అన్వేషించండి

Satyabhama Serial Today February 29th: సత్యభామ సీరియల్: క్రిష్‌తో సత్య పెళ్లి జరగాలి అంటే నందినిని తనకిచ్చి పెళ్లి చేయాలని కండీషన్ పెట్టిన హర్ష!

Satyabhama Serial Today Episode సత్యని క్రిష్‌ పెళ్లి చేసుకోవాలి అంటే క్రిష్ చెల్లి నందినీని తనకి ఇచ్చి పెళ్లి చేయాలి అని హర్ష కండీషన్ పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode క్రిష్‌ని పెళ్లి చేసుకోవాలి అని సత్య నిర్ణయించుకుంటుంది. క్రిష్‌ని ఇంటికి పిలిపించి తన కుటుంబ సభ్యులకు క్రిష్‌ని పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. అందరూ ఎంత వద్దని చెప్పినా వినకుండా క్రిష్‌తో తనకు పెళ్లి చేయమని అంటుంది. దీంతో విశ్వనాథం తప్పనిసరి పరిస్థితుల్లో రౌడీతో పెళ్లికి ఒప్పుకుంటారు. ఇక క్రిష్ కూడా వాళ్ల ఇంట్లో విషయం చెప్పి అందర్ని నిశ్చితార్థం కోసం సత్య ఇంటికి తీసుకొస్తాడు. 

విశ్వనాథం: మనసులో.. నిన్నే కదా సత్య తన మనసులో మాట చెప్పింది అప్పుడే వీళ్లేంటి నిశ్చితార్థానికి వచ్చేశారు. 
భైరవి: ఏంటిరా చిన్నా ఏదో దెయ్యాలను చూసినట్లు చూస్తున్నారు. మనం పూలపళ్లకు వస్తున్నట్లు చెప్పలేదా..
క్రిష్: చెప్పానమ్మా కాకపోతే టైం చెప్పలేదు. అందుకే అందరూ సర్‌ప్రైజ్ అయి చూస్తున్నారు. 
మహదేవయ్య: మగపెళ్లివారు పౌరుషంతో ఉండాలి.. తగ్గి ఇలా ఆడపెళ్లి వారి గడప తొక్కితే ఇలాగే ఉంటుంది. లోపలకి రమ్మని పిలిచే వారే లేరా..
క్రిష్: బాపూ రెండు కుటుంబాలు కలిసేటప్పుడు ఆడపెళ్లివారు మగపెళ్లివారు ఏంటి బాపూ. అందరూ ఒకటే. 
విశాలాక్షి: లోపలికి రండి..
మహదేవయ్య: ఈ పిలుపు మేం అడగక ముందే పిలివాలి.. సిగ్గు లేకుండా తగ్గి మాకు మేమే వచ్చామని మర్యాదలు తగ్గినా చెల్లుతుందని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. 
దేవ్: అత్తమ్మ పిలిచింది సరే మరి మీ మామ కేమైంది. నోట్లో లడ్డూ పెట్టుకున్నాడా.. 
క్రిష్: అన్నా.. నువ్వు ఇప్పుడు పెద్ద మనిషి లెక్క వచ్చావ్.. సెటిల్ మెంట్ చేయడానికి కాదు. జర తగ్గియే.. బాపూ రండి.. క్రిష్ ఇక తన ఫ్యామిలీని విశ్వనాథానికి పరిచయం చేసినా విశ్వనాథం పట్టించుకోడు. 
నందిని: అమ్మా మనం అంత ఘనంగా చీర సారె తీసుకొని వస్తే వీళ్లేంటి కనీసం గుమ్మానికి మామిడాకులు కూడా కట్టలేదు. అసలు నిశ్చయతాంబూళాలు మార్చుకోవడానికే వచ్చామా.. ఏంటి అన్నా ఇది.. 
విశ్వనాథం: నందిని ఈ పిచ్చొడిని అడిగితే ఏం చెప్తాడే.. తిండికి గతి లేని వాళ్లు కూడా అప్పు చేయి అయినా చేస్తారు. వీళ్లు ఖర్చు దండగ అనుకున్నారో లేక ఈ అల్లుడే దండగ అనుకున్నారో..
క్రిష్: బాపూ..
భైరవి: మీ బాపుకే కాదు మాకు డౌట్ వస్తుంది.

 ఇంతలో సత్య రెడీ అయి వస్తుంది. క్రిష్ అలా చూస్తూ ఉండిపోతాడు. సత్యని చూసి భైరవి, నందిని గతంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకొని షాకైపోతారు. 

క్రిష్: అమ్మా, బాపూ  మీకు కాబోయే కోడలు సత్య. సత్యభామ. 
భైరవి: గుర్తున్నామా...
సత్య: మీరు ఇంకా మర్చిపోలేదా..
భైరవి: కొన్ని కొన్ని అలాగే గుర్తుండిపోతాయి. 
దేవా: మీకు తను ఇంతకు ముందే తెలుసా..
భైరవి: హా.. ఒకసారి గుడిలో కలిసింది. చాలా పొగరుగా కనిపించింది. రేయ్ ఈ పొగరుబోతు అమ్మాయికి ఒక విషయం చెప్పాలి. పుట్టిల్లు, అత్తారిల్లు ఒకటి కాదు. పుట్టింట్లో ఉండే స్వేచ్ఛని ఇక్కడే దిండు కింద దాచి పెట్టి అత్తింట్లో అడుగుపెట్టాలని చెప్పు. అత్తింట్లో కట్టుబాట్లు కొంచెం ఎక్కువే ఉంటాయి అని చెప్పు. మన ఇంట్లో కోడళ్లకు చెవులు, కళ్లు తప్ప నోరు పని చేయకూడదు అని చెప్పు.
క్రిష్: ఇప్పుడు అవన్నీ అవసరమా అమ్మా. 
భైరవి: ఈమెని గుడిలో కలిసినప్పుడు తను మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. అందుకే ఇవన్నీ చెప్పా.
సత్య: చూడండి పుట్టింట్లో నాకు స్వేచ్ఛని ఇచ్చినా మా పెద్దవాళ్లు కట్టుబాట్లు మర్యాదలు నేర్పించారు. 
నందిని: ఇలాంటి అత్తిళ్లు నాకు దొరికితే మెడలో వేసిన మూడు ముళ్లు మూడు నిమిషాల్లో విప్పేసి పుట్టింటికి వచ్చేస్తా..
సత్య: క్రిష్ ఇక మనం తాంబూళాలు మార్చుకుందామా..
క్రిష్: అట్లానే సత్య అట్లానే..
నందిని: చూశావా అమ్మ నీ చిన్న కోడలు అప్పుడే నీ కొడుకుని గంగిరెద్దుని చేసేసింది. 
క్రిష్: ఏయ్ ఆపుతావానే..
మహదేవయ్య: ఏమిరా అందరి ముందు ఇంటి ఆడబిడ్డ మీద గుడ్లుఉరుముతున్నావ్ పద్ధతి కాదు. 

మహదేవయ్య, భైరవి తాంబూళాలు ఇస్తుంటే తీసుకోవడానికి విశ్వనాథం ముందుకు రాడు. దీంతో దేవా లేచి ఏంట్రా ఈ తమాషా మన ఇంటితో వియ్యం అందుకోవడానికి మినిస్టర్ లాంటి వాడే బతిమిలాడితే వీళ్లేంట్రా.. నాటకాలు ఆడుతున్నారా అని సీరియస్ అవుతాడు. చంపేస్తా అని గన్ తీస్తాడు. దీంతో  క్రిష్ సర్ది చెప్తాడు. అత్తింటి వైపు మాట్లాడుతున్నావని భైరవి క్రిష్ అడుగుతుంది. ఇక సత్య తాంబూళం తీసుకోమంటుంది. మీరు తీసుకుంటారా నన్ను తీసుకోమంటారా అని అడుగుతుంది. దీంతో విశ్వనాథం అయిష్టంగానే తీసుకోవడానికి వస్తాడు. అప్పుడు హర్ష వాళ్లని ఆపుతాడు. 

హర్ష: ఆగండి.. 
క్రిష్: ఏంటి బామర్ది ఇప్పుడిప్పుడే అందరూ లైన్‌లోకి వచ్చి తాంబూళం మార్చుకోవడానికి వచ్చారు ఇప్పుడేంటి..
హర్ష: నీతో మాట్లాడాలి. అది ఇప్పుడే మాట్లాడాలి. సత్య నువ్వు మధ్యలోకి రాకు. ఇది నేను తేల్చుకోవాల్సింది. 
మహదేవయ్య: ఏంట్రా నువ్వు తేల్చుకోవాల్సింది. అసలు ఈ ఇంట్లో పెద్ద ఎవరు. ఎవరికి వాళ్లు తోపుల్లా మాట్లాడుతున్నారు. 
క్రిష్: బాపు ఆవేశ పడకు నిశ్చితార్థం కావాలా వద్దా.. చెప్పు నీకేం కావాలో చెప్పు.. తొందరగా చెప్పు..
హర్ష: ఈ నిశ్చితార్థం జరగాలి అంటే నాదో కండీషన్. నా చెల్లి మీ ఇంటి కోడలు కావాలి అంటే నీ చెల్లెలు మా ఇంటి కోడలు కావాలి. 
సత్య: అన్నయ్య నువ్వు ఏమంటున్నావో ఏమడుగుతున్నావో తెలుస్తుందా.. 
హర్ష: పూర్తి స్ఫృహాలో ఉండే మాట్లాడుతున్నా.. నా కండీషన్‌కి ఒప్పుకుంటే ఈ నిశ్చితార్థం జరుగుతుంది లేదంటే లేదు. 
మహదేవయ్య: గన్ పేల్చి.. హర్ష తలకి గురి పెడతాడు.. నా ఎడమ కాలి చెప్పంత విలువ చేయని నీ బతుకు నీకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలా ఏమనుకుంటున్నావ్ రా నువ్వు.
నందిని: బాపు బెదిరించడం కాదు కాల్చి పడేయ్. లేకపోతే ఈ మిడిల్ క్లాస్ గాడికి నేను కావాలా.. 
హర్ష: నేను అడిగిన దాంట్లో తప్పేముంది. నా చెల్లిని మీ ఇంటి కోడల్ని చేయడానికి అడ్డురాని అంతస్థు నన్ను మీ ఇంటి అల్లుడిని చేసుకోవడానికి అడ్డు వచ్చిందా.  
మహదేవయ్య: ఇదంతా నీ వల్లే.. ప్రేమ దోమ అంటూ నీ మాటకు విలువ ఇవ్వడంతోనే నా బిడ్డ చెప్పు ముట్టుకొనే అర్హత లేని వాడు నా బిడ్డ మెడలో తాళి కడతా అంటాడా.. నేను నీ కాళ్లు కడిగి కన్యాదానం చేయాలి.. కాళ్లు విరిచేస్తా.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

ప్రియాంక జైన్: బ్లూ డ్రెస్ లో బిగ్ బాస్ బ్యూటీ-నవ్వులతో చంపేస్తున్న క్యూట్ పిల్ల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget