అన్వేషించండి

Prema Entha Madhuram October 13: పోటీలో ఓడిపోయిన నీరజ్.. ముసలమ్మ కోసం వెతుకుతున్న హంతకులు!

ముసలమ్మని చంపటానికి హంతకులు గుడికి రావటంతో స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా ముందుకి సాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

Prema Entha Madhuram, October 13, ఈరోజు ఎపిసోడ్​లో రోడ్డు మీద వెళ్తున్న పిల్లల్ని చూసి కారు ఆపి వాళ్ల దగ్గరికి వస్తారు ఆర్య వాళ్ళు. ఒకరిని ఒకరు పలకరించుకుంటారు.

అంజలి: కృష్ణాష్టమి రోజు సడన్​గా అలా మాయమైపోయారు ఏంటి?

అభయ్ : ఆరోజు అమ్మకి పని ఉంది అందుకే వెళ్ళిపోయాం.

జెండె : స్కూల్ ఎగ్గొట్టి ఇలా రోడ్డుమీద తిరుగుతున్నారు ఏమి?

అక్షయ: మేము నీ లెక్క కాదు, స్కూల్లో స్ట్రైక్ ఉందని హాలిడే ఇచ్చారు అయినా మీరు ఆఫీసు ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్తున్నారు.

అంజలి: గుడికి వెళ్తున్నాం.

అక్షయ: మా అమ్మ కూడా గుడికి వెళ్ళింది , ఎందుకంటే అంటూ ఇంకా ఏదో మాట్లాడాలోపు అభయ్ ఆపేస్తాడు.

అభయ్ : వాళ్లకి లేట్ అవుతుందేమో అక్కి, వెళ్లనీ.

ఆర్య : మీరు కూడా మాతో పాటు రండి గుడికి వెళ్దాం.

అక్షయ: నేను వస్తాను.

అభయ్ మాత్రం వెళ్లడానికి ఆలోచిస్తాడు కానీ ఆర్య నచ్చ చెప్పడంతోను, అక్షయ బ్రతిమాలడం తోను గుడికి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు. కారు గుడికి చేరుకున్న వెంటనే ముందుగా కారు దిగి పిల్లలిద్దరూ చెప్పులు విప్పడానికి వెళ్తారు. అక్కడ అభయ్ అను చెప్పులు చూస్తాడు.

అభయ్ : అమ్మ కూడా ఈ గుడికి వచ్చినట్లుగా ఉంది ఇవి అమ్మ చెప్పులు.

అక్షయ: ఇలాంటి చెప్పులు ఒక ఒక్క జతే ఉంటాయి ఏంటి చాలా ఉంటాయి. అయినా ఈరోజు అమ్మ బర్త్​ డే అని ఎందుకు చెప్పనివ్వలేదు.

అభయ్ : అదే మన పర్సనల్ సెలబ్రేషన్ అయినా ఇప్పుడు నువ్వు బర్త్ డే అని చెప్తే సార్ ఏదో ఒక గిఫ్ట్ తీసి ఇస్తారు అది అమ్మకి నచ్చదు అందుకే చెప్పనివ్వలేదు.

ఇంతలో మిగిలిన వాళ్ళు అందరూ కూడా వచ్చి చెప్పులు విప్పి అందరూ గుడి లోపలికి వెళ్తారు. అక్కడే అను ముసలమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకరిని ఒకరు చూసుకోరు. గుడిలోకి వచ్చిన తర్వాత జెండే మేనేజర్ తో మాట్లాడటానికి వెళ్తాడు నీరజ్, అంజలి పిల్లలతో ప్రదక్షిణాలు చేసి వస్తాం అని వెళతారు. ఆర్య మాత్రం దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ప్రదక్షిణం చేయటానికి వచ్చిన నీరజ్ ఒక ప్రదక్షిణం సరిపోతుంది కదా అని అంజలిని అడుగుతాడు.

అంజలి : టోటల్ 3 చేయాలి.

నీరజ్ : మూడు ప్రదక్షిణాలా..

అక్షయ: వెరీ లేజీ బాయ్.

నీరజ్ : నో, ఐ యాం వెరీ ఆక్టివ్. పోటీ పెట్టుకుందాం మనలో ప్రదక్షిణాలు ఎవరు ఫాస్టుగా చేస్తారో చూద్దాం.

నీరజ్ అలా చెప్పడంతో పిల్లలు ఇద్దరు ప్రదక్షిణ ప్రారంభిస్తారు ఆ వెనకే మీరే అంజలి కూడా ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఈ లోపు ముసలమ్మ ప్రదక్షిణలు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఆమెని పక్కన కూర్చోబెట్టి ఆమె కోసం మంచి నీళ్లు తీసుకు వెళుతుంది అను.

ముసలమ్మ : థాంక్స్ అమ్మ, ఈరోజు నీవల్ల నా మొక్కు తీర్చుకోగలిగాను.

అను: దాందేముందమ్మా.. మీ మొక్కు తీర్చుకున్నారు, ఇక మీ అబ్బాయి క్షేమంగా ఇంటికి వస్తాడు..

నీరజ్ కంటే ముందుగానే ప్రదక్షిణ చేసిన పిల్లలు మేమే గెలిచాం అంటూ ఆనందంగా గంతులు వేస్తారు.

పిల్లలు: మీరు పూజ కానివ్వండి ఈలోపు మేము ఆడుకొని వస్తాం అని వెళ్ళిపోతారు.

జెండే కూడా అప్పుడే వస్తాడు. అందరూ కలిసి గర్భగుడిలోకి వెళ్తే అక్కడ పూజారి గారు గోత్రనామాలతో పూజ చేస్తారు. వాళ్ల పేరు గోత్రం మైక్ లో పంతులుగారు చదువుతుంటే విన్న అను షాక్ అవుతుంది. సార్ వచ్చినట్లున్నారు అనుకొని ముసలమ్మని కూర్చోమని చెప్పి తను గర్భగుడి దగ్గరికి వస్తుంది. అక్కడ ఆర్యను చూసి ఎమోషనల్ అవుతుంది.

అను: నాకోసమే వచ్చారా సర్, నాకు తెలుసు మీరు నన్ను ఎప్పటికీ మర్చిపోరు అని చెప్పి దూరం నుంచి ఆర్య కాళ్ళకి నమస్కరించుకుంటుంది.

ఆర్య అను త్వరగా కనబడేలా చేయమని దేవుని మొక్కుకుంటాడు. మరోవైపు గుడిలో దండాలు పెట్టుకున్న ముసలమ్మని చంపటానికి హంతకులు గుడికి వస్తారు. ఆమెని చంపేసి మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఎవరికో ఫోన్ చేస్తారు. సీన్ కట్ చేస్తే కొందరు యువకులు బస్సు దగ్గరికి వస్తారు. ఆ దేశం నుంచి ఈ దేశానికి వస్తాం అనుకోలేదు.

చచ్చి బ్రతికినట్లు అయింది అనుకుంటారు. ఇంతలో ఆర్య కంపెనీకి చెందిన వ్యక్తి ఒకరు వచ్చి అందరూ డీటెయిల్స్ తీసుకొని మీ అందర్నీ ఆర్య సార్ ఆఫీస్ కి తీసుకువెళ్తున్నాను అక్కడ మీకు జాబ్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఎవరింటికి వాళ్లు వెళ్లవచ్చు.

యువకులలో ఒకడు : మాకు జాబ్స్ ఇస్తారా సార్ అని ఆనందంగా అడుగుతాడు.

ఆర్య ఉద్యోగి : అవును ఆడియో సర్ అని ఒక పెద్ద బిజినెస్​మేన్ ఆయన మీకు సంబంధించిన బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కలియుగ కర్ణుడు అని చెప్తాడు. ఆ యువకులలో ముసలమ్మ కొడుకు కూడా ఉంటాడు. అతని పేరు సూర్య.

సూర్య: కర్ణుడు కాదు సార్ మా పాలిట దేవుడు.

ఆర్య ఉద్యోగి సరే సరే అందరూ బస్సు ఎక్కండి అని చెప్పటంతో అందరూ బస్సు ఎక్కుతారు కానీ వాళ్లని ఒక వ్యక్తి ఫోటో తీస్తూ ఉంటాడు. బస్సు అక్కడినుంచి వెళ్ళిపోవటంతో ఎవరికో ఫోన్ చేస్తాడు.

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 24th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 24th: ఇంటికి తిరిగి వచ్చిన తప్పిపోయిన చిట్టి....విక్కీకి మాత్రం వచ్చింది చిట్టి కాదని అనుమానం
నువ్వులేక నేను లేను: ఇంటికి తిరిగి వచ్చిన తప్పిపోయిన చిట్టి....విక్కీకి మాత్రం వచ్చింది చిట్టి కాదని అనుమానం
Gundeninda Gudigantalu July 24th Episode:కత్తితో మనోజ్‌ను చంపబోయిన బాలు...పెద్దకొడుకునే తిట్టిన ప్రభావతి
గుండెనిండా గుడిగంటలు: కత్తితో మనోజ్‌ను చంపబోయిన బాలు...పెద్దకొడుకునే తిట్టిన ప్రభావతి
Podarillu Serial Today July 24th: మహా చున్నిలాగి అవమానించిన సురేశ్‌...శైలూ అన్నను చితక్కొట్టిన చక్రి,కేశవ్‌, మాధవ్‌
పొదరిల్లు: మహా చున్నిలాగి అవమానించిన సురేశ్‌...శైలూ అన్నను చితక్కొట్టిన చక్రి,కేశవ్‌, మాధవ్‌

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget