చపాతీలను చాలామంది ఇష్టంగా తింటారు. గట్టిగా ఉంటే వాటి జోలికి వెళ్లరు.

అందుకే చపాతీలు మెత్తగా వచ్చేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

మంచి పిండిని ఎంచుకోవాలి. దానిలో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. ఇది చపాతీలకు అనువైనవి.

పిండిని కలిపేందుకు గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తే పిండి బాగా కలుస్తుంది. పైగా మెత్తగా వస్తాయి.

పిండిలో నీరు మరీ ఎక్కువగా కాకుండా.. మరీ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్.

పిండిని కలిపిన తర్వాత పది నుంచి 15 నిమిషాలు పక్కన ఉంచితే చపాతీలు సాఫ్ట్​గా వస్తాయి.

చపాతీలను అన్నివైపులా సమానంగా ఉండేలా రోల్ చేసుకోవాలి. మరీ లావు కాకుండా మరీ సన్నాగా కాకుండా చూసుకోవాలి.

మరీ వేడి మంటపై కాకుండా.. మీడియం వేడిపైనే చపాతీలు కాల్చుకోవాలి. లేదంటే చపాతీలు మెత్తగా కాకుండా కరకరలాడతాయి.

చపాతీలను నెయ్యి లేదా నూనెతో కాల్చుకుంటే మంచిది. వీటివల్ల చపాతీలు మరింత మృదువుగా వస్తాయి.

చపాతీలు కాల్చిన తర్వాత వాటిని టైట్ కంటైనర్లో స్టోర్ చేయాలి. అప్పుడు ఎక్కువకాలం మెత్తగా ఉంటాయి.