అన్వేషించండి

Karthika Deepam 2 Today March 26th: కార్తీకదీపం 2 సీరియల్: మొదటి ఎపిసోడ్‌లోనే భయంకరమైన కుట్ర.. గొప్పింట్లో పుట్టిన దీప తలరాతను వంటలక్కగా మార్చేసిన నానమ్మ!

Karthika Deepam 2 Serial: పారిజాతం అనే విలన్‌ను పరిచయం చేస్తూ గొప్పింటి కార్తీక్‌కు మరదలుగా పుట్టిన దీపను పారిజాతం మార్చేయడంతో ఇవాళ్టి మొదటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode: కార్తీకదీపం 2 సీరియల్ ప్రారంభంలో సుమిత్ర ఇద్దరు కవల పిల్లలు జన్మిస్తారు. ఇంతలో ఓ వ్యక్తి  ఇద్దరు పిల్లల్లో ఓ పిల్లని తీసుకొని చాటుగా బయట కారులో వెయిట్ చేస్తున్న పారిజాతం అనే మహిళకు ఇచ్చేస్తాడు. ఆమె ఆ బిడ్డ తలరాతను మార్చే కుట్ర దారి అని వాయిస్ వినిపిస్తుంది. 

పారిజాతం: ఆ సుమిత్ర కడుపున నువ్వు పుట్టడం ఏంటే నీ కర్మకాకపోతే.. సుమిత్రా, దశరథల కడుపున పుట్టడం.. నా మొగుడు శివనారాయణ మనవరాలిగా పుట్టడం నువ్వు చేసిన పెద్ద నేరం. ఇక నుంచి నా సొంత మనవరాలే నీ స్థానంలో పెరుగుతుంది. యువరాణిలా భోగభాగ్యాలు అనుభవిస్తుంది. మా ఆనందాలను దూరం చేసిన నా కొడుకు జీవితంలో నిప్పులు పోసిన వాళ్ల ఆనందాన్ని నేను దూరం చేస్తున్నాను. 

సైదులు, శివనారాయణ భార్య పారిజాతం మాటలను పారిజాతం సొంత కొడుకు దాసు వింటాడు. ఆమె మొదటి భర్త కొడుకు దాసు. ఆ పాపని దేవుడి దగ్గరకు పంపేయ్ అని పాపని ఇచ్చేస్తుంది. సైదులు పాపని తీసుకొని వెళ్లి ఓ చెత్త కుప్ప దగ్గర పెట్టేస్తాడు. ఆపాపను మనసున్న మారాజు అంటూ పరిచయం చేసిన ఓ వ్యక్తి చూసి తీసుకుంటాడు. దాన్ని దాసు ఫాలో అయి చూస్తాడు. 

మరోవైపు సుమిత్ర, దశరథలు అప్పుడే పుట్టిన తమ బిడ్డను తన ఒక్కగానొక్క  చెల్లి కాంచన కొడుకు కార్తీక్‌కు ఇచ్చి ఫ్యూచర్‌లో పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చేస్తాడు. మరోవైపు కల్యాణ్, దాసుల బిడ్డను పారిజాతం సుమిత్ర బిడ్డ స్థానంలో పెట్టడంతో కల్యాణి విలవిల్లాడిపోతుంది. ఇక పారిజాతం బిడ్డ చనిపోయింది అని నాటకం ఆడుతుంది. అంతా తెలిసిన దాసు ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. పారిజాతం ఏడిస్తే దశరథ తన కూతుర్ని ఆమె చేతిలో పెడతాడు. 

సుమిత్ర, దశరథల బిడ్డకు నామకరణం జరుగుతుంది.  కాంచన తండ్రి శివనారాయణ పాదాలు తాకాలని దాసు ప్రయత్నిస్తే ఆయన కోపంగా కాళ్లు వెనక్కి తీసుకుంటాడు. దాసు నామకరణం దగ్గర కూర్చొవడంతో శివనారాయణ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాసు పని మనిషి కల్యాణిని పెళ్లికి ముందే కడుపు చేసేయడంతో శివనారాయణ దాసు, కల్యాణ్‌లకు పెళ్లి చేస్తాడు. అప్పటి నుంచి దాసు అంటే శివనారాయణకు నచ్చదు. ఇక పాపకు శివనారాయణ జ్యోత్న్స అని తన భార్య పేరునే మనవరాలికి పెడతాడు. పారిజాతం తన సవతి పేరు తన సొంత మనవరాలికి పెట్టావని చావు దెబ్బ కొట్టావని రగిలిపోతుంది. 

ఇక పారిజాతం తప్పించిన బిడ్డే దీప. దీపను కుబేర అనే వ్యక్తి తన కూతురుగా పెంచుకుంటాడు. అతని భార్య అంభుజవల్లి చనిపోతుంది. అతని అక్క వద్దు అని వారించినా కుభేర దీప తన సొంత కూతురే అని ఎవరికీ ఈ మాట చెప్పొద్దు అని మాట తీసుకుంటాడు. కుభేర్ తన అక్కతో కలిసి ఊయలలో వేస్తారు. తర్వాత జ్యోత్స్న, దీపలకు అన్నప్రాసన జరుగుతుంది. కేభేర అక్క కొడుకు నరసింహాని కూడా పరిచయం చేస్తారు. ఇక అన్న ప్రాసనంలో దీప గరిటె పట్టుకుంటుంది. జ్యోత్స్న లిప్‌స్టిక్ పట్టుకుంటుంది. అందరూ షాక్ అవుతారు. అయితే దీప గరిటె పట్టుకోవడంతో కుభేర ఫీలవుతాడు. ఇక శివనారాయణ పారిజాతానికి దూరంగా ఉండమని వారిస్తాడు.ఇక పిల్లలు కాస్త పెద్ద వాళ్లు అవుతారు.  దీంతో ఇవాళ్టి మొదటి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: గాయత్రీ సింహాద్రి: ‘కార్తీక దీపం 2'లో లేడీ విలన్ ఈమే - భయంగా ఉందన్న నిరూపమ్, ధైర్యం చెప్పిన ప్రేమి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Embed widget