Satyabhama Serial Today February 12th: సత్యభామ సీరియల్: సత్యకి తెలీకుండా ఫస్ట్‌నైట్ చేసుకొని వచ్చిన సంధ్య.. ఎలక్షన్‌లో తప్పుకోనున్న సత్య!
Satyabhama Today Episode సత్య అడ్డుకుంటుందని సంజయ్, సంధ్యలు ఎవరికీ తెలీకుండా బయటకు వెళ్లి ఫస్ట్‌నైట్ చేసుకొని రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode క్రిష్ ఆరు బయట ఫోన్ మాట్లాడుతుంటే సత్య వెళ్లి క్రిష్ భుజం మీద వాలిపోతుంది. సంజయ్‌కి అక్కడ లవర్ ఉందని నీకు బాబాయ్ చెప్పాడు కాబట్టి నువ్వు సంజయ్ మీద చెడు అభిప్రాయం ఉందని అంటాడు. సత్య మనసులో నీ మంచితనం వల్ల నువ్వు ఇంతకు మించి ఆలోచించలేవని అనుకుంటుంది. సంజయ్ చాటుగా ఆ మాటలు వింటాడు. సంజయ్ మంచోడు కదా అందుకే రూప పారిపోయింది. ఇక సంధ్య, సంజయ్ హ్యాపీగా ఉంటారని సత్యకు క్రిష్ చెప్తాడు.
సంజయ్: ఛా.. సంధ్య మనం ఇక కలిసి ఉండం అనిపిస్తుంది. మీ అక్క 24 గంటలు మన కోసమే ఆలోచిస్తుంది. మనం బంధం ఎలా బ్రేక్ చేయాలా అని ఆలోచిస్తుంది.
సంధ్య: తెలుసు అందుకే కదా నీ మాజీ లవర్‌ని తీసుకొచ్చింది.
సంజయ్: ఎంత కాలం నాకు ఈ పరీక్షలు నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావో అని భయంగా ఉంది. మన ఫస్ట్ నైట్ కూడా జరగనివ్వదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.
సంధ్య: నాకు అర్థమైంది. ఎవరికీ తెలీకుండా పెళ్లి చేసుకున్నట్లే ఎవరీకీ తెలీకుండా ఫస్ట్‌నైట్ చేసుకుందాం. ఎప్పుడో కాదు ఈ రాత్రికే.
సంజయ్: మనసులో నా బంగారు తల్లే ఈ ఊపే కదా నీలో కోరుకున్నది. మా ఫ్రెండ్ రిసార్ట్‌కి వెళ్లి అక్కడ జరుపుకుందాం. సిగ్గంతా కొంచెం దాచుకో.
మహదేవయ్య: సత్య చూస్తూండగా ఏయ్ గోపాల్ మా పిల్లల హనీమూన్‌కి రూం బుక్ చేశావుగా.
సత్య: కాఫీ.
మహదేవయ్య: ఒక్క నిమిషం మరొక్క కాల్ ఉంది. రేయ్ రాజు నీకు డిటైల్స్ పంపాను ఆఅమ్మాయి చనిపోవాలి. నాకు ఈ రోజు ఒక సెటిల్మెంట్ ఉంది అది అవ్వకపోతే ఆ అమ్మాయికి చంపేయ్ నేను నీకు చెప్తా. కోడలు కాని కోడలా ఈ రాత్రికే నీ గడువు అయిపోయింది. నా మాట వింటే నీ చెల్లి తిరిగి ప్రాణాలతో వస్తుంది. లేదంటే ఫోటోకి దండ రెడీ చేసుకో.
ఉదయం లేచి సత్య దగ్గరకు జయమ్మ వచ్చి సంధ్య గురించి అడుగుతుంది. నీ దగ్గర పడుకుంది కదా అని సత్య లేదని అనుకుంటారు. భైరవి కంగారుగా వచ్చి సంజయ్ కూడా లేడని చెప్తుంది. సత్య కంగారుగా కాల్ చేయబోతే ఇద్దరూ బయట నుంచి వస్తారు. అందరూ కంగారు వెళ్లి ఏమైందని ఎక్కడికి వెళ్లారని అడుగుతారు.
సంజయ్: రాత్రి మా ఫ్రెండ్ రిసార్ట్‌కి వెళ్లాం ఫస్ట్‌నైట్ జరుపుకోవడానికి.
సత్య: కోపంగా వెళ్లి సంధ్యని కొడుతుంది. క్రిష్ ఆపితే వదలు క్రిష్ దీని ప్రాణాలు తీసినా తప్పు లేదు.
సంధ్య: నీ భార్య మీద చేయి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావేంటి సంజయ్.
జయమ్మ: తప్పు చేసింది కాక ఏంటమ్మా ఈ దబాయింపు. పెద్దలకు తెలీకుండా చెప్పకుండా ఇలా ఫస్ట్‌నైట్ చేసుకొని రావడం ఏమైనా బాగుందా.
సంధ్య: నన్ను ప్రశ్నించే ముందు ఒక సారి మీ ముద్దుల మనవరాలిని అడగండి బామ్మగారు. మా ఫస్ట్‌నైట్ జరగడం తనకు ఇష్టమేనా అని.. నేను గీత దాటి ఎవరికీ తెలీకుండా పెళ్లి చేసుకోవడం తప్పే ఎవరికీ తెలీకుండా ఫస్ట్‌నైట్ చేసుకోవడం తప్పే కానీ దీనంతటికీ ఈ మొండి తనం నీ శాడిజం కారణం కాదా.
సత్య: నోర్ముయ్. నీకు జీవితం విలువ తెలీడం లేదే. ఎలాంటి ఊబిలో ఇరుక్కుంటున్నావో తెలీడం లేదు.
సంధ్య: నా జీవితంలో నువ్వు నిప్పులు పోయాలి అని చూస్తున్నావ్ ఉక్రోషం తట్టుకోలేకపోతున్నావ్.
క్రిష్: సంధ్య అక్కతో ఇలాగే మాట్లాడేదా.
సత్య: అందరూ నాటకం ఆడుతున్నారు.
సంధ్య: అక్క నన్ను ఏమైనా అను నా అత్తింటి వాళ్లని ఏమైనా అంటే ఊరుకోను.
సత్య: విన్నావా దాని మాటలు ఇది దాని అత్తిళ్లు అంట నాకు ఏం సంబంధం లేదంట. నిన్న కాక మొన్న ఈ ఇంట్లో అడుగు పెట్టింది ఎలా మాట్లాడుతుందో చూడు.
సంధ్య: బావ గారు ఎప్పుడూ ఒకే సోది అక్కని మంచి డాక్టర్‌కి చూపించండి.
సత్య కొట్టడానికి వెళ్తే క్రిష్ బయటకు తీసుకెళ్తాడు. సంధ్య నీ మీద అనుమానంతో ఉంది తన కాపురం చెడగొడతావనే భయంతో ఇలా తొందర పడుతుందని క్రిష్ అంటాడు. అదేం చేసినా నువ్వు ఉన్నావనే ధైర్యంతో అది రెచ్చిపోతుందని క్రిష్‌ని సత్య అంటుంది. అమ్మానాన్న ఉన్నారనుకుంటుందా లేదా అక్క అని గౌరవం లేకుండా నా మీదే ఎదురుతిరుగుతుందని అంటుంది. మామయ్యని సంజయ్‌ని నమ్మడానికి వీల్లేదని నేను ఎలక్షన్ నుంచి విత్ డ్రా అవ్వాలని అనుకుంటుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: పోస్టర్ చిచ్చు.. జడ్జి పరువు తీసేసిన ఫోన్ కాల్స్.. దేవాకి పురుషోత్తం సలహా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

