By: ABP Desam | Updated at : 27 Jul 2023 12:39 PM (IST)
Image credit: Zee5
Prema Entha Madhuram July 27th: పిల్లలకు మంచి జీవితం అందుకున్న పరవాలేదు కానీ ఇప్పుడు ఆర్యను కలవలేను అని.. ఎందుకంటే ఆయన ప్రాణాలకు ఏమి హాని జరగకూడదు అని.. ఎందుకంటే ఆయనను నమ్మి ఎన్నో వేల మంది ఉన్నారని అనటంతో అను మాటలకు ప్రీతి ఫిదా అవుతుంది. అంతేకాకుండా మరింత రెస్పెక్ట్ పెరిగింది అని అంటుంది. ఇక రేష్మ ఏం బాధపడకు త్వరలోనే కలుస్తారు అని ధైర్యం ఇస్తుంది.
మరోవైపు తన గదిలో శారదమ్మ అను వాళ్ళకు చీరలు పెట్టటానికి సిద్ధం చేస్తుంది. అప్పుడే అక్కడికి అంజలి వస్తుంది. ఆ ముగ్గురికి ఇది పెట్టాలనుకుంటున్నాను అని చెబుతుంది. పిల్లలకు కూడా ఏదైనా కొద్దిగా బంగారం పెడితే బాగుండేది అని అనటంతో అంజలి కూడా మంచి ఐడియా అని ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను అని చైన్, కాళ్ళ పట్టీలు తీసుకోని వస్తుంది.
ఇక శారదమ్మ అవి చూసి తన వారసులను గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. వాళ్లకు ఎన్నో పెట్టేదాన్ని కదా అని.. అసలు ఎక్కడున్నారో అని బాధపడుతూ ఉండగా అక్కడినుంచి వెళ్తున్న అను శారదమ్మ మాటలు విని ఆగుతుంది. తను కూడా బాధపడుతుంది. ఇక అంజలి అను వస్తుందో లేదో అన్నా అనుమానాలు వస్తున్నాయి. అను ఇంటికి తిరిగి వస్తే నీరజ్ గ్రాండ్ గా పార్టీ చేయాలనుకుంటున్నాడు అని.. నాకు కూడా బంధాలు బంధుత్వాలు గురించి తెలియదు.
కానీ అను మాత్రం సొంత అక్క లాగా చూసుకునేది. తను ఉంటే పిల్లలను చూసుకొని తనకు ఆర్య సర్ తో ఫ్రీగా గడిపే టైం ఇచ్చేదాన్ని అని బాధపడుతూ ఉంటుంది. అను కూడా ఆ మాటలు విని బాధపడుతుంది. తర్వాత అను వారిద్దరితో పాటు తన గదిలోకి వెళ్తుంది. అక్కడ ఆర్య, అను ఫోటో చూసి రేష్మ వాళ్లు ఫిదా అవుతారు. గది చాలా బాగుంది అని అనుకుంటారు.
ఇక అనుకి ఆ గదిలో ఆర్యతో గడిపిన క్షణాలన్నీ గుర్తుకు వస్తాయి. ఇక రేష్మ అను అని రాసి ఉన్న కాగితం తీసుకొని వచ్చి ప్రీతి వాళ్లకు చూపిస్తుంది. సర్ కు అను పై చాలా ప్రేమ ఉంది అని అంటుంది. అను ఆ పేపర్ పట్టుకుని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆర్య అను అనుకుంటూ వస్తాడు. దాంతో వాళ్లు తెలిసిపోయింది అని భయపడతారు. వెంటనే అను గురించి మాట్లాడుకుంటున్నారా అని అనటంతో హా అవును అని రేష్మ అంటుంది.
ఇక పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా పిల్లల్ని అక్కడే ఉంచమని అంటాడు ఆర్య. ఇక అను అక్కడి నుంచి వెళ్తూ పిల్లల పక్కన కూర్చొని ఉన్న ఆర్యను చూస్తూ ఉంటుంది. ఆర్య కూడా తన పక్కన అను వచ్చి కూర్చొని పిల్లల్ని చూపిస్తున్నట్లు ఊహించుకుంటాడు. ఓ వైపు జైల్లో ఉన్న మాన్సీ తో పనులు చేయించుకోవడానికి కానిస్టేబుల్ సైన్ తీసుకుంటుంది.
దాంతో మాన్సీ ఇప్పటివరకు నేను చెమటను చూడలేదు అని నేనేం పని చేయను అనటంతో అక్కడే ఉన్న సత్తెమ్మ మాన్సీ మాటలు విని తన పని చేయాలని ఫిక్స్ అవుతుంది. తన దగ్గరికి వచ్చి పాట పాడమని అంటుంది. కానీ మాన్సీ పాడను అంటూ పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో సత్తెమ్మ తన చెవులు పిండి పాట పాడిస్తుంది. ఆ తర్వాత డాన్స్ కూడా చేపిస్తుంది. దాంతో అలసిపోయిన మాన్సీ కి చెమటలు కూడా వస్తాయి.
చూసావా చెమట బొట్టు ఇలా ఉంటుంది అని అంటుంది. మరోవైపు ఆర్య ఇంట్లో ఫైల్ మర్చిపోయాను అని లిఫ్టులో పైకి వెళ్తుండగా వెంటనే రేష్మ అనుని కూడా పాల డబ్బా మర్చిపోయాను అని చెప్పి పంపిస్తుంది. వెంటనే ప్రీతిని తీసుకొని సెల్లార్ కి వెళ్తుంది. అక్కడ లిఫ్ట్ మెయిల్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ప్రీతి వెంటనే రేష్మను లోపలికి తీసుకొని వెళ్ళగా.. అప్పటికే లిఫ్టులో ఒకరికొకరు తగులుకొని ఉన్న అను దంపతులను చూసి రేష్మ మురిసిపోతుంది. ఇక ఆర్య బయటకి వచ్చి లిఫ్ట్ ప్రాబ్లం ఉందని నీరజ్ కి చెప్పుతాడు. వెంటనే అను ఇది నీ పనే కదా అని రేష్మను అంటుంది.
also read it: Janaki Kalaganaledhu July 26th: ‘జానకి కలగనలేదు’ సీరియల్: అందరి ప్రశంసలు అందుకుంటున్న జానకి, కోడలి ప్రవర్తన ఇష్టపడని జ్ఞానంబ?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్‌దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!
Naga Panchami December 6th శివయ్య ఎదురుగానే ప్రాణం వదిలేస్తా.. షాకిచ్చిన పంచమి!
Jagadhatri December 6th Episode : అవమానంతో రగిలిపోతున్న యువరాజ్.. మీనన్ హ్యాండ్ ఓవర్లో ధాత్రి
Bigg Boss 7 Telugu: వెధవ కారణాలు చెప్పకు - పల్లవి ప్రశాంత్‌పై అర్జున్ సీరియస్
Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ శోభా హేటర్స్‌కు గుడ్ న్యూస్ - అదేంటో తెలుసుకోవాలని ఉందా?
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
/body>