అన్వేషించండి

Guppedantha Manasu February 7th Episode: దేవయాని, శైలేంద్రకి ఇచ్చిపడేసిన వసు - కొత్తవ్యక్తి వసుకి ఎందుకు హెల్ప్ చేసినట్టు!

Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu February 7th Episode:  (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 7 ఎపిసోడ్)

రాజీవ్ బలవంతంగా వసుని లాక్కెళుతుంటాడు.. ఓ గొంతు వినిపించడంతో ఆగిపోతాడు రాజీవ్. వసుధార కూడా ఆ వ్యక్తి ఎవరా అన్నట్టు చూస్తుంది. ఎవడ్రా నువ్వు అడ్రస్ ఏమైనా కావాలా నేనే ఈ ఏరియాకు కొత్త అంటూ వసుని చేయిపట్టి తీసుకెళ్లిపోతుంటాడు రాజీవ్. ఆ కొత్త వ్యక్తి వచ్చి రాజీవ్ ని అడ్డుకుంటాడు... నువ్వేమైనా కొత్త హీరోవా ఏంటి అని అడుగుతాడు. తనను వదిలిపెట్టు అని స్ట్రాంగ్ గా చెబుతాడు కానీ రాజీవ్ పట్టించుకోడు...వదలకపోతే ఏం చేస్తావ్ అని మరింత రెచ్చగొడతాడు..గన్ తీసి రాజీవ్ కి గురిపెడతాడు ఆ వ్యక్తి...ఇక కాంప్రమైజ్ కావడమే బెటర్ అనుకుంటూ రాజీవ్ వసు చేయి వదిలేస్తాడు..ఆ వ్యక్తి ఎవరా అని వసుధార ఆశ్చర్యంగా చూస్తుంటుంది. 
రాజీవ్: మీరు తప్పుగా అనుకుంటున్నారు..తను నా మరదలు, నాకు కాబోయే భార్య..మాది బావ మరదళ్ల సరసం మాకు ప్రాబ్లెమ్ లేదు మేం చూసుకుంటాం నువ్వు బయలుదేరు..చెప్తున్నా కదా గన్ దించు...నువ్వు ఎవరు, పోలీసువా, రౌడీవా, గూండావా...
కొత్త వ్యక్తి: నేను ఎవరో తెలియడం కావాలా నువ్వు ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటపడడం కావాలా
రాజీవ్: అంటే చంపేస్తావా...
కొత్తవ్యక్తి: డౌటా...
వసువైపు హెచ్చరికగా చూస్తూ ఈ సారికి వదిలేస్తున్నా అన్నట్టు రాజీవ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు...
కొత్తవ్యక్తి: మిమ్మల్ని ఎక్కడ దింపాలి
వసు: ఎక్కడికి వెళ్లాలో తెలియదు..మీరు వెళ్లిపోండి థ్యాంక్యూ అనేసి వసు వెళ్లిపోతుంది

Also Read: వసుని లాక్కెళుతున్న రాజీవ్ ను ఆపిన వ్యక్తి ఎవరు - రిషి వచ్చేశాడా!

రిషి ఫొటోకి దండ వేసేసి అందరూ కూర్చుని ఏడుస్తుంటారు..ఇంతలో అక్కడకు వచ్చిన వసుధార కోపంగా రిషి ఫొటోకున్న దండలు తీసేసి విసిరేస్తుంది.. సర్ మీకేం కాలేదు కదా వీళ్లకి తెలియక అలా చేశారంటూ ఏమోషనల్ అవుతుంది...మీరున్నారని నాకు తెలుసు, క్షేమంగా ఉన్నారని నాకు తెలుసు
ఏంటమ్మా వసుధారా అని అందరూ నచ్చచెబుతారు కానీ వసుధార మాత్రం వినదు..ఇదంతా చేసిందెవరు అంటూ ఫైర్ అవుతుంది.. వసు ప్రవర్తనని అంతా వింతగా చూస్తారు. రిషి లేడన్న మాట ఎవ్వరన్నా కానీ వసుధార ఒప్పుకోదు..త్వరలోనే మనదగ్గరకు వస్తారని స్ట్రాంగ్ గా చెబుతుంది.రిషి సర్ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారంటే ఎవ్వరూ నమ్మరు...మా బంధం విడిపోదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీరంతా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అవుతుంది...ఏడుస్తున్న మహేంద్రని ఓదార్చుతుంది. ఇక్కడున్న అందరికన్నా మా గురించి మీకే తెలుసుకదా...వసుధార అంటే రిషి సర్..రిషి సర్ అంటే వసుధార.. మా తనువులు వేరైనా ప్రాణం ఒక్కటే. నేను బతికున్నది నిజం అయితే రిషి సర్ కూడా బతికి ఉన్నట్టే...ఇలా చేయడం సరికాదు
దేవయాని: ఇలా జరుగుతుందని మేం ఊహించలేదు..నాన్నా రిషి నన్ను వదిలేసి ఎలా వెళ్లిపోయావు నాన్నా అంటుంది
వసు: స్టాపిట్..ఇంకోసారి రిషి సర్ లేరనే మాటంటే ఊరుకోను
దేవయాని: భ్రమలో ఉండకు వాస్తవాన్ని గుర్తించు
వసు: భ్రమలో బతుకుతున్నది మీరు నేను కాదు...
దేవయాని: ఆ ఫొటో ముందు అక్కడ పెట్టు..లేదంటే మనింటికి అరిష్టం...
వసు: రిషి సర్ కి ఏం కాలేదు..ఆయన తేల్చుకోవాల్సిన లెక్కలు ఇంకా మిగిలే ఉన్నాయి..వాటిని తేల్చుతారు
దేవయాని: తను అలా చేస్తుంటే మౌనంగా ఉండావేంటి మహేంద్ర..తనంటే చిన్న పిల్ల...
వసు: చెప్తుంటే అర్థంకాదా..అయినా మీరిద్దరూ ఇక్కడకు ఎందుకు వచ్చారు, అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు...
దేవయాని: రిషిని ఈ చేతులతో పెంచాను కంటికి రెప్పలా చూసుకున్నాను..తనకు తల్లిప్రేమను పంచింది నేను..అలాంటి నన్ను ఎందుకొచ్చావ్ అంటావా..రిషి చనిపోయాడని ఇక్కడ నువ్వు తప్ప అందరూ నమ్ముతున్నారు..నువ్వు కూడా నమ్మితే మంచిది...
వసు: నేను నమ్మను
దేవయాని: రిషిని ఎందుకు తీసుకురాలేదు..నువ్వు ఒక్కదానివే ఎందుకు తిరిగొచ్చావ్..
వసు: మీలాంటి వాళ్లు సర్ ని ఎక్కడో దాచిపెట్టి నాటకం ఆడుతున్నారు..ఇదంతా మీ నాటకం అని నేను ప్రూవ్ చేస్తాను
 రిషి ఇక లేడని మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటాడు మహేంద్ర....వసుధార మాత్రం అస్సలు తగ్గదు...దేవయానికి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తుంది...మీరిక్కడి నుంచి వెళ్లిపోతోండి..మిమ్మల్ని చూడాలంటే అసహ్యంగా అనిపిస్తోంది..ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అరుస్తుంది...
దేవయాని, శైలేంద్ర, ధరణి అక్కడి నుంచి వెళ్లిపోతారు...
వసుధార ఫొటో పట్టుకుని ఏడుస్తుంది...మహేంద్ర, అనుపమ, చక్రపాణి ఏమీ చేయలేక చూస్తుండిపోతారు....

Also Read: మరో 12 ఎపిసోడ్స్ తో గుప్పెడంత మనసు కి శుభం కార్డ్ - కార్తీకదీపం లానే చేస్తారా!

ముకుల్-అనుపమ
అసలు రిషి చనిపోవడం ఏంటి అని అనుపమ అంటే..అదే అర్థం కావడం లేదు..హాస్పిటల్లో DNA రిపోర్ట్ వచ్చాక గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఎన్నిసార్లు చెక్ చేసినా మహేంద్ర DNA, ఆ బాడీ DNA మ్యాచ్ అయ్యాయి. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగిందేమో అని అనుపమ అంటే ఎలాంటి పొరపాట్లు జరగలేదు నేను దగ్గరుండి మరీ చెక్ చేశాకే నిర్ధారణకు వచ్చానంటాడు ముకుల్. మీరెందుకు అనుమాన పడుతున్నారని ముకుల్ అంటే...వసుధార నమ్మడం లేదంటుంది. రిషి మన మధ్య లేరనే విషయాన్ని మనమే తీసుకోలేకపోతున్నాం అలాంటిది వసుధార మేడం ఎలా తీసుకుంటారు.. అదే నిజం అని గ్రహించాలంటే టైమ్ పడుతుందంటాడు. రిషి అటాక్ గురించి ఏమైనా అప్ డేట్ తెలిసిందా అని అడిగిన అనుపమ..శైలేంద్రపైనే అనుమానం ఉందంటుంది. యూత్ ఫెస్ట్ కి రిషి ఫ్లెక్సీలు వేయించింది శైలేంద్రనే అంటూ జరిగినదంతా చెబుతుంది. ఫెస్ట్ కి రిషి వస్తే శైలేంద్రకి చాలా సమస్య అవుతుందని తనే కిడ్నాప్ చేసి ఉంటాడు..కచ్చితంగా ఆ శైలేంద్రనే రిషిని చంపి ఉంటాడు అంటుంది అనుపమ. శైలేంద్ర అనే అనుకోలేం అంటాడు ముకుల్...మరి మీకు ఎవరిపై అనుమానం ఉందని అడిగితే భద్ర అంటాడు...

ఎపిసోడ్ ముగిసింది

Also Read: ఓ చిన్న సర్దుబాటు ఈ రాశివారి జీవితంలో ఆనందం నింపుతుంది, ఫిబ్రవరి 07 రాశిఫలాలు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget