అన్వేషించండి

Satyabhama Serial Today April 18th: సత్యభామ సీరియల్: క్రిష్‌ ప్రవర్తనకు సత్య ఫ్యామిలీ ఫిదా.. అల్లుడు హర్షని ఘోరంగా అవమానించడానికి స్కెచ్ వేసిన భైరవి!

Satyabhama Serial Today Episode: క్రిష్‌, సత్యలను ఏకాంతంగా వదిలి విశ్వనాథం కుటుంబం గుడికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode: సత్య భర్త క్రిష్ ఇంటికి వస్తాడని అతనితో జాగ్రత్తగా ఉండాలని సత్య నానమ్మ, చెల్లి, తల్లి అనుకుంటారు. అతను వెళ్లే వరకు అందరం ఒకదగ్గరే ఉందామని ఒకరికి ఒకరం ధైర్యం చెప్పుకుందామని శాంతమ్మ అంటుంది. దానికి విశాలాక్షి మొదటి సారి అత్తారింటికి వస్తున్నాడు కుదురుగానే ఉంటాడు అంటుంది. 

శాంతమ్మ: అవును మరి అత్తారింట్లో అతడి చెల్లి కుదురుగా ఉంది కదా. ఇప్పుడు అన్న కుదురుగా ఉంటాడు. మరోవైపు విశ్వనాథం కూతురు అల్లుడి రాకకోసం బయట ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో సత్య, క్రిష్‌లు ఇంటికి వస్తారు. 
క్రిష్: నేను చెప్పింది గుర్తుంది కదా నేను ఇక్కడ రెక్కలు విడిచిన పక్షిని ఇష్టమొచ్చినట్లు ఉంటా అడ్డుపడకు.
సత్య: అడ్డు పడే పరిస్థితి తెచ్చుకోకు.
క్రిష్: ఇలాంటి లెక్కలు నడవవు నా దగ్గర. అమ్మా అయ్యా అని బతిమాలితే వచ్చాను.
సత్య: నా అవసరం కాబట్టి తప్పలేదు.
క్రిష్:  నీకు తప్పలేదు కాబట్టి నేను ఏం చేసినా తప్పులేదు. అది సరే అక్కడ మనకోసం మా మామ వెయిటింగ్. నాకు ఒకటి క్లారిటీ ఇవ్వు. ఇక్కడ మనం చిలకాగోరింకల్లా ఉండే మొగుడు పెళ్లాలమా.. పాము ముంగిసనా.
సత్య: చిలకాగోరింకల్లా ఉండే వాళ్లమే.
క్రిష్: సరిగా వినిపించలే మళ్లీ చెప్పు.
సత్య: చిలకా గోరింకల్లా ఉండే మొగుడు పెళ్లాలమ్ సరిపోతుందా.. 
విశ్వనాథం: థ్యాంక్స్ అమ్మా పండక్కి అల్లుడిని తీసుకొచ్చినందుకు.
క్రిష్: సంపంగి పైకి మాత్రమే మెత్తగా కనిపిస్తుంది కానీ చాకు మామయ్య ఏం అనుకుంటే అది చేస్తుంది. ఏం సాధించాలి అనుకుంటే అది సాధిస్తుంది. అమ్మో ఖతర్నక్..


ఇక విశాలాక్షి సత్య క్రిష్‌లకు హారతి ఇస్తుంది. సత్య లోపలికి వెళ్లి ఇంట్లో అందర్న ప్రేమగా పలకరిస్తుంది. క్రిష్ శాంతమ్మ కాళ్లకు దండం పెట్టడానికి వెళ్తే ఆవిడ దాక్కొంటుంది. దీంతో క్రిష్‌ అమ్మమ్మ నీ కాలు మొక్కడానికే వస్తున్నా అంటాడు. దానికి శాంతమ్మ నాకాలు మొక్కడం ఎందుకు అని అంటుంది. దానికి క్రిష్ అందరి వంకా అదోలా చూసి సంపంగి నాకు ఎక్కడో తేడా కొడుతుంది అని అంటాడు. 

క్రిష్: మొదటి సారి అల్లుడు ఇంటికి వస్తే ఎవరైనా ఖుషి అవుతారు. నోట్లో లడ్డు పెడతారు. మరి వీల్లేమో నోటికి లడ్డు అడ్డం పడినట్లు ఇలా చూస్తున్నారు. 
విశాలాక్షి: అబ్బే అలా ఏం లేదు బాబు. మొదటి సారి అల్లుడు ఇంటికి రావడం కదా కొద్దిగ టెన్షన్ అంతే..
క్రిష్: అత్తమ్మ నాకు తెలివి ఉందిలే.. పెళ్లిలో మామ పీక పట్టుకున్న ఈ రౌడీ అల్లుడు ఇప్పుడు ఎవరి గొంతు పట్టుకుంటాడా అని డౌట్ పడుతున్నారు అంతే కదా. అరే అదంతా పాత ముచ్చట. నాకు అంత సీన్ లేదు. నేను మీ లాంటివాడినే నాకు సెంటిమెంట్స్ ఉంటాయి. కావాలి అంటే సత్యని అడగండి. రోజు మా ఇద్దరి మధ్య ఇదే డిస్కషన్ నడుస్తుంది. 
సత్య: ఏవండి ఇక మనం..
క్రిష్: ఇంకొక్క ముచ్చట చెప్పి ఆపేస్తా.. నా జాతకంలో ఏముందో తెలుసా నా జీవితంలోకి ఓ పవర్‌ ఫుల్ లేడీ వస్తుంది అంట తను నా జీవితాన్నే మార్చేస్తుంది అంట. వచ్చింది మార్చేసింది. ఇప్పుడు మేం ఒకరి కోసం ఒకరు పుట్టాం అన్నట్లు ఉంటున్నాం. 
సత్య: లెక్క తప్పుతుంది.
క్రిష్‌: చిలకా గోరింక అన్నావ్ కదా..
శాంతమ్మ: రా బాబు కాళ్లకు మొక్కతా అన్నావ్ కదా ఆశీర్వదిస్తాను.. శీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు..  
క్రిష్‌:  అమ్మమ్మ ఇంకొక్కసారి ప్లీజ్. 
శాంతమ్మ: ఏంటి బాబు మూడుసార్లు దీవించమన్నావ్ మీ ఇంటి ఆచారమా..
క్రిష్‌:  కాదు బామ్మ పైన దేవుడు బిజీగా ఉంటాడు కదా ఒకసారి కాకపోయినా మరోసారి అయినా అతని చెవిలో పడుతుందని. అందరూ నవ్వుతారు. 
విశాలాక్షి: అమ్మ సత్య అల్లుడి గారిని నీ గదికి తీసుకెళ్లమ్మా..
క్రిష్‌:  అయ్యో నువ్వు బ్యాగ్ పట్టుకోవడం ఏంటి సత్య నీ చేతులు కందిపోతాయ్. నేను ఉన్నాను కదా.. చూడు మనం చిలకా గోరింకల్లా ఉన్నామని ఇక్కడ అందరూ సంబరపడిపోతున్నారు. మన మధ్య సంతోషం రెట్టింపు చేయడానికే ఇక్కడికి వచ్చాం.
విశ్వనాథం: చూశారా..
విశాలాక్షి: హమ్మయ్యా అమ్మాయిని అల్లుడిని ఇలా చూస్తుంటే గుండెలో భారం అంతా దిగిపోయింది.
సంధ్య: అవును అమ్మ.. బావగారిని చూస్తుంటే సంతోషమేస్తుంది. ఇంతకు ముందు రౌడీలా ఉండే బావ ఇప్పుడు చూడు ఎంత స్టైల్‌గా లవర్ బాయ్‌గా ఉన్నాడు. అక్కని చూడు ఎంత సంతోషంగా చూసుకుంటున్నాడు.
విశ్వనాథం: అంతకు మించి మనకు ఏం కావాలమ్మ. 

మరోవైపు నందిని, హర్ష రాక కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. భైరవి తెగ హడావుడి చేస్తుంది. ఇక హర్ష, నందిని ఇంటికి వస్తారు. నందిని కారు దిగడమే పరుగున తల్లి దగ్గరకు వచ్చేస్తుంది. వెనక హర్ష బ్యాగులతో వస్తాడు. హర్షని ఎవరూ పట్టించుకోరు. భైరవి కావాలనే హర్షని అవమానిస్తే మహదేవయ్య తల్లి మాత్రం హారతి ఇవ్వమని చెప్తుంది.  భైరవి పట్టించుకుకోకపోతే మహదేవయ్య వచ్చి హారతి ఇవ్వమని అంటాడు.  ఇక భైరవి కూతురు అల్లుడు ఇద్దరికీ హారతి ఇస్తుంది. 

మహదేవయ్య: కూతురు కళ్లలో సంతోషం కనిపిస్తుంది అంటే అది అత్తారింట్లో సుఖంగా ఉంది అని అర్థం.
భైరవి: అది పుట్టింటికి వచ్చిన సంతోషం. మీ మగాలకు తెలీదు. రా అల్లుడు..
మహదేవయ్య: చూడు అల్లుడు కారణం ఏదైతే ఏంటి ఇప్పుటి వరకు మా కోపాన్నే చూశావు. ఇప్పుడు మా ప్రేమ ఎలా ఉంటుందో చూస్తావ్. ఇదిగో మన మర్యాదలు అల్లుడు ఇంటికి పోయినాక నిద్రలో కూడా గుర్తుండాలి. అర్థమైందా.. 
భైరవి: అలాగే..
 
ఇక సత్యను విశాలాక్షి పిలిచి అల్లుడి కోసం చేసిన వంటకాల గురించి కూతురికి చెప్పి ఇవ్వమని అంటుంది. ఇక కొత్త జంటతో దాంపత్య వ్రతం చేయించాలి అని తామంతా గుడికి వెళ్లి వస్తామని చెప్తుంది. ఇక సత్య తాను ఒంటరిగా  ఉంటే తన భర్త ఊరుకోడు అని తాను కూడా వస్తాను అని అంటుంది. విశ్వనాథం వద్దు అనడంతో తన భర్తని కూడా తీసుకొని వస్తా అంటుంది. ఇక విశాలాక్షి వద్దు అని సత్యని ఇంట్లో ఉండమని చెప్తుంది. 
సంధ్య: అక్క తలుపు గడియ పెట్టుకో లేటుగా వస్తాంలే.
సత్య: నిన్నూ... ఛా పుట్టింట్లో అయినా ప్రశాంతంగా ఉందాం అంటే వీళ్లేంటి ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నా వీడు ఏం చేస్తాడో ఏంటో..

నందిని: ఏంటమ్మా ఇది బాపు రోజుకో తీరు మాట్లాడుతున్నాడు. మా అత్తింటికి వచ్చి అల్లుడి మీద కళ్లెర్ర చేస్తే ఇదేదో మంచిగానే ఉంది అనుకుంటే ఈ దినం అల్లుడు మీద చేయి వేసి ప్రేమగా మాట్లాడుతున్నాడు.
భైరవి: రాజకీయాల్లోకి దిగాడు కదనే అలాగే ఉంటాడు. 
నందిని: పర్మినెంట్‌గా నన్ను ఆ ఇంట్లో ఉంచేయాలి అని ఫిక్స్ అయిపోయాడా.
భైరవి: మరి ఎమ్మెల్యే కావాలి కదా బిడ్డా.
నందిని: చూడమ్మా నేను పండక్కి వచ్చింది నీతో చీరాసారె తీసుకెళ్లడానికి కాదు పుట్టింటిలోనే ఉండిపోవడానికి.
భైరవి: తెలుసు నేను చక్రం తిప్పుతా కదా. నువ్వు ఆ ఇంటికి పోయేదే లేదు. నీ మొగుడు ఒక్కడే పోతాడు. వాడి మొండి తనం పెళ్లం దగ్గర పనికొస్తుంది. కానీ ఈ అత్త దగ్గర కాదు. కానీ నీ ప్రయత్నం కూడా చేయి. మారం చేసి నీ అత్తింట్లో కష్టాలు పడుతున్నట్లు చెప్పు. వాటితో మీ బాపునకు అల్లుడు మీద అగ్గి పుట్టాలి. పండగ పూర్తికాగానే నీ మొగుడికి ఈ ఇంట్లో అల్లుడి స్థానం పోయేలా చేస్తా. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: విశాలాక్షి తాళి మెడలో వేసుకొని మాడి మసైన తిలోత్తమ.. గాయత్రీదేవితో చెంప దెబ్బ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India T20 World Cup Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India T20 World Cup Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Embed widget