్పుడు ఫస్ట్‌నైట్ ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. సత్య ఇప్పుడు లోపలికి వస్తే ఎలా మాట్లాడాలి. ఇక సత్య గదికి రావడంతో క్రిష్ చూస్తూ ఉండిపోతాడు. సత్య దగ్గరకు వెళ్లి రొమాంటిక్‌గా తలుపు గడియ పెడతాడు. సత్యని తీసుకొని వస్తాడు.
సత్యని చూసి ముద్దు పెట్టుకోవచ్చా అని అడుగుతాడు. సత్య చూసే సరికి ముద్దొస్తున్నావ్ అనేస్తాడు. నీకు ఎలా వినిపించింది అని అడుగుతాడు. మామూలుగా వినిపించింది అని సత్య అంటుంది. ఇక క్రిష్ సత్యకు పాలు ఇచ్చి తాగమని అంటాడు. సత్య మొత్తం తాగేస్తే చివరకు ఉన్న కొంచెం పాలను క్రిష్ తాగుతాడు. ఇక క్రిష్ సత్య దగ్గరకు వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.