Satyabhama Serial Today February 4th: సత్యభామ సీరియల్: మహదేవయ్య అరాచకం.. సత్యకి 3 రోజులు గడువు.. భైరవి నగల ఎర!
Satyabhama Today Episode సంజయ్ అస్సలు మంచి వాడు కదాని ఎలక్షన్ నుంచి తప్పుకోకపోతే నీ చెల్లిని చంపేస్తాడని మహదేవయ్య సత్యతో చెప్పి 3 రోజులు గడువు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య దగ్గరకు మహదేవయ్య వచ్చి సంజయ్, సంధ్యని చూపించి వాళ్ల మురిపాలు చూస్తుంటే మండిపోతుంది కదా కోడలు కాని కోడలా అని అంటాడు. సత్య వెళ్లి పోతుంటే మాట్లాడటానికే వచ్చాను నువ్వు వెళ్లిపోతే ఎలా అని ఆపుతాడు.
మహదేవయ్య: క్రిష్ గానికి నిజం తెలిస్తే నన్ను చంపేస్తాడని ఇన్ని రోజులు జాలి పడ్డావు కదా. ఇకపై ఆ అవసరం లేదులే. నీ మొగుడు నన్ను ఏమైనా చేస్తే నా కన్న కొడుకు సంజయ్ నీ చెల్లిని బతకనివ్వడు. ఎట్లా ఉంది ఇక్వేషన్. సంజయ్ గాడు ఒక ఆవారా కానీ వాడికి నీ చెల్లి దొరికింది. ఆట ఆడుతాడు. వాడుకుంటాడు. అవసరం తీరిపోతే ఎత్తి అవతల పడేస్తాడు. ఇప్పుడు నీ చెల్లి జీవితం నా చేతిలో ఉంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోరా అంటే నా మాట దాటడు. అందుకు నువ్వు ఎలక్షన్ నుంచి తప్పుకోవాలి. లేదంటే వాడికి ఒక్కఫోన్ చేసి కిందకి దాన్ని తోసేయ్‌రా అంటే ఎందుకు ఏమీ అనకుండా తోసేస్తాడు. నీకు 3 రోజులు టైం ఇస్తా ఈలోపు నువ్వు ఎలక్షన్ నుంచి తప్పుకోవాలి. లేదంటే వాళ్లకి హనీమూన్ టికెట్స్ ఇస్తా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. తిరిగి వచ్చేది నా కొడుకు మాత్రమే నీ చెల్లి శవం కూడా దొరకదు.
సత్య: ఎలా అయినా ఈ 3 రోజుల్లో సంజయ్ నిజస్వరూపం సంధ్యకి తెలిసేలా చేయాలి.
విశ్వనాథం చిన్న కూతురి మాటలు తలచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో విశాలాక్షి ఇంట్లో ఉన్న సంధ్య బట్టలు, ఫొటోలు, వస్తువులు అన్నీ పడేస్తుంది. సంధ్యకి సంబంధించి ఏం వస్తువులు ఇంట్లో ఉండకూడదని నందినితో వెతికి అన్నీ తీసుకు రమ్మని కాల్చేస్తానని అంటుంది. అలా చేయొద్దని విశ్వనాథం చెప్తాడు. భార్యకి సర్దిచెప్పాలి అనుకుంటాడు. దాంతో విశాలాక్షి జీవితంలో అది గుర్తు రాకూదని ఏడుస్తుంది. విశాలాక్షి కుప్పకూలిపోయి ఏడుస్తుంది. అందరూ ఒకర్ని ఒకరు సర్దిచెప్పుకుంటారు. ఇంతలో విశ్వనాథం అంతా మర్చిపోదాం అని నందినికి కాఫీ పెట్టమని అంటాడు. ఏడుస్తూ ఉన్న విశాలాక్షి లేచి నేను పెడతా అని అంటుంది. దాంతో విశ్వనాథం ఏం నీ కోడలికి చెప్పకూడదా అంటే దానికి నందిని నేను మీ కోడలిని కాదు మీ కూతురిని ఇద్దరు ఆడపడుచులు అత్తిళ్లకు వెళ్లిపోయారు కాబట్టి ఇక నుంచి నేనే మీ కూతురు అంటుంది. దాంతో విశాలాక్షి ఎమోషనల్‌గా నందినిని హగ్ చేసుకుంటుంది. ఇక మరోవైపు మహదేవయ్య క్రిష్‌ని పిలుస్తాడు.
సంధ్యని, సంజయ్‌ని బయటకు పంపేద్దామని నీ భార్య వాడికి మాటల్లో నరకం చూపిస్తుందని చెప్తాడు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. తండ్రి సరిగా చూసుకోలేదు. సంధ్య ప్రేమ లోనే అన్ని చూసుకుంటాడు. కానీ సత్య వాడి మీద ద్వేషంతో సంధ్య మనసు మార్చేస్తుందని వాడు పిచ్చివాడు అయిపోతాడని చెప్తాడు. సత్య సర్దుకుంటుందని సంధ్య, సంజయ్‌లను ఇక్కడే ఉండమని చెప్తాడు. దాంతో మహదేవయ్య సత్యకి సంజయ్ జోలికి వెళ్లొద్దని చెప్పమంటాడు. క్రిష్ మాట ఇస్తాడు. తమ్ముడి కొడుకు కోసం కూడా ఇంత ఆలోచిస్తున్నావు అంటే నువ్వు గ్రేట్ బాబు అంటే మహదేవయ్య మనసులో వెర్రోడా వాడే నా సొంత కొడుకు అని అనుకుంటాడు.
క్రిష్ గులాబి తీసుకొని సత్య దగ్గరకు వెళ్లి మోకాల మీద కూర్చొని పువ్వు ఇస్తాడు. సత్య కనీసం చూడదు దాంతో క్రిష్ నేల మీద కూర్చొంటాడు. తర్వాత పువ్వుని సత్య జడలో పెట్టి ఫొటోలు తీస్తాడు. అయినా సత్య చూడదు. ఆ ఫోటలు సత్య ఫోన్‌కి పంపిస్తాడు. అప్పుడు చూసిన సత్య ఇదెక్కడిది అనుకుంటే మొగుడు పెడితే వచ్చిందని అంటాడు. మొగుడి మీద ప్రేమ ఉంటే పువ్వు ఉంచుకో అని క్రిష్ అంటే సత్య పువ్వు తీయదు దాంతో క్రిష్ సత్యని ముద్దు పెడతాడు. బాపు చెప్పాడని సత్యని ఒప్పించాలి అనుకుంటే సత్య అస్సలు లొంగడం లేదని అంటాడు. నింద వేసిన వారు దోషులు కాదని దానికి తగిన సాక్ష్యం ఉండాలి అంటాడు. దాంతో సత్య నిరూపిస్తానని అనుకుంటుంది. ఇక భైరవి నగలు పోగేసుకొని వీటి వాసన చూపించి సంధ్యని తన వెంట తిప్పుకుంటానని అంటుంది. సంధ్యని పిలిచి నగలు పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానించిన సంధ్య.. సంజయ్, బిగ్‌డాడీల కొత్త ఆట షురూ!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

