అన్వేషించండి

Satyabhama Serial Today November 2nd: సత్యభామ సీరియల్: ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికిపోయిన మహదేవయ్య.. తృటిలో తప్పించిన సత్య!

Satyabhama Today Episode క్రిష్‌ మహదేవయ్య ఇచ్చిన డబ్బు తీసుకెళ్లకుండా చేయడానికి సత్య ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు చెప్పి డబ్బు పట్టించేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode క్రిష్‌ కాళ్లు మొక్కమని అందరూ సత్యని చెప్తే ఆడ మగ సమానం కదా సత్య కాళ్లు మొక్కాల్సిన అవసరం లేదని అంటాడు. దానికి ఆడ మగ సమానమే భార్యభర్త కూడా సమానమే కానీ భార్య భర్త కాలు మొక్కడంలో అస్సలు తప్పు లేదని చిన్నవాళ్లు పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పు లేదని భర్త అంటే ఆడదానికి తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడని పెళ్లికి ముందు వరకు తండ్రి ఎలా చూసుకుంటాడో పెళ్లి తర్వాత భర్త ఆ బాధ్యత తీసుకోవాలి అంటుంది. భర్తని నమ్మి నిశ్వార్థంగా ప్రేమిస్తుంది. భర్త క్షేమంగా ఉంటేనే కదా భార్య క్షేమం చూసేది అని సత్య అందరికీ చెప్తుంది. 

ఈ బాధ్యతలు అన్నీ గుర్తుండాలి అనే భార్య భర్త కాళ్లను పండగల టైంలో మొక్కుతుందని సత్య అంటుంది. సత్య మంచి టైం చూసి భర్తని ఎమోషనల్‌ లాక్ చేస్తుందని మహదేవయ్య మనసులో అనుకుంటాడు. ఇక సత్య క్రిష్‌ కాళ్లకి దండం పెట్టి తన పెళ్లి నుంచి మొత్తం క్రిష్‌ని తాను ద్వేషించడం క్రిష్ ప్రేమ చూపించడం తనని భరించడం గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకుంటుంది. క్రిష్ కాళ్ల మీద కన్నీరు పడతుంది. ఇక సత్య పైకి లేచి క్రిష్‌ని హగ్ చేసుకుంటుంది. తర్వాత ఇద్దరూ వెళ్లి జయమ్మ దగ్గర, మహదేవయ్య, భైరవిల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.  

సత్య: ఏమని దీవించారు మామయ్య. రత్నం లాంటి వారసుడిని ఇవ్వమని దీవిస్తారేమో అనుకున్నా. పెద్ద కొడుకుని అలాగే గతంలో దీవించారు కదా చిన్న కొడుకు విషయంలో ఎందుకు పక్షపాతం. చిన్న కొడుకు ఇచ్చే వారసుడు మీ వారసుడు కాడా మామయ్య. 
మహదేవయ్య: కాదని ఎవరు అన్నారు ఎందుకు అలా అన్నారు.
భైరవి: చిన్నా గాడి పేరు గుండెల మీద పచ్చబొట్టు వేసుకున్నారు ఇంకా నీకు అర్థం కావడం లేదా.
సత్య: నా అర్థమేంటో మామయ్యకి తెలుసు.
భైరవి: ఏంటయ్యా ఇది ఏదో అర్థం కాని భాషలో మాట్లాడుతుంది. 
మహదేవయ్య: ఏంర్రా మీ మీద పెంచిన ప్రేమలో తేడా కనిపిస్తుందా కావాలంటే చెప్పురా ఇంకా పెంచుతాం.
క్రిష్: సత్య ఏదో మాట వరసకు అంది దాన్ని మీరుఎందుకు అలా అనుకుంటారు. బాపు ప్రేమలో లోటు ఉండదు ఉంటే ఎలా పూడ్చుకోవాలో నాకు తెలుసు.

ఇంతలో మహదేవయ్య ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు వస్తారు. ఇంట్లో బ్లాక్ మనీ ఉందని అంటారు. క్రిష్ తిరగబడితే మేం సెర్చ్ వారంటీతో వచ్చామని అంటాడు. ఎవరు పడితే వాళ్లు రావడానికి ఇది పశువుల గొడ్డనుకున్నారా మహదేవయ్య అడ్డ అని అంటాడు. అధికారులకు కోపరేట్ చేయాలని సత్య భర్తతో చెప్తుంది. రేపు రండి మాపు రండి అంటే కోపరేట్ చేయకపోతే అరెస్ట్ చేస్తామని అంటారు. సత్యని మాట్లాడొద్దని భైరవి అంటుంది. సత్యనే ఇదంతా చేసుంటుందని మహదేవయ్య అనుకుంటాడు. జయమ్మ వెళ్లి వెతుక్కోండి అంటుంది. అధికారులు వెళ్తారు. ప్రతీ గదిని వెతుకుతారు. 

మహదేవయ్య: భర్తని కాపాడుకోవడానికే సత్య నన్ను ఇరికిస్తుంది.
క్రిష్: ఈ గండం నుంచి తప్పించుకునేది ఎలా దాదాపు దొరికిపోయినట్లే.
సత్య: అమ్మ లక్ష్మీ దేవి నా భర్త ప్రమాద భారీన పడకుండా నువ్వే కాపాడాలి తల్లీ.
అధికారులు: ఇళ్లంతా వెతికి ఏం దొరకపోవడంతో ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తప్పుగా అనుకోవద్దు. 
క్రిష్: మనసులో.. పైసలు లేవు అంటారేంటి ఇంట్లో పెట్టిన పైసలు ఏమైనట్లు. 

అధికారులు వెళ్తూ మళ్లీ వెనక్కి వచ్చి కారుని చెక్ చేయమని అంటారు. కారులో వెతకగానే డబ్బు కనిపిస్తుంది. అందరూ షాక్ అయితే సత్య హ్యాపీగా ఫీలవుతుంది. ఈ డబ్బు మీదేనా అని అధికారులు అడిగితే సత్య పని వాడికి సైగ చేస్తుంది. దాంతో ఆయన వచ్చి ఆ డబ్బు నాది అని అంటాడు. ఇంట్లో ఉంటే క్షేమం కాదని నేనే కారులో దాచానని అంటాడు. నీ పరిస్థితికి ఇంత డబ్బు ఎక్కడికి అని అడిగితే ఆయన ఏం మాట్లాడకపోవడంతో డబ్బుతో పాటు అతన్నీ తీసుకెళ్తారు పోలీసులు. అందరూ ఆ పని వాడు ఇంత మోసం చేస్తే ఎందుకు ఏం అనలేదు అని అంటే దానికి సత్య ఆయన మనల్ని కాపాడాడు ఆ డబ్బు మామయ్య గారిదే అని అంటుంది.

మామయ్య గారు దొరికిపోయాడని అర్థమై నేనే అతనికి దొరికిపోమని సైగ చేశానని చెప్తుంది. అతను అర్థం చేసుకొని దొరికిపోయాడని లేదంటే మామయ్య దొరికి పోయి ఉంటే చాలా ప్రాబ్లమ్ అయ్యేదని ఎమ్మెల్యే టికెట్ దొరికేది కాదని అంటుంది. నా కొడుకు పరువు కాపాడావు అమ్మ అని అంటుంది. క్రిష్‌ కూడా సత్యని పొగిడేస్తాడు. మన డబ్బు అంతా పోయినట్లే కదా అని భైరవి అంటుంది. దానికి రేణుక పైసలు కంటే పరువు ముఖ్యం అంటుంది. ఇంత డబ్బు ఇంట్లో ఉంటే నష్టమో ఎంత అజాగ్రత్త అని అంటుంది సత్య. అవునమ్మా నేను చాలా అజాగ్రత్తగా ఉన్నానమ్మా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అర్చనకు సుమతి ఫోన్.. తొలిరేయి ఆపడానికి మహాలక్ష్మీ కొత్త ప్లాన్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Health News: అపోలో హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్, బెడ్ మీద డిప్యూటీ సీఎం ఫొటోలు వైరల్- అసలేం జరిగింది
అపోలో హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్, బెడ్ మీద డిప్యూటీ సీఎం ఫొటోలు వైరల్- అసలేం జరిగింది
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
South Actress: చిరు, కమల్, బాలయ్యతో నటించిన హీరోయిన్... తాగుడుకు బానిసై కెరీర్ నాశనం... భర్తతోనూ గొడవలే, 44 ఏళ్ల వయసులో రెండో పెళ్లి
చిరు, కమల్, బాలయ్యతో నటించిన హీరోయిన్... తాగుడుకు బానిసై కెరీర్ నాశనం... భర్తతోనూ గొడవలే, 44 ఏళ్ల వయసులో రెండో పెళ్లి
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

APPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP DesamSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ | ABPSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి ఉత్తమ్Chicken Biryani and roast Free | గుంటూరు ఉచిత చికెన్ మేళాకు భారీగా భోజన ప్రియులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Health News: అపోలో హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్, బెడ్ మీద డిప్యూటీ సీఎం ఫొటోలు వైరల్- అసలేం జరిగింది
అపోలో హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్, బెడ్ మీద డిప్యూటీ సీఎం ఫొటోలు వైరల్- అసలేం జరిగింది
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
South Actress: చిరు, కమల్, బాలయ్యతో నటించిన హీరోయిన్... తాగుడుకు బానిసై కెరీర్ నాశనం... భర్తతోనూ గొడవలే, 44 ఏళ్ల వయసులో రెండో పెళ్లి
చిరు, కమల్, బాలయ్యతో నటించిన హీరోయిన్... తాగుడుకు బానిసై కెరీర్ నాశనం... భర్తతోనూ గొడవలే, 44 ఏళ్ల వయసులో రెండో పెళ్లి
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
Telugu TV Movies Today: చిరంజీవి ‘అందరివాడు’, బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ to నాని ‘సరిపోదా శనివారం’, శివకార్తికేయన్ ‘అమరన్’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 23) టీవీలలో వచ్చే సినిమాలివే
చిరంజీవి ‘అందరివాడు’, బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ to నాని ‘సరిపోదా శనివారం’, శివకార్తికేయన్ ‘అమరన్’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 23) టీవీలలో వచ్చే సినిమాలివే
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Hyderabad Metro Rail :హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
Embed widget