అన్వేషించండి

Satyabhama Serial Today February 5th: సత్యను చంపడానికి మీదకొచ్చిన క్రిష్.. రౌడీ ఎదురుగానే రింగులు మార్చుకున్న సత్య, మాధవ్‌!

Satyabhama Serial Today Episode: క్రిష్ ఎదురుగా మాధవ్, సత్యలు రింగులు పెట్టుకొని దండలు మార్చుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode: మాధవ్, సత్యల నిశ్చితార్థం దగ్గరకు క్రిష్ వచ్చి గొడవ చేస్తాడు. తాను సత్య ప్రేమించుకున్నామని చెప్తాడు. సత్య క్రిష్‌ని కొట్టి తనెవరో తెలీదు అని అక్కడి నుంచి పొమ్మని చెప్తుంది. అబద్ధం చెప్తున్నావ్ అని మాట మార్చుతున్నావ్ అని క్రిష్ సత్యను నిలదీస్తాడు. 

క్రిష్‌: ఎవరికో భయపడి కావాలనే భుకాయిస్తున్నావ్. అందరి ముందు నన్ను ఎదవని చేస్తున్నావ్..
మాధవ్: రేయ్ ఆడపిల్ల మీద ఏంట్రా నీ ప్రతాపం సిగ్గుండాలి అని మాధవ్ అనగానే మాధవ్ గొంతు పట్టుకుంటాడు క్రిష్. 
క్రిష్: ఇంకొక్క మాట నోటికెళ్లి వచ్చిందో పాస్ పోర్ట్ లేకుండా యముడి దగ్గరకు పంపిస్తా బిడ్డా. ఇది పబ్లిక్ మేటర్ కాదు ఎవరు పడితే వాళ్లు నోరు జారడానికి నాకు సంపంగికి సంబంధించిన విషయం. అందరికీ చెప్తున్నా నోటి మీద వేలు వేసుకొని చూడండి. అసలే నేను తేడా గాడిని.. ఏం చేస్తానో నాకే తెలీదు. బుర్ర వేడెక్కిపోతుంది. 
సత్య: ఎందుకు అందరి మీదకు వెళ్లిపోతున్నావ్. ఏంటి నీ రౌడీయిజం అసలు నీకు ఏం కావాలి. 
క్రిష్: నీ నోటి నుంచి నిజం భయటకు రావాలి.
సత్య: నువ్వు బెదిరిస్తే భయపడే మనిషిని కాదు. చెంప దెబ్బ తిన్నా కూడా అర్థంకావడం లేదా నిజం ఏంటో..
మాధవ్‌తల్లి: నువ్వు ఏదైనా దాస్తున్నావ్ ఏమో.. అందుకే అన్ని సార్లు అడుగుతున్నాడు.
క్రిష్: ఇది.. ఇది మాటంటే.. నన్ను మోసం చేయడమే కాదు మిమల్ని కూడా మోసం చేస్తున్నది. సత్య మనసులో ఉన్నది నేను. అది మొత్తుకొని చెప్తున్నా వినడేంటి నీ కొడుకు. వేలికి ఉంగరం తొడిగి తెగ ముచ్చట పడుతున్నాడు. నీకు ఆమెని కోడల్ని చేసుకోవడం ఇష్టమేనా..
సత్య: ఆంటీ అతని మాటలు నమ్మకండి. 
క్రిష్: దేన్ని నమ్మొద్దు అని అంటున్నావ్.. అమ్మవారి గుడిలో నీకు కుంకుమ పంపించి నేనంటే ఇష్టమైతే పెట్టుకోమని చెప్పా పెట్టుకున్నావా లేదా.. నిజం చెప్పు. 
సత్య: అవును నేను బొట్టు పెట్టుకున్న మాట నిజం. కానీ అది నువ్వు పంపిన బొట్టు అని నేను అనుకోలేదు. ఎవరో పాప వచ్చి కుంకుమ ఇచ్చి పూజారి దగ్గర నుంచి తెచ్చి ఇచ్చాను అని చెప్పింది అందుకే పెట్టుకున్నాను. 
క్రిష్: మరి నీతో కాఫీ తాగాలి అని పంతంగి మీద రాసి ఇస్తే బట్టల షాపునకు వచ్చి నాతో కాఫీ తాగావు కదా.. 
సత్య: నాటకాలు ఆడకు నా ముందుకు రాకుండా నాతో మాట్లాడకుండా ఎవరితోనో కాఫీ పంపి మాయ చేస్తున్నావా.. బుకాయిస్తూ నీ ప్రేమను నమ్మించాలి అని చూస్తున్నావా.. 
క్రిష్: సరే ఇవన్నీ నాటకాలే అనుకుందాం.. మరి నా కోసం నువ్వు రాసిన ఆ లెటర్ నిజమా అబద్ధమా.. చూడు.. 
సత్య: లెటర్ చూసి.. ఇది నేను రాయలేదు.. ఇది నా చేతి రాత కాదు. నాన్న ఇతను నాటకాలు ఆడుతున్నాడు.  
బాబీ: క్రిష్ చేతికి ఉన్న రుమాలు తీసి సత్య అన్న పచ్చబొట్టు చూపించి ఇది కూడా నాటకమేనా అని అడుగుతాడు. నిజంగా మా అన్న రౌడీ అయితే మనసు లేనోడే అయితే ఎట్లా అయినా సరే నువ్వే కావాలి అనుకుంటే ఎత్తుకుపోయి బలవంతంగా నీ మెడలో తాళి కట్టడానికి పది నిమిషాలు పట్టదు వదినా. కానీ ఆ పని చేయలేదు. నీకు గుండెల్లో గుడి కట్టుకున్నాడు. ఆరాధిస్తున్నాడు. ప్రేమిస్తున్నట్లు నువ్వు ఇస్తున్న సిగ్నల్ చూసి మురిసిపోయాడు. నువ్వు రాసిన ఈ లెటర్‌ని జేబులో పెట్టుకొని తిరుగుతూ రోజుకు వంద సార్లు చదువుతున్నాడు వదినా. ఇవన్నీ నీకు నాటకాలేనా.. ఇంత అన్యాయంగా మాట్లాడుతావా.. అన్నని బాధ పెట్టకు వదినా.. రాసిస్తా వదినా జీవితంలో నీ మీద ఇంత ప్రేమని ఎవరూ చూపించలేరు. 
క్రిష్: రేయ్ అర్థం కాదు బాబీ ఇదంతా మీ వదినకు అర్థం కాదు. రేయ్ నాకు మనసు లేదు అంటోంది. కానీ నిజంగా మనసు లేనిది మీ వదినకిరా.. అందుకే నన్ను మోసం చేసింది.
సత్య: మోసం ఏంటి. హా మోసం ఏంటి..
క్రిష్: నువ్వు ఇష్టపడిన చీరని నేను నీకోసం పంపిన మాట నిజమా కాదా.. ఆ చీర కట్టుకొని రెస్టారెంట్‌కి రమ్మంటే వచ్చావా లేదా.. గుండె మీద చేయి వేసుకొని చెప్పు. 
విశాలాక్షి: ఆరోజు నువ్వు కట్టుకొని వెళ్లిన చీర మాధవ్ పంపించింది కాదా..
మాధవ్: నేను సత్యకి చీర పంపడం ఏంటి.
మాధవ్‌తల్లి: అతను పంపించిన చీరని మాధవ్ కొనిచ్చాడు అని ఇంట్లో చెప్పావ్ కదూ. 
సత్య: అవును అబద్ధం చెప్పాను.. కానీ అబద్ధం ఎందుకు చెప్పాను అంటే. 
మాధవ్‌తల్లి: ఎందుకు చెప్పినా అబద్ధం అబద్ధమే.. ఇంట్లో వాళ్లని మోసం చేసినట్లే కదా.. 
సత్య: నేను వాడితో పడుతున్న స్ట్రగుల్ మీకు తెలీదు అంటీ.. ఎప్పుడూ అబద్ధం చెప్పని నేను వీడి విషయంలో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఎంత నరకం అనుభవించానో ఆలోచించండి. నా బాధని నాలోనే దాచుకోవాలి అనుకున్నాను. అమ్మానాన్నలని టెన్షన్ పెట్టాలి అనుకోలేదు. పిరికితనంతో కాదు అమ్మానాన్నలు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అనుకున్నాను. నా బాధ్యత అనుకున్నాను కనుకే అబద్ధం చెప్పాను. అది తప్పు అంటే నేనేం చేయలేను. నన్ను ఏడిపించే వాడి కోసం నాకోసం త్యాగాలు చేసే వారిని ఏడిపించలేను. ఇప్పుడు ఇక్కడ వీరంగం ఆడుతున్నాడే ఈ పెద్ద మనిషి ఎప్పుడైనా నా ముందుకు వచ్చి నన్ను ఇష్టపడ్డానని చెప్పాడేమో అని అడగండి.. ఎవరో చెప్పకుండా కనపడకుండా నాటకాలు ఆడుతూ పిరికి వాడిలా ప్రవర్తించాడు.
క్రిష్: సత్యా.....
సత్య: మాట్లాడకు. ఇప్పుడు చెప్పే వంతు నాది నోటి మీద వేలు వేసుకొని విను. ఆ పిరికివాడు ఎవరో తెలుసుకొని బుద్ధి చెప్పాలి అని అసహ్యంతో వెళ్లానే తప్ప ప్రేమతో వెళ్లలేదు. అది ఆ మూర్ఖుడు తెలుసుకోకపోతే నేనేం చేయాలి. 
మాధవ్: అవును మమ్మీ అనుకోకుండా ఆ రోజు రెస్టారెంట్‌లో నేను సత్యను కలిశాను.  సత్య చాలా ఇరిటేటింగ్‌ మూడ్‌లో ఉంది. అంతా వీడివల్లే అయింటుంది. 
క్రిష్: అసలు ఆ గొడవ అంతా నీవల్లేరా.. మాయ చేసి సత్యని నీవైపు తిప్పుకున్నావ్.  అందుకే నన్ను మోసం చేసింది. 
సత్య: ఏయ్ మాధవ్‌ని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. 
క్రిష్: అవునా.. నెల రోజుల నుంచి నీ చుట్టూ తిరిగా నేను నీకు కనిపించలేదు. రెండు రోజుల క్రితం పెళ్లి చూపులకు వచ్చిన వాడునీకు ప్రాణం అయిపోయాడా.. అంత మోజు పుట్టుకొచ్చిందా.. ఓ అమెరికా వాడు కదా..
సత్య: పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. 
క్రిష్: ఏయ్ గొంతు లేపకు. ఇంతకు ముందు వరకు నువ్వు ఇక్కడ (గుండెల్లో)ఉన్నావే.. నువ్వు తిట్టినా కొట్టినా నీ మీద ఉన్న ప్రేమ చేతులు కట్టుపడేసింది. అవమానం భరించాను. కానీ ఇప్పుడు ప్రేమ చచ్చిపోయింది. 
సత్య: పీడ పోయింది. 
క్రిష్: దాని జాగాలా ద్వేషం పుట్టుకొచ్చింది. మోసం చేసిన నిన్ను విడిచిపెట్టను..
సత్య: ఏం చేస్తావ్.. ఏం చేస్తావ్ అంటే.. సత్య గొంతు పట్టుకుంటాడు క్రిష్..
శేఖర్: విశ్వనాథం వాడు అంతకి తెగిస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నావ్ ఏంట్రా పోలీసులకు ఫోన్ చేయ్.  
క్రిష్: నువ్వు చేయడం కాదు నేనే నెంబరు కలిపిస్తా మాట్లాడు.. విశ్వనాథం ఫోన్ తీసుకొని వద్దు బాబు వదిలేయ్.. అంటాడు.. ఆకు రౌడీ అనుకుంటున్నాడేమో బెదిరిస్తే బయపడటానికి క్రిష్ ఇక్కడ. 
విశ్వనాథం: బాబు నీ మీద ప్రేమ లేదు అని చెప్తొంది కదా.. నవ్వేదో పొరపాటు పడ్డావ్ బాబు. చిన్నవాడివి అయినా చేతులెత్తి దండం పెడతా వెళ్లిపోబాబు. 
క్రిష్: నేను పోవాలి అంటే ఒక్కటే కండీషన్.. ఈ అమెరికా వాడిని నా కళ్లముందే ఊరు వదిలి వెళ్లిపోమని చెప్పండి. ఈ నిశ్చితార్థం జరగకూడదు. 
మాధవ్: ఎవడ్రా నువ్వు  మా నిశ్చితార్థం ఆపడానికి పోనీలే అని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావ్. నీ కళ్ల ముందే సత్యకు నాకు నిశ్చితార్థం జరుగుతుంది. దండలు కూడా మార్చుకుంటాం ఏం చేసుకుంటావో చేసుకోరా..
క్రిష్: అంత దమ్ము ఉందారా.. నాకే ఛాలెంజ్ చేస్తావా.. ఉంగరం నువ్వు పెట్టించుకోవాలి వేలు నరికేస్తా బిడ్డా..

మాధవ్ ఆవేశంగా వెళ్లి రింగ్‌లు తీసుకొని వచ్చి సత్య వీడి కళ్ల ముందే మన ఎంగేజ్‌మెంట్ జరగాలి అంటాడు. సత్య కూడా క్రిష్‌వైపు కోపంగా చూసి రింగ్ పట్టుకొని మాధవ్‌కి వేలు అందిస్తుంది. క్రిష్ కోపంతో పక్కనే ఉన్న దీపపు కుందు తీసుకొని మాధవ్‌ని కొట్టడానికి వస్తాడు. సత్య మాధవ్‌కి అడ్డుగా నిలుస్తుంది. పక్కకి జరుగు అని క్రిష్ అంటే జరగను అని సత్య అంటుంది. 

క్రిష్: నేను అంటే నీకు ఇష్టం లేకపోయినా ఒకప్పుడు నువ్వంటే నాకు ఇష్టం ఆ మర్యాదతోనే చెప్తున్నా పక్కకు జరుగు. వాడిని వదిలిపెట్టు.
సత్య: కుదరదు..
క్రిష్: మొండితనానికి పోతే నా మాట నేనే వినను. నిన్ను కూడా చంపేస్తా.. సత్య చంపు అంటే సత్య మీదకు క్రిష్ వస్తే బాబీ వాళ్లు అడ్డుకుంటారు. 
బాబీ: అన్న నువ్వు చేస్తున్నది తప్పు అన్న అసలు కోపంలో ఏం చేస్తున్నావో తెలుస్తుందా.. వదినను చంపేస్తావా.. బాబీ క్రిష్‌ని లాక్కని వెళ్తే క్రిష్ చూసేలా మాధవ్, సత్యలు ఒకరికి ఒకరు రింగులు మార్చుకుంటారు. 

ఇంటికి వచ్చిన తర్వాత శాంతమ్మ ఏడుస్తుంది. శాంతమ్మ సత్య వల్ల అంతా జరిగింది అని అంటుంది. ఇష్టమొచ్చినట్లు తిరిగిందని తిడుతుంది. సత్య తన తండ్రి చేయి పట్టుకొని ఏం జరిగిందో చెప్పబోతుంటే తప్పు చేశావ్ అమ్మా అని విశ్వనాథం అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.   

Also Read:  'త్రినయని' సీరియల్ ఫిబ్రవరి 5th: చూపులమ్మ కలశాన్ని గాయత్రీదేవి ఫొటో దగ్గర పెట్టిన తిలోత్తమ.. అలర్ట్ అయిన విశాల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
Bhagyashri Borse: సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి... రామ్ 'RAPO22'లో భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ వచ్చేసింది - జోడీ ముద్దొస్తుంది కదూ
సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి... రామ్ 'RAPO22'లో భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ వచ్చేసింది - జోడీ ముద్దొస్తుంది కదూ
Gautam Gambhir Shocking Decision: చేసింది చాలు.. ఇక నేను చెప్పినట్లు ఆడాల్సిందే: టీమిండియా స్టార్లకు కోచ్ గంభీర్ ఆదేశాలు
చేసింది చాలు.. ఇక నేను చెప్పినట్లు ఆడాల్సిందే: టీమిండియా స్టార్లకు కోచ్ గంభీర్ ఆదేశాలు
Viral News: మద్యం మత్తులో తగ్గేదేలే, పీకలదాకా తాగి కరెంట్ తీగలపై పడుకున్నాడు
Viral News: మద్యం మత్తులో తగ్గేదేలే, పీకలదాకా తాగి కరెంట్ తీగలపై పడుకున్నాడు
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
Embed widget