అన్వేషించండి

Satyabhama Serial Today Episode In Telugu: సత్య ప్లాన్ సక్సెస్‌- తండ్రిపై క్రిష్‌కు అనుమానం మొదలు- ట్విస్ట్‌లతో సాగుతున్న సత్యభామ సీరియల్

Satyabhama Today Episode గంగకి డబ్బు ఇచ్చి వదిలించుకుందామని భైరవి అంటే సగం ఆస్తి ఇవ్వమని గంగ మహదేవయ్యని అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య గంగ దగ్గరకు వెళ్తే గంగ బ్యాగ్ సర్దుతుంది. ఎందుకని సత్య అడిగితే నేను డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకోను ఉండను అని అంటుంది. దానికి సత్య ఏమైంది ఎందుకు ఇప్పుడు మధ్యలో డ్రాప్ అవుతున్నావ్ నువ్వు వెళ్లిపోతే మొదటికే మోసం వస్తుందని, తన భర్త జీవిత రహస్యం తెలియకుండా ఉండిపోతుందని ఆలోచించమని చెప్తుంది. తన భర్తని ప్రమాదం నుంచి తప్పించమని వేడుకుంటుంది. 

సత్య: అర్థాంతరంగా నువ్వు వెళ్లిపోతే మా మామయ్య ముందు జీవితాంతం నేను తలెత్తుకోలేని పరిస్థతి వస్తుంది. ఇక క్రిష్‌ని జీవితాంతం పరుగెత్తుకుంటూ కాపాడుకునే ఓపిక నాకు లేదు గంగ. నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా గంగ డీఎన్ఏ టెస్ట్‌కి ఒప్పుకోవడం చాలా కష్టమే కానీ అలా చేస్తే జీవితాంతం నీకు రుణ పడి ఉంటాను. ప్లీజ్ గంగ.
గంగ: సరే.
సత్య: థ్యాంక్యూ గంగ. నీ యాక్టింగ్ సూపర్ గంగ నిజంగానే అందరూ మా మామయ్యకి రెండో భార్య ఉంది అనుకుంటున్నారు.
గంగ: పొరపాటున మీ మామయ్య రెండో భార్యగా ఉండిపోమని చెప్పగలడు. అలాంటివేమీ కుదరవని చెప్పు. మా ఆయన ఊరుకోడు. అని ఇద్దరూ నువ్వుకుంటారు.
సత్య: నువ్వు నా మనిషి అని మామయ్యకి తెలుసు ఇప్పుడు. ఆయన్ని అష్టదిగ్భంధనం చేశాం.
గంగ: మనకి ఏం ప్రమాదం లేదు కదా ఆయన డీఎన్ఏ టెస్ట్‌కి వస్తారా. 
సత్య: కచ్చితంగా రావాల్సిందే. టెస్ట్ నుంచి రిజల్స్ వచ్చే రెండు రోజులు మనకు చాలా ముఖ్యం. మనం మామయ్యకి చాలా టార్చర్ చేయాలి. క్రిష్ తండ్రి తాను కాదని ఒప్పుకొనేలా చేయాలి.
గంగ: అది నాకు వదిలేయ్ మీ మామయ్య పని అయిపోతుంది. నువ్వు అనుకున్నది జరిగే తీరుతుంది. 
భైరవి: రేయ్ చిన్నా అదెవర్తో నా సవతిలా వచ్చి నట్టింట్లో ఆగం ఆగం చేస్తుంది దాని అంతు చూడరా.
క్రిష్: బాపుతో ఒక్క మాట చెప్పించు దాని సంగతి నేను చూసుకుంటా.
గంగ: నా గురించి ఏదో మాట్లాడుతున్నారు ఇక చాలు బాబు అలసిపోయావ్ ఈ పాలు తాగు అని డంబుల్స్ పక్కన పడేస్తుంది. కొంచెం పాలు తాగు నాన్న చిన్నప్పుడు ఇలా చేయలేకపోయాను ఇప్పుడు తాగు. మీ పెద్దమ్మ ఏమైనా అనుకుంటుంది అనుకున్నావా ఏం అనుకోదులే.
భైరవి: పెద్దమ్మ ఎవరే క్రిష్ నా కొడుకు.

ఇంతలో సత్య పువ్వులు తీసుకొచ్చి అత్తయ్య మీ కోసం తీసుకొచ్చా అంటే భైరవి తీసుకునే టైంలో గంగ తీసుకొని దాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరం సవతులం కదా ఆయన ఎవరి దగ్గరకు వస్తారో తెలీదు మల్లెపూలు పెట్టుకొని ఇద్దరం చక్కగా ఉండాలని అంటుంది. క్రిష్‌ చేతితో ముక్కు దగ్గర యాటిట్యూడ్‌గా చేయి తిప్పితే అది నా అలవాటే అందుకే నా కొడుకు నాలా చేశాడని అంటుంది. ఇక భైరవి రింగులు చూసి ఇలాంటివే నాకు కొనిపెట్టాడు మన మీసాల దొరకి నువ్వు నేను అంటే ఎంత ప్రేమో అంటుంది. 

ఇక బంటి అందరి టిఫెన్ మొత్తం తినేస్తాడు. భైరవి వచ్చి టిఫెన్ పెట్టమని అంటే ఎవరికీ ఇక టిఫెన్ లేదు ఈ బకాసరుడు పది మంది టిఫెన్ తినేశాడని పంకజం చెప్తుంది. ఇక టిఫెన్ అంత అయిపోయిన తర్వాత బంటి అరటి పళ్లు తీసుకొని వెళ్లిపోతాడు. ఇంతలో సత్య వచ్చి అత్తయ్య ఇప్పుడు ఈ ఆకలి గురించి కాదు ఆ గంగ మీ భార్య స్థానం తీసుకొనేలా ఉందని జాగ్రత్త పడమని చెప్తుంది. రేణుక కూడా వచ్చి చెప్తుంది. గంగకి ఎంతో కొంత ఇచ్చి పంపేమని మామయ్యకి చెప్పమని సత్య భైరవితో చెప్తుంది. అక్కా చెలెళ్లు ఇద్దరూ అత్తని రెచ్చగొట్టేస్తారు. 

క్రిష్ మహదేవయ్య దగ్గరకు వెళ్లి ఏమైనా ప్రాబ్లమా బాపు నాకు చెప్పకూడని నిజం ఏమైనా ఉందా అని అడుగుతాడు. నీ దగ్గర ఏం దాపరికాలు లేవని మహదేవయ్య అంటే ఇంతలో భైరవి వచ్చి దాపరికాలు నా దగ్గరేనా పెనిమిటి అంటుంది. దాంతో మహదేవయ్య దిమాక్ తిరుగుతుందా అని తిడతాడు. గంగ టార్చర్‌లా ఉందని నా వల్ల కావడం లేదని భైరవి ఏడుస్తుంది క్రిష్ తల్లితో బాపుని అనుమానించొద్దని ఆ గంగని పట్టించుకోకుండా నీ పని చేసుకో అని చెప్తాడు. అప్పుడే సత్య వచ్చి అది అయ్యే పని కాదు క్రిష్ ఆ గంగ అత్తయ్యని సతాయిస్తుందని చెప్తుంది.

ఇంతలో జయమ్మ, రేణుక వచ్చి రెండు రోజులు ఓపిక పట్టమని అంటుంది. గంగ ధైర్యం చూస్తుంటే భయంగా ఉందని డీఎన్ఏ టెస్ట్‌కి సిద్ధమని అంటుందని దానికి ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందామని అంటుంది. అలా చేస్తే మన పరువు పోతుందని క్రిష్ అంటాడు. రాజకీయాల్లో కూడా ఇది మామయ్యకి సమస్య అవుతుందని సత్య అంటుంది. గంగకి డబ్బు ఇచ్చి ప్రశాంతంగా ఉందామని భైరవి అంటే అంతా మీ ఇష్టమేనా అని గంగ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ లేదని నా కొడుకుని ఇస్తే పోతానని ముందే చెప్పా వినకుండా డీఎన్‌ఏ టెస్ట్‌కి ఒప్పుకున్నారు కదా ఇప్పుడు తగ్గేదే లేదని అంటుంది. ఇక ఆస్తిలో సగం ఇవ్వమని గంగ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: జన్మలో గగన్‌ దగ్గరకు వెళ్లొద్దన్న శరత్‌చంద్ర – గగన్‌ ప్రేమ విషయం తెలుసుకున్న శారద

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
Embed widget