Jordar Sujatha: ఇల్లు కొన్నానంటూ భర్తకు సర్‌ప్రైజ్ ఇచ్చిన సుజాత - అంతలోనే ఊహించని షాక్, పాపం రాకింగ్ రాకేష్!
Jordar Sujatha: న్యూస్ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సుజాత.. ఇప్పుడు రాకింగ్ రాకేష్‌ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. తాజాగా తన భర్తకు సర్‌ప్రైజ్ అని చెప్పి ఒక యూట్యూబ్ వీడియోను అప్లోడ్ చేసింది
Jordar Sujatha Surprise to Rocking Rakesh: ‘జబర్దస్త్’ స్టాండప్ కామెడీ షో స్టేజ్‌పై ఎన్నో ప్రేమ జంటలను చూశారు ప్రేక్షకులు. అందులో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత కూడా ఒకరు. ముందుగా ఒక న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది సుజాత. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షోలోకి వచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ పూర్తయిన తర్వాత తనకు జబర్దస్త్‌లో కమెడియన్‌గా చేసే అవకాశం లభించింది. అప్పుడే రాకింగ్ రాకేష్ టీమ్‌లో ఒక మెంబర్‌గా జాయిన్ అయ్యింది. అలా రాకేష్‌తో ప్రేమ, పెళ్లి వరకు వెళ్లిపోయింది. తాజాగా సుజాత ఇచ్చిన షాక్‌కు రాకేష్ నోటి నుండి మాట రాలేదు. దాని గురించి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ కూడా చేసింది సుజాత.
రాకేష్ కోసమే..
గతేడాది ఫిబ్రవరీలో రాకింగ్ రాకేష్, సుజాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఓవైపు జబర్దస్త్‌లో కమెడియన్‌గా చేస్తూనే తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంటూ ఉంటుంది సుజాత. తాజాగా తమ పెళ్లయ్యి ఏడాది పూర్తి కావడంతో రాకేష్‌కు ఒక స్పెషల్ గిఫ్ట్‌ను ప్లాన్ చేశానని తన వీడియోలో చెప్పుకొచ్చింది. ‘‘నేను మా ఆయన కోసం ఇల్లు తీసుకున్నా’’ అంటూ ఇల్లు మొత్తం చూపించింది. ‘‘ఇల్లు ఇంకా కన్‌స్ట్రక్షన్ అవుతుంది. మా ఆయనకు సర్‌ప్రైజ్ ఇద్దామనుకుంటున్నా. నేను ఇల్లు తీసుకున్నా అని ఇంకా ఆయనకు తెలియదు’’ అని చెప్పుకొచ్చింది సుజాత. రాకేష్‌కు మాత్రమే కాకుండా ఈ ఇల్లు విషయం ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెట్టానని తెలిపింది.
కంగ్రాట్స్..
ఆ తర్వాత రాకేశ్‌కు ఫోన్ చేసి తన ఉన్న చోట గొడవ జరుగుతుందని, త్వరగా రమ్మని కంగారు పెట్టింది. దీంతో రాకేష్ అక్కడికి కంగారు పడుతూ వచ్చాడు. వచ్చిన తర్వాత మైక్ పెట్టుకోమని అడగగానే రాకేష్‌కు డౌట్ వచ్చింది. ప్రాంక్ కాదు కదా అని అడిగాడు. సుజాత ఇల్లు చూపించగానే దానికి యాడ్ చేయాలేమో అని ఫిక్స్ అయ్యాడు. దానికి తను ఏం మాట్లాడలేదు. అది తాను తీసుకున్నానని చెప్పకుండా ఇల్లు మొత్తం చూపించింది సుజాత. అంతా చూసిన తర్వాత రాకేష్‌కు ఇల్లు చాలా నచ్చింది. రేటు ఎంతో కనుక్కో.. 5,6 సంవత్సరాలలో తీసుకుందామని సుజాతతో చెప్పాడు. ఆ తర్వాత ఇది మనదే, కంగ్రాట్స్ అని చెప్పి రాకేష్‌ను హగ్ చేసుకుంది సుజాత. అది వినగానే రాకేష్ నోటి నుండి మాట రాలేదు. లవ్ ఇంత కాస్ట్‌లీగా ఉంటుందా అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అక్కడే సుజాత అసలైన ట్విస్ట్ ఇచ్చింది. ఆ ఇల్లు తమది కాదని చెప్పింది.
అందరూ షాక్..
తమ పక్కింటి వారు ఈ ఇల్లు కొన్నారని, ఒకసారి వెళ్లి చూసి రమ్మన్నారని సుజాత రివీల్ చేసింది. దీంతో రాకేష్ మరింత షాక్ అయ్యాడు. భవిష్యత్తులో తాను ఇల్లు కొని సర్‌ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేశానని చెప్పింది. ఇప్పటికే చాలామంది బుల్లితెర సెలబ్రిటీలు సడెన్‌గా ఇలా ఇళ్లులు కొంటూ.. తమ పార్ట్‌నర్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. అదే విధంగా సుజాత కూడా చేసిందని అందరూ అనుకున్నారు. కానీ చివర్లో ట్విస్ట్ చూసి రాకేష్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా షాకయ్యారు. ఈ మొత్తం వీడియోను సుజాత.. తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసింది.
Also Read: పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా - పొలిటికల్ ఎంట్రీపై ఆది