Satyabhama Serial Today December 19th: సత్యభామ సీరియల్: పుట్టిన రోజు నాడే క్రిష్‌కి పుట్టుక రహస్యం తెలిసిపోయిందా.. కన్నకొడుకు కాదని చెప్పేసిన సత్య..!
Satyabhama Today Episode క్రిష్‌తో ఎలక్షన్‌లో తనకు పోటీగా పోటీ చేస్తున్నావ్ అని తెలిస్తే నిన్ను మెడ పట్టుకొని గెంటేస్తాడని మహదేవయ్య సత్యతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode క్రిష్ పుట్టిన రోజు కావడంతో సత్య తెల్లారి నిద్ర లేపి నలుగు స్నానానికి క్రిష్‌ని ఆరుబయటకు తీసుకెళ్తుంది. నలుగు స్నానానికి క్రిష్ బయపడి వద్దని చిన్నపిల్లాడిలా మారాం చేస్తాడు. సత్య క్రిష్‌ని రొమాంటిక్‌గా కవ్వించి క్రిష్‌కి నలుగు పెడుతుంది. సత్య నలుగు పెడుతుంటే క్రిష్ ముద్దు పెట్టు అని సత్యని అడుగుతూ ఉంటాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు నీరు వేసుకుంటూ పరుగులు పెట్టుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు. ఇంతలో జయమ్మ వస్తుంది. క్రిష్ మీద సటైర్లు వేస్తుంది.
సత్య ఆశపెట్టి మోసం చేసిందని బామ్మతో చెప్తుంది. ఏంటి అని బామ్మ అడిగితే ఏదో ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదని క్రిష్ అంటాడు. దానికి సత్య పాయసం చేస్తా అని చెప్పానని అంటుంది. ఇక సత్య క్రిష్‌కి తలంటు స్నానం చేయించి గదిలోకి వెళ్లాక తల తుడుస్తుంది. ఇక క్రిష్‌కి సత్య తల తుడుస్తూ ముద్దులు ఇస్తానని అన్నాను కదా అని క్రిష్‌కి తల తుడిచే టవల్‌లో దూరి ముద్దులు పెడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని అంటుంది. ఇక సత్య టవల్ విసిరితే అది వెళ్లి అటుగా వస్తున్నా జయమ్మ మీద పడుతుంది. జయమ్మ ప్రశ్నలకు క్రిష్ సత్యకి అర్థమయ్యేలా రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. తన బుగ్గల మీద 44 దోమలు కుట్టాయని చెప్తాడు. ఇక సత్య క్రిష్‌కి కొత్త డ్రస్ ఇచ్చి రెడీ అవ్వమని అంటుంది. దానికి క్రిష్ సర్‌ఫ్రైజ్ అయితే ఓకే కానీ షాకింగ్ ట్విస్ట్‌లు ఇవ్వకు సత్య నేను తట్టుకోలేను అని అంటుంది. ఇక సత్య క్రిషతో ఒక విషయం చెప్పాలి అంటే దానికి క్రిష్ నేను ఈ రోజు హ్యాపీగా ఉన్నాను నువ్వు నాతో ఏం చెప్పొద్దు అని సత్యని దగ్గరకు తీసుకుంటాడు.
మరోవైపు సత్య చెల్లి సంధ్య సంజయ్‌కి కాల్ చేస్తుంది. ఇక సంధ్య సంజయ్‌కి భర్త్‌డే విష్ చేస్తుంది. దాంతో సంజయ్ అక్కడెక్కడో ఉండి ఈ చంటి బాబుకి విష్ చేయడం ఏంటి అని అంటాడు. ఈ రోజు కలవడం కుదరదు అని సంధ్య అంటుంది. దానికి సంజయ్ నువ్వు మీ అక్క ఇంటికి వచ్చి డైరెక్ట్‌గా వచ్చి విష్ చేయ్ అంటాడు. అక్క తిడుతుంది అని సంధ్య అంటే మనం మామూలు ఫ్రెండ్స్ అయితే రావొద్దు అదే అంతకు మించి అయితే రా అని చెప్తాడు. దానికి సంధ్య ఏం చేయాలా అని అనుకుంటుంది. మరోవైపు సత్య క్రిష్‌కి ఎమ్మెల్యే పోటీ గురించి ఎలా చెప్పాలా అని టెన్షన్ పడుతుంటే మహదేవయ్య ఎదురు పడతాడు.
మహదేవయ్య: ఏమైంది కోడలు కాని కోడలా ఒక్క దినంలో స్పీడు తగ్గిపోయిందేంటి. ఒక్కో మెట్టు ఆలోచించుకుంటూ దిగుతున్నావ్ ఒక్కో మెట్టు నువ్వు దిగి నా కాల దగ్గరకు రావాల్సిందే. నువ్వు గెలవడం ఓ కల నా పంతం తాచుపాము పగ.
సత్య: బెదిరింపులకు భయపడను.
మహదేవయ్య: ఎలక్షన్లో నిలబడతా అని నీ మొగుడికి చెప్పడానికి బయటపడుతున్నావ్. ఏ క్షణం అయితే నీ ఛాలెంజ్ గురించి నీ ఎర్రి మొగుడికి చెప్తావో అప్పుడు ఈ ఇంట్లో ఓ పిడుగు పడిన సౌండ్ వస్తుంది అది నీ మొగుడిది ఆ వెంటనే ఓ అర్తనాథం వస్తుంది అది నీది. ఆ వెనకనే ఒక పెద్ద నవ్వు వినిపిస్తుంది అది నాది. ఆక్షణం కోసమే వెయిట్ చేస్తున్నా కోడలా. ఈ కథకి ముగింపు ఇదే. మామ మీద ఛాలెంజ్ చేశానని నీ మొగుడికి చెప్పావనుకో కట్టిన పుస్తెను తెంపి అవతల పడేస్తాడు. ఇదే క్లైమాక్స్.
సత్య: నా కథకి క్లైమాక్స్ నా చేతిలో ఉంటుంది.
మహదేవయ్య: రాసి పెట్టుకో కోడలా ఇదే నువ్వు నీ మొగుడికి చేసే ఆఖరి పుట్టిన దినం అదే పుట్టిన రోజు. ఆ తర్వాత నువ్వు నీ పుట్టింటిలో ఏడుస్తూ ఉంటే నేను ఈ నట్టింట్లో విజయగర్వంతో ఈ కుర్చీలో కూర్చొని ఊగుతూ ఉంటా
సత్య: మీకు ఆ అవకాశం ఇవ్వను. ఎస్ పోయే కాలం దగ్గర పడింది కానీ అది నాకు కాదు మీకు. కచ్చితంగా నేను ఎలక్షన్లో పోటీ చేస్తాను గెలుస్తాను. మీ కొడుకు కానీ కొడుకే నన్ను దగ్గరుండి ఎలక్షన్‌లో గెలిపిస్తాడు చూస్తూ ఉండండి.
సత్య క్రిష్ దగ్గరకు వెళ్లి క్రిష్‌ని కొత్త డ్రస్‌లో చూసి మురిసిపోతుంది. కాసేపు మాట్లాడుకుందామా అని సత్య క్రిష్‌ని అడుగుతుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: జనార్థన్ పక్కన వ్రతంలో విద్యాదేవి కూర్చొంటుందా.. సీత ప్లాన్ ఏంటి.. మహా సీతని ఎదుర్కొగలదా!