అన్వేషించండి

Satyabhama Serial Today February 7th - సత్యభామ సీరియల్: క్రిష్ ఎదురుగానే మాధవ్‌ని పెళ్లి చేసుకుంటానన్న సత్య

Satyabhama Serial Today Episode సత్య తన తండ్రితో మాట్లాడిన మాటలు తన కోసమే అని కాళీ క్రిష్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode  తన జీవితంలో సత్యకు తప్ప మరో అమ్మాయికి చోటు ఇవ్వను అని మాధవ్ తేల్చిచెప్తేస్తాడు. తన ఈ జీవితానికి సత్యే భార్య అని వాళ్ల అమ్మకి చెప్పాడు. ఇక శేఖర్‌ కూడా కొడుకుకే సపోర్ట్ చేస్తాడు. మాధవ్ లాంటి భర్తను పొందబోతున్నందుకు సత్య నిజంగా అదృష్టవంతురాలు అంటాడు. మరోవైపు సత్య బాధపడుతుంది. సంధ్య సత్యతో మాట్లాడుతుంది. సత్య మాధవ్‌తోనే తన పెళ్లి జరుగుతుంది అని కరాకండిగా చెప్తేస్తుంది.

సత్య: నిశ్చితార్థానికి నో చెప్పాడు ఏం జరిగింది. ముఖం మీద ఛీ కొట్టాక చెంప దెబ్బ కొట్టాక, వాడు అంటే అసహ్యం అని చెప్పాక ఇంకా ఏ ముఖం పెట్టుకొని నా దగ్గరకు వస్తాడు. 
సంధ్య: తెగించిన వాడికి అడ్డూఅదుపు ఉండదు అక్క. 
సత్య: అసలు వాడు ఏంటి వాడి ప్రవర్తన ఏంటి మనిషిలో ఏమాత్రం అయినా సంస్కారం ఉందా. మంచితనం ఉందా.. అడ్డగాడిద లాగా రోడ్లు పట్టుకొని తిరిగేవాడు ఆశకైనా అడ్డు ఉండాలి. ఏదైనా కోరుకుంటే దానికి అర్హత ఉండాలి. రోడ్డు సైడ్ రోమియోలా వెంటపడి బెదిరిస్తే భయపడి పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నాడా..
సంధ్య: అక్క వాడిని చూస్తుంటే బలవంతంగా అయినా నీ మెడలో తాళి కట్టేస్తాడు అనిపిస్తోంది. 
సత్య: అలాంటి పరిస్థితి వస్తే వాడిని చంపి జైలులో కూర్చొడానికి అయినా నేను సిద్ధం. అంత కసి.. కోపం నాకు.. అందరి ముందు నన్ను దోషిలా నిలబెట్టాడు. బలవంతంగా నా చేయిపట్టుకొని లాక్కెల్లబోయాడు. ఆ క్షణం నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా. నిజం అందరికీ తెలిసి పోయింది కదా ఇక వాడిని ఎవరూ నమ్మరు. ఎన్ని అవాంతరాలు వచ్చినా మాధవ్‌తో నా పెళ్లి జరుగుతుంది. 
సంధ్య: నాకు మాత్రం నీ పెళ్లి అంత ఈజీగా జరుగుతుంది అని అనిపించడం లేదు అక్క. ఆ రౌడీ అంత ఈజీగా వదలడు అక్క.

సత్య కుటుంబాన్ని నాశనం చేద్దామని బాబీ క్రిష్‌తో చెప్తే కాళీ ఆవేశంగా వచ్చి బాబీని కొడతాడు. క్రిష్‌ని ఓదార్చకుండా రెచ్చగొడతావని తిడతాడు. సత్య మోసం చేసిందని బాబీ అంటే వదిన ఇంకా అన్ననే లవ్ చేస్తుందని కాళీ అంటాడు. 

క్రిష్: ఏం వాగుతున్నావ్ రా.. 
కాళీ: కాదు అన్న నిజం తెలుసుకొని వచ్చాను. వదిన నిన్ను ప్రేమించింది ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తుంది.
బాబీ: ఏంట్రా అక్కడ తను మోసం చేస్తే ఇక్కడ నువ్వు మోసం చేయాలి అని చూస్తున్నావా.. 
కాళీ: ఏం జరిగిందో తెలుసుకోకుండా రెచ్చగొడుతుంది నువ్వు. నేను వదిన ఇంటికి వెళ్లి వస్తున్నా అన్నా.. నా మీద నమ్మకం కలగడం లేదా.. వదిన మాటల్ని ఇందులో రికార్డ్ చేశాను. అంటూ సత్య తన తండ్రితో మాట్లాడిన మాటలు చూపిస్తాడు. అది చూసిన క్రిష్ నిజమే అనుకుంటాడు. 
బాబీ: అవును అన్న వదినను అపార్థం చేసుకున్నాను. 
క్రిష్: ఇటు రారా.. బాబీని పిలిచి.. అపార్థం చేసుకున్నాం  ఏంట్రా.. చెత్తంతా వాగింది నువ్వే. నన్ను కలుపుతావు ఏంటి. నా సత్య నన్ను మోసం చేసిందా.. తను ఇంత ప్రేమిస్తుంది అని తెలిశాక ఎలా వదిలేస్తాను చెప్పు. తను నా జిందగీరా.. ఆ అమెరికా పెళ్లికొడుకును చూసుకోనే కదా అసలు వాడిని ఇండియా నుంచి పారిపోయేలా చేయాలి. 

మరోవైపు హర్ష క్రిష్ మీద పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని చెప్తాడు. దానికి విశాలాక్షి వద్దు అని అంటుంది. సత్యను కోర్టు మెట్లు ఎక్కించొద్దని దాని వల్ల కష్టాలు ఎక్కువవుతాయి అని వద్దు అని ఆపేస్తుంది. ఇంతలో మాధవ్ ఫ్యామిలీ సత్య ఇంటికి వస్తారు. విశ్వనాథం సత్యను బయటకు పిలుస్తాడు. 

సునంద: అమ్మా సత్య నిన్న అందరి ముందు నిలదీశాను అని కోపంగా ఉందా..
సత్య: బాధగా అనిపించింది. 
సునంద: సారీ చెప్పడానికే వచ్చాను. గొడవ జరగడం వల్ల నా మనసు కూడా డిస్ట్రబ్‌ అయింది. 
విశాలాక్షి: వదినా ఆ విషయం వదిలేయండి.
మాధవ్: మేం ఎవరం ఆ రౌడీ మాటలు సీరియస్‌గా తీసుకోలేదు. ఈ నిశ్చితార్థం జీవితాంతం నా చేతికే ఉంటుంది. ఈ అమ్మాయి ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసింది. ఎప్పటికీ తనే నా ప్రాణం. 
శేఖర్: అర్థమైంది కదా అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. 

మరోవైపు మాధవ్ వాళ్ల కారుకి క్రిష్ అడ్డుగా నిల్చొంటాడు. క్రిష్ సత్యని వదిలేయ్‌మని మాధవ్‌కి చెప్తాడు. మాధవ్ కూడా క్రిష్ మీద తిరగబడతాడు. ఇప్పటికీ సత్య తననే ప్రేమిస్తుంది అని క్రిష్‌ మాధవ్‌తో చెప్పాడు. సత్యని తనకి కాకుండా చేసే వారిని చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 7th: దేవయాని, శైలేంద్రకి ఇచ్చిపడేసిన వసు - కొత్తవ్యక్తి వసుకి ఎందుకు హెల్ప్ చేసినట్టు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
Ap Crime News: ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు-  విజయవాడలో దారుణం
ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు- విజయవాడలో దారుణం
Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
Medak News: మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP DesamRohit Sharma Emotional After Win | T20 World Cup 2024 సెమీస్ లో గెలిచాక రోహిత్ శర్మ ఎమోషనల్ | ABPInd vs Eng Semi Final 2 Match Highlights | ఇంగ్లండ్ పై ఘనవిజయం T20 WorldCup 2024 Finalకు భారత్ | ABPSouth Africa vs Afghanistan Semi final 1 Match Highlights | సెమీస్ లో ఆఫ్గాన్ మడతపెట్టేసిన సౌతాఫ్రికా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
Ap Crime News: ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు-  విజయవాడలో దారుణం
ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు- విజయవాడలో దారుణం
Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
Medak News: మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
Airtel: నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
US Presidential Debate: ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
Rishab Shetty: ‘కల్కి‘ బుజ్జితో ‘కాంతార’ స్టార్ ఫ్యామిలీ సరదాలు- నెట్టింట్లో ఫోటోలు వైరల్
‘కల్కి‘ బుజ్జితో ‘కాంతార’ స్టార్ ఫ్యామిలీ సరదాలు- నెట్టింట్లో ఫోటోలు వైరల్
Tax Saving: తల్లిదండ్రులు-భార్యపిల్లల ద్వారా ఆదాయపుపన్ను ఆదా.. ఇవిగో మార్గాలు..!
తల్లిదండ్రులు-భార్యపిల్లల ద్వారా ఆదాయపుపన్ను ఆదా.. ఇవిగో మార్గాలు..!
Embed widget