అన్వేషించండి
Advertisement
Satyabhama Serial Today August 2nd : సత్యభామ సీరియల్: కోర్టులో రంగా చెప్పిన నిజం ఏంటి..? సత్యపై కోపంతో క్రిష్ ఎందుకు వెళ్లిపోయాడు..?
Satyabhama Today Episode: కోర్టులో ప్రత్యక్ష సాక్షింగా రంగాను క్రిష్ ప్రవేశపెట్టడంతో అతను ఏం చెబుతాడోనన్న అంశంతో ఇవాల్టి ఏపిసోడ్ ఏంతో ఆసక్తిగా మారింది.
Satyabhama Today Episode: కాళీ కేసులో ప్రత్యక్షసాక్షిని కోర్టుకు రాకుండా రౌడీలనుపెట్టి రుద్ర అడ్డుకోవడంతో...క్రిష్ మరొక సాక్షిని కోర్టులో ప్రవేశపెడతాడు. అతను ఎవరో కాదు చనిపోయిన కాళీ స్నేహితుడు రంగా..విశ్వనాథం కాళీతో గొడవపడుతుండగా స్నేహితుడు రంగా కూడా పక్కనే ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న క్రిష్...అతన్ని పట్టుకుని తుపాకీతో బెదిరించి నిజం తెలుసుకుంటాడు. ఇదే విషయం కోర్టులో చెప్పాలంటూ అతన్ని కోర్టుకు తీసుకొస్తాడు. ప్రత్యక్ష సాక్షి రంగా ను బోనులో నిలబెడతారు...
కోర్టు సీన్ ప్రారంభమతుంది. సత్య పక్కనే వచ్చి కూర్చున్న క్రిష్..ఆమె చేతిలో చేయివేసి టెన్షన్ పడ్డావా అని అడుగుతాడు. మామయ్యని బయటకు తీసుకొస్తాని మాటిచ్చాను.నా సత్యకు మాటిచ్చాను అంటే ప్రాణాలు అడ్డుపెట్టుకునైనా నిలబెట్టుకుంటాన్నాడు
రంగా : పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగాను ప్రశ్నించగా అతను జవాబు చెబుతాడు. కాళీ నాకు పదేళ్లుగా తెలుసు...అతను ఎక్కడికి వెళ్లాలన్నా తోడు నేనుండాల్సిందే. కాళీ(కి విశ్వనాథం ఫ్యామిలీకి గతంలోనే శత్రుత్వం ఉంది. విశ్వనాథం పెద్ద కుమార్తెను కాళీ జాతరలో ఏడిపించాడు. ఆమె కాళీని చెంపదెబ్బకొట్టడంతో కక్షపెంచుకున్నాడు. ఎలాగైనా సత్య జీవితం నాశనం చేయాలనుకున్నాడు. కానీ క్రిష్ సత్యను ఇష్టపడటంతో కాళీ వెనక్కి తగ్గాడు. వాళ్లిద్దరినీ విడదీయడం కోసం సత్యను కాళీ కిడ్నాప్ చేసి ఒకరోజు మొత్తం దాచేశాడు. తన కుమార్తె వీడియోలు తన దగ్గర ఉన్నాయంటూ విశ్వనాథాన్ని కాళీ బ్లాక్ మెయిల్ చేశాడు. డబ్బులన్నా ఇవ్వాలి లేకుండా చిన్న కూతురును ఇచ్చి పెళ్లి చేయాలని బెదిరించాడు.
లాయర్: ఈ విషయం సత్యకు తెలుసా..?
రంగా: సత్యను కిడ్నాప్ చేసి ఒకరాత్రంతా తన దగ్గరే ఉంచుకుని ఈ విషయం క్రిష్‌కు చెప్తానని విశ్వనాథాన్ని కాళీ బెదిరించాడు.
విశ్వనాథం: ఏ నిజమైతే బయటకు రాకూడదని పోలీసులకు లొంగిపోయానో..ఆ నిజమే క్రిష్‌కు తెలిసిపోయింది. అని మనుసులో అనుకుంటాడు
ఈ మాటలు విన్న క్రిష్ సత్య చేతిని విదిల్చుకుని కోర్టు హాలు నుంచి బయటకు వెళ్లిపోతాడు.
లాయర్: హత్య జరిగనప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్..?
రంగా: విశ్వనాథం సార్ ఇచ్చే 20 లక్షలు తీసుకుని రమ్మని కాళీ నన్నుపంపాడు. కానీ కాళీకి తెలియకుండా అక్కడే ఉన్నాను. విశ్వనాథం ఇచ్చే 20 లక్షలు తీసుకుని నా వాటా డబ్బులు ఇవ్వకుండా కాళీ(Kali) మోసం చేస్తాడని అక్కడే వేచి చూశాను. విశ్వనాథం డబ్బులు ఇవ్వకపోయేసరికి కాళీ గొడవకు దిగాడు. ఆ పెనుగులాటలో కాళీ మేడపై నుంచి కిందపడి చనిపోయాడు.
లాయర్: అంటే ముద్దాయి కాళీని చంపలేదా..?
రంగా: లేదు...కాళీయే కత్తితో వారిని చంపేందుకు వెళ్లగా జరిగిన పెనుగులాటలో కాళీ మేడపై నుంచి కిందపడి చనిపోయాడు
ధనుంజయ్: నిజానిజాలు కోర్టుకు తెలిసిపోయాయి కదా...కాళీని విశ్వనాథం(Viswanadham) చంపలేదని తెలిసింది కాబట్టి నిర్దోషిని విడుదల చేయాలని కోరుతున్నాను.
జడ్జి: సాక్షాధారాలను బట్టి కాళీని చంపిన ఘటనలో ముద్దాయి ప్రమేయం ఏమీలేదని తేలడంతో విశ్వనాథాన్ని నిర్ధోషిగా విడుదల చేయడం జరిగింది.
కోర్టు బయటకు వచ్చిన సత్య, వాళ్ల అన్నయ్య ఇద్దరూ కలిసి ధనుంజయ్‌కు థ్యాంక్సు చెప్పగా....మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది మీబావకు, అతనే లేకపోతే ఈ కేసు గెలిచేవాళ్లమే కాదంటాడు. మహదేవయ్య కొడుకు కాబట్టి అతను కూడా అలాగే ఉంటాడనుకున్నాను. కానీ తండ్రిని ఎదిరించి మరీ సాక్షిని తీసుకొచ్చడని చెబుతాడు. కాళీ కిడ్నాప్ చేసిన విషయం నా దగ్గర ఎందుకు దాచావని సత్యను నిలదీస్తాడు. లాయర్ల దగ్గర, డాక్టర్ల దగ్గర నిజాలు దాచకూడని చెబుతాడు. కోర్టు నుంచి బయటకు వచ్చిన విశ్వనాథాన్ని అందరూ హత్తుకుంటారు. దీనికి సత్య ఇది సంతోషపడాలో, బాధపడాలో తెలియడం లేదంటుంది. కిడ్నాప్ విషయం తెలియగానే క్రిష్ తన నుంచి కోపంగా వెళ్లిపోయాడని తండ్రికి చెబుుతుంది. జరిగినదానిలో సత్య తప్పు లేకపోయినా...క్రిష్ వద్ద నిజాన్ని దాచి తప్పు చేశామని హర్ష అంటాడు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడమని విశ్వనాథం సూచించగా...క్రిష్ రెస్పాండ్ అవ్వడం లేదని సత్య చెబుతుంది. మన కోసం క్రిష్ వాళ్ల ఫ్యామిలిని ఎదిరించి వస్తే నేను తనను బాధపెట్టానని సత్య బాధపడుతుంది. కాళీ అన్నంత పనిచేశాడని అల్లుడికి అనుమానం వచ్చిందని విశ్వనాథం కూడా బాధపడిపోతాడు. అందరం క్రిష్ ఇంటికి వెళ్లి జరిగింది మొత్తం చెబుదాం అంటాడు. క్రిష్‌కు నచ్చజెప్పగలం కానీ...వాళ్ల ఇంట్లో వాళ్ల ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేమని సత్య వారిస్తుంది. విశ్వనాథం నచ్చజెప్పి అందరినీ తీసుకుని క్రిష్ వాళ్ల ఇంటికి తీసుకెళ్తాడు.
అప్పటికే రుద్ర ద్వారా కోర్టు తీర్పు గురించి తెలుసుకున్న మహదేవయ్య కోపంతో రగిలిపోతుంటాడు. ఇదంతా ఆ లాయర్ ధనుంజయ్ వల్లే జరిగిందని మండిపడతాడు. ఇదే సమయంలో సత్యను కాళీ కిడ్నాప్ చేసి ఒక రాత్రంతా తన దగ్గరే ఉంచుకున్నాడన్న విషయం రుద్ర మహదేవయ్యకు చెబుతాడు. దీంతో అందరూ షాక్‌కు గురవుతారు. ఈ నిజాన్ని దాచిపెట్టి క్రిషన్‌ను మోసం చేశారంటూ మహదేవయ్య భార్య కోపంతో రగిలిపోతుంది. ఈ విషయం జనాలకు తెలిసి పరువు మొత్తం పోయిందని భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అదే సమయంలో ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న సత్యను, విశ్వనాథాన్ని రావొద్దని మహదేవయ్య భార్య అడ్డగిస్తుంది. ఇంట్లోకి రావొద్దని హెచ్చరిస్తుంది. ఆమెను బ్రతిమలాడుతున్న విశ్వనాథంపై రుద్ర చెయ్యిఎత్తగా....ఆ చేతిని సత్య అడ్డుకోవడంతో ఈ రోజు ఏపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
ఎంటర్టైన్మెంట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion