అన్వేషించండి

Satyabhama Serial Today March 1st: సత్యభామ సీరియల్: సత్యతో పెళ్లి చేసేదే లేదని క్రిష్‌కి తెగేసి చెప్పిన మహదేవయ్య.. భైరవినే వణికించేసిన కొత్త క్యారెక్టర్‌!

Satyabhama Serial Today Episode నందినిని తనకిచ్చి పెళ్లి చేయమని హర్ష అడగడంతో సత్య క్రిష్‌ల పెళ్లి రద్దు చేసుకొని మహదేవయ్య వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode హర్ష నందినిని తనకిచ్చి పెళ్లి చేస్తేనే సత్య క్రిష్‌ల పెళ్లికి ఒప్పుకుంటానని అంటాడు. దీంతో మహదేవయ్య హర్ష మీద ఫైర్ అవుతాడు. అవమానిస్తాడు. ఈ ప్లాన్ విశ్వనాథానిదా అని అరుస్తాడు. తన నిర్ణయంతో తన తండ్రికి ఏం సంబంధం లేదని చెప్పిన హర్ష.. నందినిని తన కిచ్చి పెళ్లి చేస్తేనే సత్య మీ ఇంటి కోడలు అవుతుంది అని మహదేవయ్యకు తెగేసి చెప్తాడు.

మహదేవయ్య: అవసరంలే.. గతి లేక నేను ఈ సంబంధానికి రాలేదు. అదిగో వాడి తలనొప్పి భరించలేక బలవంతంగా మీ ఇంటికి వచ్చా.. ఇక నీ చెల్లి అవసరం లేదు నీ సంబంధం అవసరం లేదు. ఇంకేంటి చూస్తున్నారు పదండి..
క్రిష్: బాపు ఏంటిది.. తనేదో కండీషన్ పెడితే మీరు సత్యతో నా పెళ్లి క్యాన్సిల్ చేసేది ఏంటి..
మహదేవయ్య: చాలు.. ఇప్పటికే ఈ మహదేవయ్య తగ్గి చాలా పెద్ద తప్పు చేశాడు. ఇంకా ఈడే ఉంటే ఈ మాష్టారు ఫ్యామిలీని తగలెట్టేస్తా.. అర్థమైందా పదండి.. ఇటురా.. సత్యని.. ఇటురా అమ్మా.. ఈడు నీకు మళ్లీ ఫోన్ చేస్తాడేమో ఫోన్ ఎత్తకు. తలుపులు కొడితే తీయకు.. మాట్లాడటానికి ట్రై చేస్తే మాట్లాడకు. నా మాట లెక్క చేయలేదు అనుకో నీ కుటుంబం జనాభా లెక్కల్లోనే ఉండదు. అర్థమైందా...

క్రిష్: (క్రిష్ ఇంటి దగ్గర) బాపు ఆగండి.. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతే అర్థం ఏంటి. 
దేవా: మరేం చేయమంటావ్ ఇక్కడే కూర్చొని సంతాప సభ పెట్టమంటావా.. 
క్రిష్: నా పెళ్లి సంగతి తేల్చి కానీ ఎవరూ ఇక్కడి నుంచి వెళ్లొద్దు. 
భైరవి: తేల్చుకొనే వచ్చాం కదా మళ్లీ కథ కొత్తగా షురూ చేస్తావా ఏంటి. అక్కడ జరిగింది మర్చిపోయావా.. మన కంటే స్థాయి తక్కువ అయినా వియ్యానికి ఒకే అన్నాం కానీ మనకంటే పొగరు ఎక్కువ అంటే నడవదు. ఇక ఆ పిల్లని మర్చిపో. 
క్రిష్:  ఊపిరి తీసుకోవడం ఆపేమని చెప్పు ఆపేస్తే.. అంతే కాని సత్యని మర్చిపోయే ముచ్చేట లేదు. ఫిక్స్ అయిపోయా ఆ పిల్లనాదే. 
దేవా: కావాలి అంటే దాన్ని ఎత్తుకొచ్చి ఉంచుకో.
క్రిష్: మీరు ఆ పిల్లని తెచ్చి నాకు పెళ్లి చేయాలి. ఒప్పుకోండి అమ్మా వాళ్లు పెట్టిన కండీషన్‌కి ఒప్పుకోండి.
మహదేవయ్య: క్రిష్ కాలర్ పట్టుకొని.. ఏమన్నావ్ రా.. ఏంటిరా నీ లొల్లి..
నందిని: ఏయ్ అన్నా నా పెళ్లిని డిసైడ్ చేసే హక్కు నీకు లేదు నీ వరకు నువ్వు మాట్లాడుకో. ఎవడో గొట్టంగాడు నన్ను ఇచ్చి పెళ్లి చేయమని కండీషన్ పెడితే నరికి పోగులు పెట్టాల్సింది పోయి. నన్ను ఒప్పించాలి అని చూస్తావా.. నీ స్వార్థం కోసం నన్ను భేరం పెడతావా.. నా బతుకు బలి చేయాలని చూస్తావా.. 
మహదేవయ్య: వీడి కళ్లకు ప్రేమ మాయ పట్టింది. మనం కనిపించడం లేదు. 
క్రిష్: నందిని నేను నా పెళ్లి గురించి మాట్లాడను. నువ్వు నీ ఆవేశం పక్కన పెట్టి ఆలోచించు నువ్వు హర్షని పెళ్లి చేసుకుంటే మన ఇంటి ఆడవాళ్లలాగా బానిసలా బతకవు. స్వేచ్ఛగా ఉంటావు..
భైరవి: నోర్ముయ్‌రా మేము బానిసలుగా బతుకుతున్నామా..
క్రిష్: ఒక్కనిమిషం వదినా నువ్వు ఒక్క సారి నోరు తెరువు. మీది బానిస బతుకు అవునా కాదా.. అబ్బబ్బా చూశావా అమ్మా ఇది మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి. కనీసం తన మనసులోని మాట బయటకు చెప్పే స్వేచ్ఛ కూడా లేదు. చూశావా అమ్మా వదిన ఎంతలా భయపడుతుందో..
మహదేవయ్య: నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావా లేదంటే ఎక్కడైనా కూర్చొని ఏడుస్తావా అదంతా నాకు తెలీదు కానీ నా బిడ్డని మాత్రం ఆ ఇంటి కోడల్ని చేసే ప్రసక్తే లేదు. ఇదే ఫైనల్. 

విశాలాక్షి: ఏమైందిరా మీ ఇద్దరికీ ఎందుకు ఇలా ప్రవర్తించి మమల్ని చంపుకుతింటున్నారు.
శాంతమ్మ: మీ చెల్లి ఎలాగూ తెగించేసింది. మమల్ని లెక్క చేయడం మానేసింది. చేసేది లేక మీ అమ్మానాన్న దాని ముందు తల వంచారు. చాలదు అన్నట్లు ఇప్పుడు నువ్వు తయారయ్యావా..
సత్య: అన్నయ్య కావాలనే నా నిశ్చితార్థం ఆపాలని చూశావ్ కదా..
హర్ష: నీకు ముందే చెప్పాను నిశ్చితార్థం ఆపకపోతే నా నిర్ణయం నేను తీసుకుంటానని. నువ్వు మాట వినిలేదు. నువ్వు క్రిష్ నుంచి మన ఫ్యామిలీని కాపాడటానికి ఆ పెళ్లికి ఒప్పుకున్నావు. నేను వాళ్ల ఫ్యామిలీ నుంచి నా చెల్లిని కాపాడుకోవడానికి నందినితో పెళ్లి అన్నాను. 
సత్య: ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచించావు అన్నయ్య. ఈ ఇంటిని పట్టి పీడిస్తున్న సమస్యను నాతోపాటే దూరంగా తీసుకెళ్లాలి అని క్రిష్‌ని పెళ్లి చేసుకుంటా అన్నాను. నువ్వేమో నందినిని పెళ్లి చేసుకోవడం వల్ల మళ్లీ అదే సమస్యను నట్టింట్లో పడేసినట్లు ఉంది. అన్నయ్య నీకు అర్థం కావడం లేదు నందిని ఈ ఇంటిని నరకం చేస్తుంది. 
హర్ష: ఆ ఇంట్లో ఎవరైనా నా చెల్లిని ఏమైనా అనాలి అంటే ఈ ఇంట్లో వాళ్ల బిడ్డ ఉందని గుర్తొచ్చి ఆగిపోవాలి. 
సత్య: క్రిష్ ఎలాంటి పరిస్థితుల్లోనూ నన్ను వదులుకోడు. 
శాంతమ్మ: ఆ మహదేవయ్య కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ తన కూతుర్ని ఈ ఇంటికి ఇవ్వడు. 
విశ్వనాథం: అసలు మన పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో నా పెద్దరికానికి విలువ లేకుండా పోయింది. వీళ్లని చూశాకా రేపు సంధ్య కూడా మన మాట ఎందుకు వింటుంది. చేత గాని వాళ్లలా లెక్కేస్తుంది. 

మరోవైపు క్రిష్ ఇంటికి తన పెద్ద నానమ్మ వస్తుంది. దీంతో భైరవితో పాటు అందరూ షాక్‌ అయిపోయి తెగ భయపడతారు. తర్వాత ఆవిడ మహదేవయ్య దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సారా అలీ ఖాన్‌: రెట్రో లుక్‌తో షాకిచ్చిన సారా అలీ ఖాన్‌ - ఆ నటితో పోలుస్తున్న నెటిజన్లు

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget