అన్వేషించండి

Trinayani Serial Today February 5th: 'త్రినయని' సీరియల్: చూపులమ్మ కలశాన్ని గాయత్రీదేవి ఫొటో దగ్గర పెట్టిన తిలోత్తమ.. అలర్ట్ అయిన విశాల్!

Trinayani Serial Today Episode: అఖండ స్వామి ఇచ్చిన చూపులమ్మ కలశాన్ని తిలోత్తమ తీసుకొని వచ్చి గాయత్రీ దేవి ఫొటోకి ఎదురుగా పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారంది.

Trinayani Today Episode: విక్రాంత్ ల్యాప్‌టాప్‌ కోసం తన గదికి వస్తే సుమన ఫాలో అవుతుంది. దీంతో విక్రాంత్ నేనేం తీసుకుపోవడం లేదు నా ల్యాప్ టాప్ కోసం వచ్చాను అంటాడు. అందుకు సుమన తీసుకెళ్లడానిక ఏం ఉంటే కదా అంటుంది. విలువైనవి గదిలో ఉండకపోవచ్చు అని విక్రాంత్ అంటే.. స్టోర్‌ రూంలో ఉంటాయా అని సుమన అంటుంది. అక్కడ ఎందుకు ఉంటాయని విక్రాంత్ ప్రశ్నిస్తాడు.

సుమన: గాయత్రీ అత్తయ్య చీర అక్కడ ఉండబట్టే కదా దాన్ని బయటకు తీయించారు.
విక్రాంత్: ఒకసారి మా అమ్మ తీయించగా హాసిని వదినకు పూనకం వచ్చేలా చేసింది. ఇంకో సారి ఆ చీర జోలికి నువ్వు వెళ్లి పక్షవాతం వచ్చి త్రుటిలో తప్పించుకున్నావ్..
సుమన: మరి ఇప్పుడు ఆ చీరనే మీ అమ్మకి ఇచ్చారు కదా బుల్లిబావగారు. ఏమవుతుంది అంటారు.
విక్రాంత్: తెలీదు నయని వదినలా నేను భవిష్యత్ చెప్పలేను.
సుమన: కానీ మన భవిష్యత్ ఎలా ఉంటుందో నేను చెప్పగలను.
విక్రాంత్: మన.. నిన్ను చూస్తే నాకు నా గతమే గుర్తొస్తుంది. నీకు నీ భవిష్యత్ గురించి తప్ప ఏం గుర్తుకురావు. మన అని నన్ను ఎందుకు కలుపుతావ్. 
సుమన: మీతో పర్సనల్‌గా మాట్లాడాలి అనే మీ వెనకాల వచ్చానండీ.. 
విక్రాంత్: సంసారమే లేదు సీక్రెట్స్ ఎలా ఉంటాయి.
సుమన: ముందు నేను చెప్పేది వినండి.. మీ అమ్మ ఆ చీరని అడగగానే ఇచ్చేశారు. అంటే ఎవరు ఏమడిగినా విశాల్ బావగారు ఇచ్చేస్తారు. ఎంతో విలువైన గాయత్రీ అత్తయ్య చీరనే ఇచ్చేశారు అంటే ఆవిడ స్థాపించిన 16 కంపెనీళ్లలో ఒక కంపెనీని నేను కాదు కానీ మీరు అడిగితే ఇవ్వకుండా ఉంటారా.. నేను కూడా వ్యాపారస్తుడు విక్రాంత్ బాబుగారి భార్యనని గొప్పగా చెప్పకుంటాను. 
విక్రాంత్: అడగడానికి బుద్ధుందా అని అనిపించుకోవాలి అంటావా.. అయినా నిన్ను హ్యాండిల్ చేయలేని వాడిని కంపెనీని ఎలా నడుపుతానో చెప్పు. ముందు నువ్వు మారితే అప్పుడు ఆలోచిద్దాం.

నయని: అత్తయ్య, బావగారు ఎక్కడ ఉన్నారు.
ఎద్దులయ్య: గాయత్రీ అమ్మ చీర ఇచ్చాక ఇంట్లో ఇంకా ఎందుకు ఉంటారు. 
విశాల్: తనలో తాను.. అమ్మా వాళ్లు నన్ను చూడలేదు. వాళ్లు రాకముందే నేను ఇంటికి రావడం మంచిది అయింది. కచ్చితంగా ఆ కలశాన్ని అమ్మ ఫొటో దగ్గర పెడతారు. కాదు అంటే ఎందుకు అని అందరూ అడుగుతారు. డౌట్ వచ్చేలా ఉందే.. వాళ్ల ప్లాన్‌ని ఎలా తిప్పికొట్టాలి అనేదే ఆలోచించాలి. 
తిలోత్తమ: కలశంతో ఇంటికి వచ్చి.. బాగా చూడవమ్మా చూపులమ్మ ఇదే ఇళ్లు. ఇక్కడే గాయత్రీ అక్క దహన సంస్కారాలు జరిగాయి. 
విశాల్: అమ్మా చూపులమ్మ తల్లి ముగ్గురు అమ్మల మధ్య యుద్ధమే జరిగేలా ఉంది.
విక్రాంత్: పెద్దమ్మ ఎప్పుడో కట్టింది మళ్లీ దాన్ని తీసుకొని అమ్మ వాళ్లు ఎందుకు బయటకు వెళ్లారనేదే డౌట్. తిలోత్తమ వాళ్లు ఇంట్లోకి వస్తారు. అందరూ ఆ కలశం గురించి అడుగుతారు. 
విశాల్: ఏం చేస్తున్నావ్ అమ్మా..
తిలోత్తమ: తీసిన చీరని తిరిగి నేను కట్టుకోవాలి అంటే కట్టుబాట్లు ఏమైనా ఉన్నాయా అని స్వామి వారిని అడుగుదాం అని వెళ్లాం. 
నయని: అంత మంది అమ్మవార్లు నాకు తెలుసు కానీ ఈ చూపులమ్మ పేరుని నేను ఎప్పుడూ చూడలేదు వినలేదు..
తిలోత్తమ: అఖండ స్వామి ఈ అమ్మవారిని ఒక రోజు మన ఇంట్లో పెట్టుకోమన్నారు. 
విశాల్: ఈ తల్లి ఎందుకు..
ఎద్దులయ్య: నీ తల్లి వస్తుందనేమో.. పూర్వజన్మ ఎత్తిన గాయత్రీ అమ్మని ప్రత్యక్షంగా చూడదలచి ఈ చూపులమ్మని తీసుకొచ్చారు మాతా.
 
తిలోత్తమ ఆ కలశాన్ని అఖండ స్వామి చెప్పినట్లు గాయత్రీ దేవి ఫొటోకు ఎదురుగా పెడుతుంది. అందర్ని సాయంత్రం దీపారాధన టైంకి రమ్మని చెప్తుంది. మరోవైపు విశాల్ బాల్యానీ దగ్గర ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి నయని వస్తుంది. విశాల్ గాయత్రీ పాప గురించి అడుగుతాడు. దీంతో నయని ఈ మధ్య మీరు గానవి కంటే గాయత్రీ పాప కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటుంది. తిలోత్తమ అత్తయ్య గాయత్రీ అమ్మగారి జాడ తెలుసుకోవాలి అని తెగ ప్రయత్నిస్తున్నారు అని నయని అంటుంది. ఇక విశాల్ కూడా చూపులమ్మ అమ్మవారేనా అని అడుగుతాడు. ఇక నయని ఆ పేరు గల అమ్మవారిని ఎప్పుడూ చూడలేదు అని వినలేదు అని చెప్తుంది.   ఈ గండాన్ని ఎలా తప్పించాలా అని విశాల్ అనుకుంటాడు. ఎదో జరగబోతుంది అని జాగ్రత్తగా ఉండాలి అని విశాల్ అనుకుంటాడు. మరోవైపు సుమన నగలు పెట్టుకొని రెడీ అవుతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: నాగపంచమి సీరియల్ జనవరి ఫిబ్రవరి 3rd: కరాళి తనని కిడ్నాప్ చేసిందన్న మేఘన.. పంచమి, ఫణేంద్ర నమ్మేస్తారా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget