అన్వేషించండి

Satyabhama Serial Today February 8th: సత్యభామ సీరియల్: ప్రేమించిన వాడితో సత్య రాసలీలలు.. తలపట్టుకున్న విశ్వనాథం ఫ్యామిలీ!

Satyabhama Serial Today Episode సత్య, క్రిష్‌లు ప్రేమించుకుంటున్నారు అంటూ కాళీ సత్య వాళ్ల ఇంటి గోడల మీద రాయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Telugu Serial Today Episode: క్రిష్ మాధవ్ వాళ్ల కారును అడ్డుకుంటాడు. సత్య జోలికి రావొద్దని వార్నింగ్ ఇస్తాడు. మొత్తం ఫిక్స్ అయిపోయాను అని సత్య నాదే అని అంటాడు. వాడు నిజంగా రాక్షసుడిలా ఉన్నాడని భయంగా ఉంది అని సునంద మాధవ్‌తో అంటుంది. ఇలాంటి రౌడీలకు భయపడాల్సిన అవసరం లేదు అని మాధవ్ అంటాడు. మరోవైపు విశాలాక్షి వంట చేస్తుంటే సాయం చేస్తా అని సత్య వస్తుంది. వంట తాను చేస్తానని తల్లిని సత్య పంపించేస్తుంది. ఇక సత్య వాళ్ల ఇంటి బయట అందరూ చేరడం సత్య చూస్తుంది. ఏమైందా అని అక్కడికి వెళ్తుంది. సత్య వాళ్ల గోడ మీద క్రిష్, సత్యల ప్రేమాయణం అని.. ప్రేమించిన వాడితో సత్య రాసలీలలు అని.. ముద్దులు పెట్టుకున్నట్లు స్కెచ్‌ వేసుంటారు. అది చూసి సత్య షాక్ అవుతుంది. 

శాంతమ్మ: ఓరేయ్ విశ్వం జనాలు మన ఇంటి ముందు గుమిగూడారురా.. ఏమైందో ఏంటో ఒకసారి ఇలా రా.. 
సత్య: వాళ్లు వచ్చేస్తున్నారు ఎలా అయినా ఆపాలి.. సత్యవాళ్లని ఆపుతుంటే బయట నుంచి ఒకావిడ వాళ్లు కూడా చూసి తరించని అని అంటుంది. ఆ రాతలు చూసి విశ్వనాథం కుప్పకూలిపోతాడు. ఇంట్లో అందరూ ఏడుస్తారు. 
హర్ష: రేయ్ ఎవడ్రా రాశారు ఇదంతా.. సత్య వాళ్లని తలా ఓ మాట అంటారు. ఆ మాటలకు సత్య ఫ్యామిలీ మొత్తం చాలా ఏడుస్తారు.
సత్య: ఇంక ఆపుతారా.. ఎందుకు ఆడపిల్ల అంతే మీకు అంత లోకువ. ఎందుకు అంత చులకన చేసి మాట్లాడుతారు. మీకు కూతురు ఉంది వాళ్లకి ఇలాంటి పరిస్థతి వస్తే ఇలాగే మాట్లాడుతారా.. నిజం ఏంటో తెలుసుకోరా.. ఇలా వీధుల్లోకి వచ్చి పెద్దరాయుళ్లాగా తీర్పులు ఇచ్చేస్తారా.. మా నాన్న ఇంట్లో వాళ్లు ఏడుస్తుంది గోడమీద రాతలకు కాదు మీ మాటలకు. పొరుగింటిలో సమస్య వస్తే అండగా నిల్చోవాల్సింది పోయి సూటిపోటి మాటలతో కుళ్లబొడవడం ఏంటి ఇదేనా సంస్కారం. సపోర్ట్‌గా నిలబడకపోతే నిలబడకపోయారు. కానీ ఇలా మాట్లాడకండి. దయచేసి నా చావుని చూడాలి అనకండి వెళ్లండి. వెళ్లండి.. 
శాంతమ్మ: పరువు పోగొట్టుకున్నాక సిగ్గులేకుండా ఇంకా ఎందుకురా రోడ్డుమీద పదండిరా లోపలికి..
కాళీ: ఇది ఇది కాళీ గాడి దెబ్బంటే.. నువ్వు నా చెంప మీద కొట్టావ్ నేను నీ జీవితం మీద కొట్టా.. ఇంకా కొడుతూనే ఉంటా. నేను కొట్టే దెబ్బలకు నువ్వు నీ కుటుంబం ఇలానే కుళ్లి కుళ్లి ఏడుస్తూ చావాలి. 
విశ్వనాథం: మంచి నీళ్లు కాదు నాకు కావాల్సింది ఇంత విషం తీసుకొచ్చి ఇస్తారా..
విశాలాక్షి: ఏంటి అండీ ఆ మాటలు..
విశ్వనాథం: ఇంకా ఎన్ని రోజులు విశాలాక్షి.. పరువు పరువు అంటూ ఇన్నాళ్లు పిచ్చొడిలా వెంపర్లాడా. పోయింది మొత్తం పోయింది. గోడలకు ఎక్కాం రేపోమాపో వీధిన పడటమే ఉంది. 
శాంతమ్మ: నా కూతుళ్లు మాణిక్యాలు లక్షల్లో ఒకరు అన్నావు. ఇప్పుడు తెలిసొచ్చిందా ఎంత పెద్ద తప్పు చేశావ్.. 
హర్ష: ఇందులో సత్య తప్పు ఏం ఉంది నానమ్మ.
శాంతమ్మ: నీకు ఇంకా అర్థం కావడం లేదా.. దర్జాగా తిరిగే మీనాన్న ఇప్పుడు ముఖం దాచుకొని ఇంట్లో కూర్చొవాల్సిన పరిస్థితి.
విశాలాక్షి: మీరు కూడా వీధిలో వాళ్లలా మాట్లాడకండి అత్తయ్య. నా కూతురు ఎప్పుడూ పరువు తక్కువ పనులు చేయదు. నాకు ఆ నమ్మకం ఉంది. మనవైపు నుంచి ఏ తప్పు లేకపోయినా ఆ దేవుడు శిక్షిస్తున్నాడు. ఈ తప్పు చేసింది ఎవరో మనందరికీ తెలుసు. ఎవడి పాపానికి వాడే పోతాడు. వదిలేయండి. 
హర్ష: నువ్వు చెప్పినట్లే వదిలేద్దాం అమ్మా. కానీ వాడు వదిలేయడు అమ్మా. వాడికి జరిగిన అవమానానికి కోపం పెంచుకొని పగ సాధిస్తున్నాడు. మన మౌనం వాడి దృష్టిలో చేతకాని తనం అయింది. పోలీస్‌లకు ఫిర్యాదు చేద్దాం. చేతకాదు అని చేతులు ముడుచుకు కూర్చొవడం కాదు ఎదురుతిరుగుదాం.
విశాలాక్షి: పరిస్థితుల్ని జరిగిన సంఘటనలు చూస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే మంచిది.
హర్ష: ఆ రౌడీ సత్య వెంట పడి వేధిస్తున్నాడు.. ఫిజికల్‌గా ఇబ్బంది పెడుతున్నాడు అని చెబుదాం.
సత్య: అదేంటి అన్నయ్య అదెలా కుదురుతుంది. అబద్ధం ఎలా చెప్తాం.
శాంతమ్మ: నువ్వెప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. ఏదీ దాయలేదు మరీ..
హర్ష: అది కాదు నాన్న మనం ఎదురుతిరుగుతుంది మామూలోడి మీద కాదు ఒక పెద్ద రౌడీమీద. 
సత్య: తప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు.
విశ్వనాథం: హర్ష నాకు కూడా అది ఇష్టంలేదు.
హర్ష: కానీ తప్పదు నాన్న.. ఇంతలో శేఖర్ కాల్ చేస్తాడు. విశ్వనాథ్‌ కంగారు పడతాడు. క్రిష్‌ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకోమని బెదిరించాడు అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read:  సమంత: ఇంట్లో ఒత్తిడి.. మళ్లీ పెళ్లికి సిద్ధమైన సమంత? - బంధువుల అబ్బాయితో పెళ్లట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget