అన్వేషించండి

Satyabhama Serial Today January 11th Episode: తన సంపంగి మనసుపడ్డ చీర కొన్న క్రిష్.. బిల్‌ ప్రేమలేఖను ముక్కలు చేసిన సత్య!

Satyabhama Serial Today Episode సత్యభామ మనసు పడ్డ చీరను తనకు తెలీకుండా క్రిష్ కొనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode: సత్యభామ షాపింగ్‌మాల్‌కి తనకోసమే వచ్చిందని క్రిష్ అనుకుంటాడు. సత్యభామకు కాఫీ పంపించి తాను దూరం నుంచి చూస్తూ సత్య కాఫీ తాగిన టైంలోనే తాను తాగుతాడు. ఇక కాళీ సత్యకు క్రిష్ ప్రేమ గురించి చెప్తానని చెప్పి సత్యకు క్రిష్ పెద్ద రౌడీ అనేలా చెప్తాడు. దీంతో సత్య చాలా భయపడిపోతుంది. కంగారుగా అక్కడి నుంచి తన ఫ్యామిలీని తెసుకెళ్లిపోవాలిని చూస్తుంది. ఇక శారీ బిల్ మీద నేను కాఫీకి పిలవగానే వచ్చినందుకు.. నాతో కలిసి కాఫీ తాగినందుకు థ్యాంక్స్‌ అని రాస్తాడు. అది చూసిన సత్య చాలా కంగారు పడుతుంది. కౌంటర్‌లో తానే బిల్ కడతాను అని వాళ్ల నాన్నకి డబ్బులు అడిగి తానే బిల్ కడుతుంది. 

కాళీ: చూశావా అన్న నువ్వు ఇచ్చిన లెటర్ చూసి ఏం గొడవ చేయకుండా వాళ్ల నాన్నకి చూపించకుండా ఎంత భద్రంగా పట్టుకుందో.. నేనేదో బెదిరించా అని అనవసరంగా నన్ను బ్లేమ్ చేశారు. అన్న నువ్వుంటే ఇష్టం లేకపోతే వదిన ఎందుకు దాచిపెట్టుకుంటుంది అన్న.
క్రిష్‌: ఏమోరా.. నమ్మాలి అనిపిస్తున్నా నమ్మలేకపోతున్నా.. కళ్లముందే కనిపిస్తున్నా నిజమే అయితే బాగున్నూ అనిపిస్తోంది. అవును అనిపిస్తోంది. కాదు అనిపిస్తోంది. నొప్పి లేని బాధ. రేయ్ ఇది ఎక్కడకెళ్లి మొదలైంది రా గుర్తొస్తే చాలు గుండె జల్లుమంటోంది. 
కాళీ: అన్నా వదిన వెళ్లిపోతుంది వెళ్లి బాయ్ చెప్పవా..
క్రిష్‌: నేను బాయ్ చెప్తే మా మామ మా ప్రేమకి గుడ్‌బాయ్ చెప్తాడురా.. రేయ్ బాబీ మనకి ఒక చిన్న పని పడిందిరా అది పూర్తి చేసుకొని వెళ్దాం పదరా.. రేయ్ ఇందాక మీ వదిన ముచ్చటపడి వదిలేసి వెళ్లిన చీర ఇదే కదరా.. 
బాబీ: అవును అన్న 25 వేలు అనేసరికి వదిలేసింది పాపం.
క్రిష్‌: నన్ను చేసుకుంటే ఇట్టాంటివి రోజూకి ఒకటి కొనిపెడతా కదరా అని అంటాడు. ఇక ఆ చీర ప్యాక్ చేయమంటే ఇంకో ఆమె ఆల్రెడీ తీసుకుంది అని చెప్తారు. దాంతో క్రిష్ ఆమెతో గొడవ పెట్టుకుంటాడు. 50 వేలు ఇస్తానని ఆమెకు చెప్పినా ఆమె వినకపోతే.. గన్ తీసి చూపిస్తే ఆమె భయపడి ఇచ్చేస్తుంది. 

మరోవైపు సత్యవాళ్లు ఇంటికి వస్తారు. శాంతమ్మకు చీర చూపిస్తే ఆమె చీరను సత్యమీద వేసి నిజంగా సత్యభామలా ఉన్నావని అంటుంది. దీంతో సంధ్య అయితే అక్క జీవితంలోకి క్రిష్ రాబోతున్నాడు అంటుంది. క్రిష్ ఎవరే అని శాంతమ్మ అడిగితే కృష్ణుడిని మా యూత్ క్రిష్ అని పిలుస్తారు అని అంటుంది. 

విశాలాక్షి: అమ్మా సత్య చీర బిల్లు ఇవ్వు. మళ్లీ ఏ అవసరం ఉంటుందో దాచిపెడతా..
సత్య: తడబడుతూ అది ఎక్కడో పడిపోయింది అమ్మ.
శాంతమ్మ: సరిపోయింది ఏం పిల్లవే బిల్లే పోగొట్టావు అంటే రేపు అత్తారింట్లో ఎలా కాపురం చేస్తావే.. ఆడపిల్ల అంటే ఏం ఇచ్చినా పదికాలాల పాటు జాగ్రత్తగా దాచుకోవాలి. అది వస్తువు అయినా సరే బంధం అయినా సరే.
విశ్వం: ఏంటి అమ్మా అలా అన్నావ్ ఇప్పుడు సత్య చూడా ఎలా వెళ్లిపోయిందో..

బాబీ: ఏంటి అన్నా ఆ చీర చూసి నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావ్.
క్రిష్‌: పాపంరా వాళ్ల నాన్నతోటి ఖర్చు పెట్టించడం ఇష్టం లేక ఈ చీరని తీసుకోలేకపోయిందిరా. ఇదే చీరని గిఫ్ట్‌గా ఇస్తే ఎంత థ్రిల్‌గా ఫీలవుతుంది కదరా..
కాళీ: మనసులో.. నువ్వు ఇస్తే ఈ చీరే కాదురా గోల్డ్ ఇచ్చినా తీసుకోదు. ఇప్పటికే నువ్వంటే అసహ్యం పెరిగిపోయేలా చేశా. పెంచుకో ఇట్లానే ఆశలు పెంచుకో.. సడెన్‌గా నేలమీద పడితే కానీ నీ మీద నాకున్న పగ చల్లారదే. 
బాబీ: అన్నా కేవలం చీర చూసే నువ్వు ఇంత సంబర పడుతున్నావ్ ఎట్లా అయినా వదినను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇదే చీరలో నీ కళ్లముందే కనపడుతుంది కదా అన్న.
క్రిష్‌: అరే ఇంకా నన్ను డైరెక్ట్‌గా చూడలే. అప్పుడే పెళ్లిదాక వెళ్లిపోయావు ఏంట్రా. దానికి ఇంకా టైం ఉందిలే. 
కాళీ: అన్నా లేదు అన్నా అంత టైంలేదు. వదినా మస్త్ అందంగా ఉంటుంది కదా అన్న ఆమెను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకులు క్యూ కడతారే. నువ్వు ఇక్కడ కూర్చొని మురిసిపోతూ ఉంటే అక్కడ పెళ్లి జరిగిపోతుందే. అందుకే నువ్వు తొందర పడాలి. 
క్రిష్‌: అవున్రా ఇంత వరకు ఏ పోరిని చూసినా పట్టించుకోని నేను. సత్యని చూసి ఇంత ఫిదా అయినాను అంటే ఎంత మంది ఆమెను చేసుకోవాలి అని కలలు కంటూ ఉంటారురా.. అవున్రా వాడి ఎవడో ఐలవ్ యూ చెప్తే నో చెప్పింది అలాగే నాకు కూడా చెప్తుందా ఏంట్రా.
కాళీ: నీకు ఎందుకు చెప్తుంది అన్న. పతంగి మీద లవ్ లెటర్ రాస్తే చదివి నువ్వు చెప్పిన చోటుకి వచ్చింది కదా.. బిల్‌మీద రాస్తే దాన్ని దాచుకుంది కదా.. ఇంకా ఏం సాక్ష్యం కావాలే నీకు. ఈ పాటికి వదినా ఆ లెటర్ చూసి మురిసిపోతూ ఉంటుంది. 
క్రిష్‌: అవున్నా ఇన్ని జరిగాయి అంటే నా పిల్లకి నా మీద ఇష్టం పెరిగింది అనుకుంటా..
సత్య: బిల్‌మీద రాసింది చూస్తూ.. నువ్వు ఎవరివో ఎలా ఉంటావో నాకు తెలీదు. కానీ నీవల్ల నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నువ్వు చేసిన పనివల్ల నా ఆశయాలను చంపుకొని మొదటి సారి రాజీ పడి పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు ఎప్పుడూ ఎదురు పడకూడదు అని కోరుకుంటున్నాను. కానీ పొరపాటున ఎదురు పడితే మాత్రం నిన్ను వదిలిపెట్టను. 
కాళీ: వదిన నిన్ను వదిలిపెట్టదు అన్న చూసిన మరుక్షణం పరుగెత్తుకుంటూ వచ్చి నిన్ను హగ్ చేసుకుంటుంది.
సత్య: నా పెళ్లికి నువ్వు ఎలా కారణం అయ్యావో. నీ బాధకి నేను కారణం అవుతాను. 
క్రిష్‌: ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్నారా.. (సత్య బిల్ చింపేసి విసిరేస్తుంది.)
కాళీ: మనసులో మీరిద్దరూ కలిసే క్షణం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా. ఆరోజు వచ్చే సమయానికి ఆ సత్యకు నిన్ను చంపేయాలి అన్నంత కోపం తెప్పిస్తా. 
మైత్రి: ఏంటే ఎప్పుడూ సత్యభామ అలక పాన్పు మీద ఉన్నట్లు ఒంటరిగా కనిపిస్తావు ఏంటి. అవును సంధ్య ఏది. 
సత్య: నీకు సంధ్య కావాలా హర్ష కావాలా..
మైత్రి: సరే హర్ష ఎక్కడ చెప్పు.
సత్య: సంధ్య కంప్యూటర్ కోర్స్‌లో చేరింది స్టడీ మెటీరియల్ కోసం ఇద్దరూ వెళ్లారు. 
మైత్రి: అసలు ఏమైంది సత్య నీకు. ఇంతకు ముందు ఏ విషయం అయినా నాతో షేర్ చేసుకునేదానివి నేను లేకుండా షాపింగ్‌కు వెళ్లేదానివే కాదు. అలాంటిది నన్ను నీ లిస్ట్‌ నుంచి తీసి పారేశావే.
సత్య: పిచ్చిగా మాట్లాడకు నా టెన్షన్‌లో నేను ఉన్నాను. 
మైత్రి: నీకు టెన్షనా.. చిరిగిన బిల్ కాగితం ముక్క తీసుకొని అందులో ఐ లవ్‌యూ అని ఉంటడం చూసి.. నువ్వు రాసి చించావా.. లేక ఎవడో రాసింది చించావా..
సత్య: నేనేంటో నీకు బాగా తెలుసు. నేను ఎవరి జోలికి వెళ్లను నా జోలికి ఎవరూ వస్తే వదలను. ఎవడో కానీ నాకు తెలీకుండా నీడలాగ నా జీవితంలోకి రావాలి అని ట్రై చేస్తున్నాడు. నా చేతుల్లో చెంప దెబ్బ తిన్న కాళి అనే రౌడీ చెప్పాడు. చాటుగా వేషాలు వేస్తున్నాడు. అని మొత్తం  చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్  పూర్తవుతుంది. 

Also Read: Jagadhatri Serial January 11th: కౌషికితో కన్నీళ్లు పెట్టించిన వైజయంతి.. దాత్రి కోసం మరో ప్లాన్ వేసిన యువరాజ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget