అన్వేషించండి

Satyabhama Serial Today January 26th - సత్యభామ సీరియల్: సత్యకు నచ్చిన మాధవ్.. ఓకే చెప్పేస్తుందా.. హర్షని కొట్టిన రుద్ర!

Satyabhama Serial Today Episode: మాధవ్ సత్య కోసం రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరకు క్రిష్‌ వచ్చి కూర్చొవడంతో మాధవ్‌కు, క్రిష్‌కు మధ్య గొడవ జరగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode: మాధవ్ సత్యతో పర్సనల్‌గా మాట్లాడాలి అనుకుంటాడు. ఆ విషయం సత్య వాళ్ల నాన్నకు చెప్తాడు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడంతో ఓ రెస్టారెంట్‌లో కలిసి మాట్లాడుకోవాలని అనుకుంటారు సత్యవాళ్లు. ఇక శాంతమ్మ సత్యకు కండీషన్లు పెడుతుంది. మళ్లీ కలవడం నిశితార్థం రోజే అని చెప్పిరా అని సత్యతో శాంతమ్మ చెప్తుంది. ఇక సంధ్య, సత్య ఇద్దరూ వెళ్తారు. 

సంధ్య: అక్క మనం వెళ్తుంది బావగారి దగ్గరకు ఎవరో రౌడీ దగ్గరకు వెళ్తున్నట్లు ఆ రియాక్షన్ ఏంటి..
సత్య: ఏయ్ నేను ఇంకా పెళ్లి సంబంధానికి ఓకే చెప్పలేదు. బావగారు అంటూ వరస కలపకు.
సంధ్య: నీకు కాబోయే మొగుడిని నేను పేరు పెట్టి పిలిస్తే బాగోదు. ఇలా కంటిన్యూ అయిపోనీ. మనమే లేటు ఇపాటికి బావగారు వచ్చేసి ఉంటారు. 

సత్య, మాధవ్ కలవాలి అనుకున్న రెస్టారెంట్‌కు క్రిష్, బాబీలు వస్తారు. మాధవ్ ఓ టేబుల్‌ని రిజర్వ్ చేస్తాడు. సరిగ్గా అక్కడే క్రిష్ వాళ్లు కూర్చొంటారు. ఆ టేబుల్ రిజర్వ్ అయింది అని బాబీ క్రిష్‌తో చెప్తాడు. 

క్రిష్: ఓరేయ్ బాబీ ఒకసారి ఏదైనా నాకు నచ్చి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎవడైనా వచ్చి ఇది నాది అంటే నాకు కాలుతుందిరా.. అది హోటల్‌లో ఉండే టేబుల్ అయినా సరే మనసు పడ్డ అమ్మాయి అయినా సరే. అరే నీకు ఏం కావాలో నువ్వు ఆర్డర్ చేయ్ రా.. 
మాధవ్: వెయిటర్ నేను టెబుల్ నెంబర్ 4 ని రిజర్వ్ చేశా ఎక్కడ.. వెయిటర్ తీసుకెళ్తాడు.. అక్కడ క్రిష్‌ ఉంటాడు.  
బాబీ: అన్నా ఎవరు వచ్చారో చూడు..
క్రిష్‌: ఏయ్ మిల్క్ బాయ్. ఏంటి ఇలా వచ్చావ్. ఆ రోజు జరిగిన దానికి వచ్చావా.. సరే తొందరగా చెప్పు నేను బిజీగా ఉన్నాను. నేను కోరుకున్న దేవత నాతో పెళ్లికి సై అంది. పార్టీ చేసుకుంటున్నాం..
మాధవ్: ఇది నా టేబుల్..
క్రిష్‌: ఏందీ.. మరి ఇక్కడ ఎందుకు వేశావ్ ఇంట్లో జాగా లేదా.. 
మాధవ్: ఈ టేబుల్‌ని నేను రిజర్వ్ చేసుకున్నా..
క్రిష్‌: హోటల్ అంటే రావాలి తినాలి పోవాలి ఈ రిజర్వేషన్లు నడవ్.. పో.. వేరే జాగా చూసుకో.. పో.. ఇంకో సారి మనకి ఈ కిరికిరి పంచాయితీలు వద్దు.
మాధవ్: లేస్తావా లెగవా.. 
క్రిష్‌: టేబుల్ మీద కాళ్ల వేసి.. నీ నోరు లేస్తున్న కొద్ది నాకు టెంపర్ లేస్తది. నువ్వు మొండితనం చేస్తున్న కొద్దీ నేను గజమొండి తనం చేస్తా.. ఒర్లుడు కాదు దమ్ముంటే లేపరా ఈ కాలిమీద నుంచి ఆ కాలు తీసి పక్కన పెట్టి చూడు. నీకు సలాం కొట్టి పక్కకు వెళ్లి కూర్చొంటా.. 
మాధవ్: మేనేజర్... నేను ఈ టేబుల్ రిజర్వ్ చేశా.. మేనర్స్ లేని వాళ్లని లోపలికి ఎలా రానిచ్చారు. 
మేనేజర్: సార్..
క్రిష్‌: ఏయ్.. నాకు కాదు ఆ మిల్క్ బాయ్‌కి చెప్పు నేను ఒక్కసారి ఫిక్స్ అయితే అడుగు వెనక్కి వేయను అని చెప్పు. ఆల్రెడీ ఒకసారి స్ట్రాంగ్ డోస్ ఇచ్చా ఈసారి మళ్లీ రెచ్చిపోతే బూస్టర్ డోస్ ఇస్తా.. 
మేనేజర్: సార్ గొడవ వద్దు మీకు మేం వేరే టేబుల్ ఇస్తాం. మేడమ్ కోసం మీరు ఆర్డర్ చేసిన బొకే కూడా వచ్చేసింది.
బాబీ: అన్నా గర్ల్ ఫ్రెండ్‌తో మీటింగ్ అనుకుంటనే..
క్రిష్‌: వీడికే ఇంత పొగరు ఉంటే.. వీడి గర్ల్‌ ఫ్రెండ్‌కి ఇంకెంత పొగరు ఉంటుందో..
మాధవ్: రేయ్ తన గురించి ఇంకొక్క మాట నీ నోటి నుంచి వచ్చినా మర్యాదగా ఉండదు.
క్రిష్‌: అంటాను రా. నా ఇష్టం వచ్చినట్లు అంటా ఏం చేస్తావ్.. నన్ను రెచ్చగొడితే నేను ఎందుకు ఊరుకుంటూ.. నువ్వు ఒక పాగల్ గాడివి. నీ లాంటోడిని ఇష్టపడి నీ వెనక తిరుగుతున్న అది ఒక పాగల్‌ది.
మాధవ్: షట్ అప్.. మైండ్ యువర్ వర్డ్స్. నీలాంటి మూర్ఖుడికి ఏం తెలుసురా తన గొప్పతనం.
క్రిష్‌: అబ్బా అంత గొప్పదా.. నా సంపంగి కంటే గొప్పదా.. రానీ చూస్తా..
మాధవ్: రేయ్ ఏంట్రా నువ్వు చూసేది.. నీలా రౌడీయిజం చేసిన వాడి దగ్గర చేయి కూడా లేస్తుంది. అని ఇద్దరూ కాలర్లు పట్టుకొని గొడవ పడతారు. ఇంతలో క్రిష్‌కి తన అన్న ఫోన్ చేసి ఇంకో పని చెప్పడంతో తప్పనిసరిగా క్రిష్‌ వెళ్లిపోతాడు. వెళ్తూ వెళ్తూ క్రిష్ రేయ్ నీ గర్ల్ ఫ్రెండ్‌ని అడిగాను అని చెప్పు అంటాడు. మరోవైపు సత్య కూడా రెస్టారెంట్ దగ్గరకు వచ్చేస్తుంది. ఒకర్ని ఒకరు చూసుకోరు.

విశాలాక్షి: సత్య మీ మాట అయితే వింటుంది అండి గట్టిగా నచ్చచెప్పండి. 
విశ్వనాథం: ఇప్పటి వరకు అన్ని విషయాల్లో జరుగుతున్నది అదే కనీసం పెళ్లి విషయంలో అయినా తనకి వదిలిపెడదాం అని ఆగాను. 
విశాలాక్షి: కానీ ఇంత మంచి సంబంధం తలకిందులుగా తపస్సు చేసినా దొరకదు. అత్తయ్య గట్టిగా మాట్లాడుతుంది అనుకుంటాం కానీ ఇలాంటి విషయాల్లో అలాగే ఉండాలి.
విశ్వనాథం: కాలం మారింది విశాలాక్షి. పిల్లలు ఇంతకు ముందులా కాదు తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు వాళ్లే తీసుకోవాలి అనుకుంటున్నారు. సత్య కూడా అలాగే అనుకుంటుంది. తను మన మీద చూపించే గౌరవాన్ని మనం అడ్వాంటేజ్‌గా తీసుకొని తన ఇష్టాఇష్టాల్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. 

సంధ్య: సత్య వాళ్లు మాధవ్ దగ్గరకు వస్తారు. సత్యతో పాటు సంధ్య రావడం చూసిన మాధవ్ సంధ్య వంక షాకింగ్‌గా చూస్తాడు... బావగారు పెళ్లి కూతురు తను. నేను తోడు పెళ్లి కూతుర్ని. ఏం లేదు నా వంక కళ్లార్పకుండా చూస్తుంటే మర్చిపోయారు ఏమో అని గుర్తుచేస్తున్నాను. అంతే..
సత్య: ఏయ్ ఊరుకో..
మాధవ్: అంటే నేను మిమల్ని ఒక్కర్నే ఎక్స్‌పెక్ట్ చేశాను.
సత్య: తోడు పంపించారు.
మాధవ్: మనసులో.. సత్యతో ఒంటరిగా మాట్లాడుదాం అనుకుంటే మధ్యలో ఈ సెన్సార్‌తో ప్రాబ్లమ్‌గా ఉంది. ఏం చేద్దాం. ఆ ఆ పక్కనే ఉన్న కౌంటర్‌లో పావ్ బాజీ బాగుంటుంది అంట.
సంధ్య: అవునా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే తెచ్చి ఇచ్చేస్తే తిని పెడతాను. నాకు కూడా పావ్ బాజీ అంటే చాలా ఇష్టం.
మాధవ్: నేను వెళ్లి తీసుకురావడం కాదు నీకు వెళ్లి తినమని చెప్తున్నా..
సంధ్య: హో.. అర్థమైంది లేండి బావగారు నేను అడ్డంగా ఉన్నాను అని నేను వెళ్లి అలా కూర్చొని ముబైల్‌తో టైంపాస్ చేస్తాను. మీరు మాత్రం టైం వేస్ట్ చేయకండి. ఆల్ ది బెస్ట్ బావగారు. 
మాధవ్: నవ్వితేనే కాదు నవ్వు ఆపుకుంటే కూడా బాగుంటారు అని ఇప్పుడే తెలిసింది. ఇక సత్యకు బొకే ఇస్తాడు. కారణం తెలుసుకుందాం అని పిలిచాను. నిర్ణయం తీసుకోవడానికి ఇంత టైం తీసుకున్నారు అంటే నా వైపు నుంచి ఏదో నచ్చలేదు ఏమో అనిపించింది. అదేంటో తెలుసుకోవచ్చు.
సత్య: నిజంగా మీలో నచ్చని విషయాలు ఉండి ఉంటే పెళ్లి చూపుల్లోనే చెప్పేసేదాన్ని.
మాధవ్: అంటే నేను మీకు నచ్చినట్టేనా..
 సత్య: ఈ పెళ్లి తర్వాత నా జీవితం నాకు నచ్చినట్లు వెళ్తుందో లేదో అని భయం. ఏ నిర్ణయం తీసుకోకుండా వెనక్కి లాగుంది.
మాధవ్: ఎందుకు అలా అనిపిస్తుంది. మొహమాట పడొద్దు. మనసులో ఏదీ దాచుకోకుండా అడిగేయండి. నాకు కావల్సింది కూడా అదే. నేను కూడా బయటకు ఒకలా లోపల ఒకలా ఉండలేను మనసులో ఏది ఉంటే అది బయటకు మాట్లాడేస్తా. నటించడం నాకు రాదు. నాకు ఆ అవసరం లేదు. నూరేళ్లు కలిసి బతకాల్సిన వాళ్లం. ఇద్దరి మనసులు కలవడం చాలా అవసరం.
సత్య: నిజానికి నాకు ఇప్పడే పెళ్లి చేసుకోవాలి అని లేదు. నేను చదువుకుంది నా పిల్లలకు చదువు చెప్పడానికే కాదు. ఆడపిల్ల తలచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించడానికి. నా కాళ్లమీద నేను నిలబడుతూ నాలాంటి ఆడపిల్లలకు ఆదర్శంగా నిలబడటానికి చాలా ఆశలు ఆశయాలు ఉన్నాయి. ఈ పెళ్లితో అవన్నీ సమాధిగా అయిపోతాయి ఏమో అని దిగులుగా ఉంది. అందరిలానే మిగిలిపోతానేమో అని భయంగా ఉంది. ఇంట్లో వాళ్ల ఫోర్స్‌కి తలవంచి పెళ్లికి రెడీ అయ్యానే కానీ నా ఆశలను చంపుకోలేను.
మాధవ్: చంపుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ని రోజులు మీ ఆశలను మీరే మోస్తున్నారు. ఇప్పుడు నా రూపంలో ఇంకో భుజం కూడా మోయడానికి రెడీగా ఉంది. లైఫ్‌లో ఇండిపెండెంట్‌గా ఎదగాలి అన్న మీ ఆలోచన నాకు చాలా నచ్చింది. అమెరికా వెళ్లాక కూడా మీరు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సరేనా.. ఇంకేమైనా సందేశాలు ఉన్నాయా..
సత్య: అంటే అది మిడిల్ క్లాస్ ఇళ్లల్లో ఆడపిల్లల పెళ్లి పైకి పండగే కానీ అది కనపడని భారం. నా సంతోషం కోసం మా ఇంట్లో వాళ్ల అందరి సంతోషాన్ని తాకట్టు పెట్టడం..
మాధవ్: అర్థమైంది ఈ పెళ్లి వల్ల మీరే కాదు మీ వాళ్లు కూడా నిజంగా సంతోష పడతారు ఆ విషయం నాకు వదిలేయండి. నేను కూడా ఒకటి అడగొచ్చా.. నన్ను ఇష్టపడితే పెళ్లికి అభ్యంతరం లేకపోతే కేక్ మీద చెర్రీ తీసుకోండి. సత్య తీసుకునే టైంలో సంధ్య వచ్చి  చెర్రీ తీసుకుంటుంది. 
సంధ్య: కంగారు పడకండి చెర్రీ నాది అక్క మీది. 

మరోవైపు సత్య అన్న హర్ష, రుద్ర దగ్గరకు వస్తాడు. రుద్ర దగ్గర ఉన్న రౌడీ బ్యాంక్‌లో లోను తీసుకొని కట్టడం లేదుని దాని వల్ల తన జాబ్ పోతుంది అని అంటాడు. అయితే రుద్ర హర్షని బెదిరిస్తాడు.. కొడతాడు.. మరోవైపు క్రిష్ అక్కడికి వస్తాడు. తన అన్న హర్షని కొట్టడం చూస్తాడు. తన అన్న తన బావమరిదిని కొడుతున్నాడని బాబీతో చెప్పి కంగారు పడతాడు. బాబీ అక్కడి నుంచి వెళ్లిపోదాం అని చెప్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సీతే రాముడి కట్నం సీరియల్ జనవరి 26th: అక్కను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తండ్రి మీదే కంప్లైంట్ ఇచ్చిన సీత!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget