అన్వేషించండి

Satyabhama Serial Today December 23rd: సత్యభామ సీరియల్: ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ.. పిల్లి పులి అయి అన్నకే ఎదురు తిరిగిందే.. సత్యకి మాటిచ్చేసిన క్రిష్! 

Satyabhama Today Episode సత్య ఇన్‌డైరెక్ట్‌గా తన పరిస్థితిని క్రిష్‌కి చెప్పి ఎలాంటి పరిస్థితుల్లోనూ తనని వదలొద్దని క్రిష్ దగ్గర మాట తీసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode మహదేవయ్య సంజయ్‌కి తన మెడలో గోల్డ్ చైన్ ఇస్తాడు. సత్య మహదేవయ్య దగ్గరకు వెళ్లి మొత్తానికి సొంత కొడుకుకి ఖరీదైన బహుమతి ఇచ్చారు కదా అని అంటుంది. మహదేవయ్య షాక్ అయి  చూస్తే నాకు అన్నీ తెలుసు మామయ్య కాని మామయ్య అని అంటుంది. సత్య అన్ని నిజాలు తెలుసుకుంటుంది ఎవరు చెప్పుంటారు అన్నీ తెలుసుకోవాలని మహదేవయ్య అనుకుంటాడు. ఇక అందరూ డ్యాన్స్‌లు వేయాలని అనుకుంటారు.

ముందుగా సత్య, క్రిష్ ఇద్దరూ డ్యాన్స్ చేస్తారు. సంజయ్ ముఖం మాడ్చుకుంటాడు. తర్వాత సంజయ్‌ని డ్యాన్స్ చేయడానికి నందిని పిలుస్తుంది. సంజయ్‌ తనకు పార్టనర్ కావాలని అంటే నందిని సంధ్య డ్యాన్స్ చేయాలని అంటుంది. సత్య వద్దని సంధ్య డ్యాన్స్ చేయదని అంటుంది. కానీ అందరూ సంధ్యని డ్యాన్స్ చేయడానికి పంపిస్తారు. ఇద్దరూ అద్దాల ఓణిలా అనుకుంటూ డ్యాన్స్ చేస్తారు. ఇక చివరగా ఫ్యామిలీ పార్టీ అని అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. నానీ, సాయి పల్లవిల ఫ్యామిలీ పార్టీ పాటకు చిందులేస్తారు. ఇక మహదేవయ్య చక్రవర్తిని చాటుగా తీసుకెళ్తాడు. ఎవరు పిలిస్తే నువ్వు ఇచ్చావ్ అని తమ్ముడిని అడుగుతాడు. సత్య పిలిచిందని చక్రి చెప్తాడు.

మహదేవయ్య: ఎవర్తిరా ఆ సత్య ఇది నా ఇళ్లు ఇక్కడ నేను చెప్పిందే జరగాలి. ఆ సత్య మీద జాలి చూపిస్తే అది ఇక్కడ ఉంది. ఈ ఇంట్లో నీకు ఆ సత్యకి నచ్చినట్లు ఉంటా అంటే కుదరదు.
చక్రి: ఇప్పుడు నేను ఇక్కడ ఉండకూడదు కదా అన్నయ్యా ఇక్కడికి రాకూడదు అంతే కదా సరే ఇప్పుడే వెళ్లిపోతా.
మహదేవయ్య: నువ్వే చిన్నా గాడి అసలు తండ్రి అని సత్యకి చెప్పావు కదా.
చక్రి: నేను చెప్పలేదు
మహదేవయ్య: రేయ్ పిరికోడా మరి దానికి ఎలా తెలిసింది. మన ఇద్దరికీ తెలిసిన ఈ నిజం తనకు ఎలా తెలిసింది. చెప్తే నేను లేక నువ్వే చెప్పాలి.
చక్రి: నేను చెప్పలేదు అని చెప్పాను కదా అలా చెప్పే ఉంటే నా కొడుకుని నీ దగ్గర పెరగనిచ్చేవాడినే కాదు. ఇంకా చెప్పాలి అంటే నా భార్యని చంపినందుకు నిన్ను అసలు బతకనిచ్చేవాడిని కాదు.
మహదేవయ్య: ఏంట్రా నోరు లేస్తుంది ఎవరిని చూసి ఈ ధైర్యం ఆ పిల్ల కాకి సత్యనా.
చక్రి: తను పిల్ల కాకి కాదు పిడుగు ఏదో రోజు నీ నెత్తి మీద పడుతుంది. నీ జోలికి వెళ్లొద్దని సత్యని బతిమాలాడాను కానీ తను నీ కంటే మొండిది. ఓడిపోతావ్ అన్నయ్యా ఏదో ఒక రోజు సత్య చేతిలో ఓడిపోతావ్ రాసి పెట్టుకో. 
మహదేవయ్య: నేను పులి పులీ.. పంజా విసిరాను అంటే ఆనవాళ్లు కూడా దొరకవు.
చక్రి: మరెందుకు ఆగావు విసురు నీకు భయం వేస్తుంది. అయోమయంగా ఉంది అందుకే నన్ను బెదిరిస్తున్నావ్. నన్ను బెదిరిస్తూ ఏదో సాధిస్తున్నట్లు నీ అహంకారానికి సర్దిచెప్పుకుంటున్నావ్ తట్టుకోలేవు అన్నయ్యా వణుకు వణుకు పుడుతుంది.

మహదేవయ్య చక్రిని కొట్టడానికి చేయి ఎత్తుతాడు. చక్రవర్తి అన్న చేయి పట్టుకుంటాడు. నువ్వు అరవాల్సింది నా మీద కాదు కొట్టాల్సింది నా మీద కాదు అని క్రిష్ మీద ప్రేమతో ఇలా వాడిని దూరం నుంచి చూస్తూ బతికేస్తున్నానని అంటాడు. ఇక మహదేవయ్య చక్రితో క్రిష్‌కి నిజం చెప్తే అంతు చూస్తానని అంటాడు. దానికి చక్రి నిజం చెప్పను కానీ క్రిష్‌ ప్రాణాలకు హాని తలపెడితే మాత్రం ఎంత దూరం అయినా వెళ్తానని వార్నింగ్ ఇస్తాడు. పార్టీ అయిపోయిన తర్వాత క్రిష్ సత్య చేయి పట్టుకొని నేల మీద పడుకొని చాలా సంతోషంగా ఉన్నానని అంటాడు. సత్య క్రిష్‌తో నిజం చెప్పాలని అనుకుంటుంది. నేను అంటే నీకు ఎంత ఇష్టం అని సత్య అడిగితే నువ్వు నా జిందగీ అని  నేను ఎవరినీ అయినా కావాలి అనుకోవడం కష్టం నా అనుకున్న తర్వాత వదులుకోవడం కష్టం అని అంటాడు.

సత్య నిజంగా ఎప్పటికీ అలాగే ఉంటావా అపార్థంతో నువ్వు ఇష్టపడే మనిషిని దూరం చేసుకుంటావా అని అడుగుతుంది. నువ్వు ఇష్టపడే మనిషి దూరంగా పోవాల్సి వస్తే ఏం చేస్తావ్ అంటే జీవితంలో ఆ మనిషి ముఖం చూడను అంటాడు. దాంతో సత్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. క్రిష్ వెనక పడి ఏంటి ఏడుస్తున్నావ్ అని అడుగుతాడు. ఇష్టమైన వాళ్లు నీ కోసమే ఏమైనా చేస్తారని క్షమిస్తాను అనకుండా అలా దూరం చేసుకుంటా అని ఎలా అంటావ్ అని సత్య అంటుంది. దాంతో క్రిష్ నీ కోసం ఏం చేయాలో చెప్పు ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పను అని అంటాడు. దాంతో సత్య మనం ఎప్పటికీ విడిపోకూడదు ఎలాంటి పరిస్థితి వచ్చినా మనస్పర్థలు గొడవలు వచ్చినా నన్ను నా చేతిని వదలొద్దని అంటుంది. నీ జీవితం నుంచి నన్ను తోసేయొద్దని నువ్వు లేకుండా నేను బతకలేను అంటుంది. క్రిష్ సత్య చేతిలో చేయి వేసి ఎలాంటి పరిస్థితిలోనూ విడిచిపెట్టనని మాటిస్తాడు. అది మహదేవయ్య చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జాను, వివేక్‌ని అవమానించిన లక్ష్మీ.. ఇదే ఛాన్స్‌గా జానుని మార్చేసిన మనీషా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget