Satyabhama Serial Today December 26th: సత్యభామ సీరియల్: మహదేవయ్య కోసం క్రిష్, సత్యల ఛాలెంజ్, మైత్రిని గెంటేసిన హర్ష ఫ్యామిలీ!
Satyabhama Today Episode వృద్థాశ్రమం సమస్యని పరిష్కరించాలని క్రిష్ కేశవ దగ్గరకు వెళ్లడం మహదేవయ్య క్రిష్‌ని తిట్టి వెనక్కి రప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode మైత్రి తన ఇంటిని అమ్మేసి అప్పులు తీర్చేయమని విశ్వనాథం, హర్షలకు చెప్పి డాక్యుమెంట్లు ఇస్తుంది. స్నేహం కోసం చేశాను డబ్బు కోసం కాదని హర్ష వద్దని అనేస్తాడు. నిజంగా అమ్మాలి అనుకుంటే ఫారిన్ వెళ్లినప్పుడే అమ్మాల్సింది ఇప్పుడెందుకు అని అడుగుతుంది. దానికి విశ్వనాథం నువ్వు మా సొంత మనిషి అని చేశాం ఇప్పుడు ఈ ఇంటిని తీసుకొంటే మా ప్రేమలు తప్పు అయిపోతాయని ఆ ఇంటి అవసరం నీకే ఉందని మీ అమ్మానాన్నల జ్ఞాపకంగా ఉంచుకో అని అంటాడు. దాంతో మైత్రి వెళ్లిపోతుంది. నందిని వల్ల ఎవరూ మైత్రితో సరిగా మాట్లాడరు.
విశాలాక్షి: మైత్రి వెళ్తుంటే తన వెనకే వెళ్లి.. అమ్మా మైత్రి నీతో ఓ నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నా. అందరి ముందు చెప్పలేక ఇలా వచ్చాను. హర్ష నీకు చాలా చేశాను అన్నాడు కదా నువ్వు హర్ష కోసం ఓ పని చేస్తావా.
మైత్రి: చెప్పండి ఆంటీ కచ్చితంగా చేస్తాను.
విశాలాక్షి: మాటిమాటికీ ఆ ఇంటికి రాకు. నీ మీద అనుమానం కాదు మనల్ని ఎవరూ అనుమానించకూడదు అని. నీ మనసు మాకు తెలుసు కానీ చూసే వాళ్లు అలా అనుకోరు కదా. హర్ష జీవితం ఇప్పుడిప్పుడే సెట్ అయింది. నీ జీవితం సెట్ అవ్వాలి అందుకు నీ ప్రవర్తన అడ్డు కాకూడదు. తన భర్త మరో ఆడదానికి దగ్గర అవ్వడం ఏ ఆడదానికి ఇష్టం ఉండదు. నందిని కూడా అంతే. అందుకే అందరూ ప్రశాంతంగా బతుకుదాం. బాధ పెడితే క్షమించు.
భైరవి పెద్దకోడలికి కాఫీ తీసుకురమ్మంటుంది. కాఫీ పొడి లేక రేణుక టీ తీసుకొస్తే భైరవి రచ్చ రచ్చ చేస్తుంది. సత్యని చూసి నువ్వు నాకే ఎదురు తిరుగుతున్నావని అరుస్తుంది. ఇంతలో క్రిష్ వచ్చి వదిన మీద అలా ఎందుకు సీరియస్ అవుతున్నావ్ తనేం చిన్నపిల్ల కాదు కదా అంటుంది. దాంతో భైరవి నీ పెళ్లాన్ని చూసి ఇది ఎక్కువ చేస్తుందని అంటుంది. సత్య తన మాటే కాదు మహదేవయ్య మాట వినడం లేదని ఇష్టం వచ్చినట్లు చేస్తుందని అంటుంది. అర్థమయ్యేలా చెప్పు అని క్రిష్ అంటే ముసలావిడ వచ్చి వృద్థాశ్రమం గురించి చెప్పడం సత్య ఆమెతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం ఇంటికి వచ్చి ఎదురించి మాట్లాడటం మొత్తం చెప్తుంది. మీ బాపుకి మర్యాద ఇవ్వమనురా పనోల ముందు తీసిపారేసినట్లు మాట్లాడుతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో క్రిష్ కోపంగా సత్య దగ్గరకు వెళ్తాడు. గదిలో సత్య క్రిష్ ఫొటోలు ఫోన్‌లో చూసుకుంటూ ముద్దు పెట్టుకుంటుంది.
క్రిష్: తప్పు చేశావ్ సత్య.
సమత్య: నేను ముద్దు పెట్టింది నీకే కావాలి అంటే చూడు.
క్రిష్: నేను మాట్లాడుతుంది ముద్దు గురించి కాదు మా బాపుని కాదని నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం గురించి.
సత్య: మాట్లాడుకుందాం క్రిష్ కానీ ఇప్పుడు కాదు నీ ఆవేశం తగ్గాక. ముందు ఇలా కూర్చో.
క్రిష్: హే..
సత్య: ఎవరో ఏదో చెప్తే విని నా మీద అరవడమేనా నా గురించి తెలీదా ప్రశాంతంగా అడగొచ్చు కదా
క్రిష్: బాపుని కాదని ఎందుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్లాం. మా బాపుని ఎదురించావు కదా అవమానించావు కదా.
సత్య: విషయం మీ బాపు వైపు నుంచి చూడకు ఆ వృద్థాశ్రమం గురించి ఆలోచించు. ఎవరు నన్ను వెలెత్తి చూపించినా పట్టించుకోను కానీ నువ్వు నా మీద నిందలు వేస్తే తట్టుకోలేను.
క్రిష్: సమస్య నా వరకు తీసుకురాకుండా నువ్వు నీ మీద వేసుకోవడం నాకు నచ్చదు సత్య. నువ్వు నేను వేరు కాదు కదా.
సత్య: వాళ్ల ఆశ్రమాన్ని ఎవరో కబ్జా చేశారు. సాయం చేయమని ఓ పెద్దావిడ మామయ్య దగ్గరకు వచ్చింది కానీ ఆయన ఏం సాయం చేయలేదు. కబ్జా చేసింది మామయ్యకు తెలిసిన వ్యక్తి అంట. ఫోన్ చేసి చెప్తే అయిపోతుందని ఆవిడ బతిమాలినా మామయ్య కనీసం ప్రయత్నించకుండా కుదరదు అంటే కుదరదు అని చెప్పేశారు.
క్రిష్: ఎంత తెలిసిన వాడు అయినా ఎవరి లిమిట్స్ వాళ్లకు ఉంటాయి సత్య. అందరూ బాపు మాట వినాలి అని లేదు.
బాపు చెప్పినా ఎందుకు వినలేదు ఆయన మాట కాదు అంటే ఆయన్ను బాధ పెట్టడమే కాదా నాకు బాపు ముఖ్యం అని క్రిష్ అంటాడు. ఇద్దరూ వాదించుకుంటారు. ఇక సత్య ఈ సమస్యను పరిష్కరిస్తే ఇకపై నువ్వేం చెప్తే అదే చేస్తాను అని సత్య అంటుంది. దాంతో క్రిష్ నేను ఈ సమస్య పరిష్కరిష్కరిస్తా నువ్వు మా బాపుకి సారీ చెప్పడానికి రెడీగా ఉండు అని అంటాడు. ఇక క్రిష్ కబ్జా చేసిన ఆ వ్యక్తి కేశవని పిలిచి కలుస్తాడు. ఆశ్రమం ఖాళీ చేసేయమని అంటాడు. కేశవ క్రిష్‌తో నాకేం చెప్పకు నీ పని నువ్వు చూసుకో అంటాడు. నేనే ఖాళీ చేయిస్తా అని క్రిష్ అంటే నాకు ఎదురు తిరగకు మీ బాపు లాంటి వాళ్ల రాజకీయానికి నేనే సపోర్ట్ అంటాడు.
ఇక క్రిష్ ఎదురుగానే మహదేవయ్యకి కాల్ చేస్తాడు. కేశవ బాబు అని మహదేవయ్య మాట్లాడుతాడు. వృద్ధాశ్రమం విషయం గురించి మాట్లాడుతాడు. దాంతో మహదేవయ్య మీ ఇష్టం బాబు నేను కలుగ జేసుకోను అని అంటాడు. దానికి కేశవ క్రిష్ తన దగ్గరకు వచ్చి బెదిరించాడని చెప్తే మహదేవయ్య కోపంతో క్రిష్‌ని తిట్టి నా ఎమ్మెల్యే కలని నాశనం చేస్తావా ఏంటి అని అడిగి కేశవ బాబుకి సారీ చెప్పి వెంటనే అక్కడనుంచి బయల్దేరమని అంటాడు. దాంతో క్రిష్ సారీ చెప్తాడు. మరోవైపు మైత్రి విశాలాక్షి తనని ఇంటికి రావొద్దు అన్న విషయం గుర్తు చేసుకొని రగిలిపోతుంది. అనవసరంగా ఇంటి నుంచి వచ్చేశావ్ ఇప్పుడు హర్షని వదిలేయ్ అని మైత్రితో తన ఫ్రెండ్ చెప్తే మైత్రి చాకు తీసు ఆమె గొంతు మీద పెట్టి ఎలా అనిపిస్తుందే అంటుంది. ప్రాణం పోయేలా ఉందని మైత్రి ఫ్రెండ్ చెప్తే హర్షని వదిలేస్తే నా పని అంతే అంటుంది. ఏదో ఒకలా హర్షకి దగ్గరవుతాను అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తెలివిగా సీతని లాక్ చేసేసిన మహా.. ఇప్పట్లో సుమతి గురించి తెలిసే అవకాశమే లేదుగా!