Rangula Ratnam June 29th: సిద్దు, స్వప్నను కూడా ఇంట్లో నుంచి గెంటేసిన రేఖ-అత్తమామల క్షేమం కోసం దేవుడిని వేడుకుంటున్న వర్ష?
రేఖ.. సిద్దు, స్వప్న లను కూడా ఇంటి నుంచి గెంటయ్యడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Rangula Ratnam June 29th: స్వప్న పనిమనిషి లేకపోయేసరికి వంటగదిలో తన పని పని చేసుకుని టీ పెట్టుకుంటుంది. వంట మనుషులు లేకపోయేసరికి ఇంతలా ఉంటుందా అని హాల్లోకి వచ్చి తాగుతూ ఉంటుంది. అప్పుడే రేఖ కాఫీ అంటూ రావటంతో.. ఇక్కడ ఎవరి కాఫీ వాళ్లే పెట్టుకోవాలి అంటూ వెటకారంగా చెబుతుంది సప్న. ఇంట్లో చేసే పని వాళ్ళని వెళ్ళగొట్టావ్ కాబట్టి నీ పని నువ్వే చేసుకోవాలి అంటూ మాట్లాడుతూ ఉంటుంది.
దాంతో రేఖకు కోపం వచ్చి కాఫీ పెట్టమని స్వప్న అని ఉంటుంది. నేనెందుకు పెడతాను నేను ఎందుకు పని చేస్తాను.. ఈ ఇల్లు మాది.. శంకర్ ప్రసాద్ కోడల్ని అంటూ నిలదీస్తూ మాట్లాడుతూ ఉంటుంది. కానీ రేఖ మాత్రం అస్సలు ఊరుకోదు. వాళ్లను పంపించినట్లు నిన్ను కూడా పంపించేస్తాను అంటూ.. చూసావు కదా మీ అమ్మ నాన్నలను కూడా ఎలా చేశానో అని పొగరుగా మాట్లాడుతుంది. అంతేకాకుండా గార్డెన్ లో పనిచేసే వ్యక్తి కూడా లేడు అని సిద్దుకు ఆ పని అప్పచెప్పు అని మీరిద్దరి ఈ ఇంట్లో పని చేయాలి అని అంటుంది.
ఇక నువ్వు నాకు కాఫీ తెచ్చి టిఫిన్ రెడీ చేసి ఇల్లు క్లీన్ చేయు అంతవరకు నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తాను అని వెళుతుంది. దాంతో స్వప్న చాలా బాధపడుతుంది. మరోవైపు తన ఫ్రెండ్ శంకప్రసాద్ తో గడిపిన క్షణాలను తలచుకుంటూ బాధపడతానని సూర్యం. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చినందుకు మరింత కృంగిపోతుంటాడు. తన భార్య జానకి తో శంకర్ ప్రసాద్ పరిస్థితి గురించి చెబుతూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు.
జానకి మాట్లాడుతూ అన్నయ్య చేతులారా చేసుకుండని.. ఒకప్పుడు మీరు ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళు.. డబ్బు వచ్చాక మొత్తం మారిపోయాడు.. రేఖను గుడ్డిగా నమ్మాడు.. ఆస్తి పేపర్లు గుడ్డిగా సాయం చేసి ఇచ్చాడు.. ఇప్పుడు ఇంతలా క్షోభిస్తున్నాడు అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక సిద్దు ఇంట్లోకి వస్తుండగా ఇల్లంతా నీరు ఉండటంతో అక్కడున్న పనిమనిషిపై అరుస్తాడు.
తీర చూసేసరికి అక్కడ స్వప్న ఉంటుంది. స్వప్నను ఆ గెటప్ లో చూసి షాక్ అవుతాడు. ఏం జరిగింది అని అడగటంతో సప్న అన్ని విషయాలు చెబుతుంది. ఇక రేఖ రావటంతో రేఖ పై అరుస్తాడు సిద్దు. గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. కానీ రేఖ ఏమాత్రం భయపడకుండా గార్డెన్ లో పనిచేయమంటూ చెబుతుంది. దాంతో మండిపోయిన సిద్దు తనపై అరుస్తాడు.
ఇక రేఖ ఉంటే ఇంట్లో పని చేయండి లేకుంటే వెళ్లిపోండి అని బెదిరిస్తుంది. అంతేకాకుండా సెక్యూరిటీని పిలిచి వీళ్లను బయటికి ఈడ్చికెళ్ళండి అని అంటుంది. సిద్దు కోపంతో అరుస్తూ ఉండటంతో.. మీ నాన్న ఇలాగే అరిచి కళ్ళు పోగొట్టుకున్నాడు.. ఈ ఇల్లు నాది మీ నాన్న నమ్మకంతో నాకు కాళీ డాక్యుమెంట్స్ ఇస్తే ఈ ఆస్తం మొత్తం నేనే సొంతం చేసుకున్నాను అంటూ తను చేసిన కుట్ర మొత్తం బయట పెడుతుంది. ఆ తర్వాత సెక్యూరిటీ వాళ్లతో బయటికి గెంటేపిస్తుంది.
ఇక వర్ష అత్తమామలతో కలిసి గుడికి వస్తుంది. ఆ సమయంలో తన అత్త దేవుడితో వర్ష గురించి చెప్పుకుంటూ ఉంటుంది. మూర్ఖురాలిని అయిన నన్ను వర్ష మార్చిందని.. సొంత వాళ్ళ లాగా చూసుకుంటుందని.. వేరే వాళ్ళు ఉంటే ఎప్పుడో భయపడి వెళ్లే వాళ్ళు అని.. కానీ వర్ష అలా కాకుండా మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తుందని దేవుడితో చెప్పుకుంటూ ఉంటుంది.
ఇక ఆ మాటలు విని వర్ష బాగా ఎమోషనల్ అవుతుంది. కొన్ని రోజులలో తను అందరికీ దూరం అవుతాను అనుకుంటూ బాధపడుతుంది. తను చనిపోయాక కూడా అత్తమామలను చల్లగా చూడమని దేవుడిని వేడుకుంటుంది. తరువాయి భాగంలో శంకర్ ప్రసాద్ బాటిల్ తీసుకోటానికి ఇబ్బంది పడుతుండగా సిద్దు వచ్చి ఆ బాటిల్ ఇస్తాడు. ఇక శంకర్ థాంక్స్ అండి ఎవరు మీరు అని అడుగుతుంటారు. ఇక వాళ్ళు సైలెంట్ గా ఉండటంతో పావనిని పిలుస్తాడు.
Also Read: Trinayani June 29th: కసి హత్యకేసులో తిలోత్తమా ఫ్యామిలీపై అనుమానం-పిండి పరీక్షతో నిజం బయటపడనుందా?