అన్వేషించండి

Prema Entha Madhuram Serial January 6th: తల్లిని తప్పు పడుతున్న దివ్య - పిల్లల్ని చంపేందుకు ప్లాన్ వేసిన జలంధర్!

Prema Entha Madhuram Serial Today Episode: పిల్లల్ని చంపిన వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఆఫర్ చెయ్యు అనే జలంధర్ ఛాయకి చెప్పటంతో పిల్లలకి ఏమవుతుందో అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది. 

Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో పిల్లల్ని వెతుకుతూ ఉంటారు కుటుంబ సభ్యులందరూ.

యాదగిరి: తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి పిల్లల ఫోటో సెండ్ చేస్తాడు. పిల్లలు దొరికితే వెంటనే ఫోన్ చేయమని చెప్పి ఫోన్ పెట్టేసి పిల్లలు ఎక్కడికి పోయారు ఏంటో అని బాధపడతాడు.

మరోవైపు చెరో వైపు వెతకడానికి వెళ్లిన ఉష అను కలుసుకొని పిల్లలు దొరికారా అని ఒకరినొకరు అడుగుతారు. ఉష లేదు అని చెప్పడంతో అను బాగా ఏడుస్తుంది. అప్పుడే పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో అని ఆలోచన వస్తుంది అను కి

అను: ఉష ఆరోజు మన ఇంటికి ఒక స్వామి వచ్చారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో ఒకసారి వెళ్దాం పద అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి లోపల పిల్లలు వున్నారు ఏమో వెళ్లి అడుగు అని అంటుంది.

ఉష: ఇది వాళ్ళ ఇల్లు అని మీకు ఎలా తెలుసు అయినా పిల్లలు ఇక్కడికి ఎందుకు వస్తారు మీరు కూడా లోపలికి రండి ఇద్దరం వెళ్లి అడుగుదాము అంటుంది.

అను: కంగారుపడుతూ వద్దు పిల్లలు కనిపించట్లేదంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు నువ్వే ఎలాగో వెళ్లి మేనేజ్ చెయ్యు అని చెప్పటంతో ఉష సుబ్బు వాళ్ళ ఇంట్లోకి వెళ్లి పిల్లలు ఏమైనా వచ్చారా అని అడుగుతుంది.

సుబ్బు: రాలేదమ్మా ఏమైంది అనే కంగారు పడతాడు.

ఉష : ఇదేంటి వీళ్ళు ఇంత కంగారు పడుతున్నారు ఎలా అయినా మేనేజ్ చేయాలి అనుకొని ట్యూషన్ అయిపోయాక గుడికి వెళ్తానన్నారు అక్కడ ఉన్నారేమో నేను చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది.

బయటికి వచ్చిన ఉష పిల్లలు ఇంట్లో లేరు అని చెప్పడంతో బాగా ఏడుస్తుంది అను.

మరోవైపు పెళ్లి కార్డులు తీసుకొని ఇంటికి వస్తాడు హరీష్.

హరీష్: ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవేమి, మన పెళ్లి కార్డులు వచ్చాయి అని చెప్పి పెళ్లి కార్డు దివ్య చేతిలో పెడతాడు.

దివ్య: కంగారులో ఉన్నాను చూసుకోలేదు అని చెప్పి పిల్లలు బయటికి వెళ్లిపోయిన సంగతి చెప్తుంది.

ఇంతలో సుగుణ కంగారుగా బయటికి వెళ్లడంతో చిరాకు పడతాడు హరీష్. నేను ఇంత ఆనందంగా పెళ్లి కార్డులు తీసుకు వస్తే మీ అమ్మగారు అలా వెళ్లిపోవడం ఏంటి అయినా బయటి వాళ్ల కోసం ఎందుకు అంత తపన. ఈ హడావిడి చూస్తే మన పెళ్లి ఆగిపోతుందేమో అని భయం వేస్తుంది అంటాడు.

సుగుణ: లోపలికి వచ్చి పిల్లలనుకొని బయటికి వెళ్లాను బాబు. దివ్య.. నువ్వు హరీష్ కలిసి పిల్లల్ని వెతకడానికి వెళ్ళండి అని చెప్తుంది.

దివ్య: వాళ్ల కోసం మమ్మల్ని రోడ్డు మీద పడి తిరగమంటావా, నీకు ఎప్పుడూ కొడుకు మీదే ధ్యాస నీ పద్ధతి చూస్తే మా పెళ్లి చెడగొట్టేలాగా ఉన్నావు అంటూ తల్లిని తప్పుపడుతుంది.

సుగుణ : నేనెందుకు మీ పెళ్లి చెడగొడతాను పిల్లలు బయటికి వెళ్లిపోయారని కంగారులో ఉన్నాను అని చెప్పి పెళ్లి కార్డు దేవుడి దగ్గర పెట్టమని జ్యోతి కి చెప్తుంది.

జ్యోతి ఇచ్చిన కాఫీ తాగి హరీష్ కంగారుగా బయటికి వెళ్లిపోతాడు జరిగిందంతా మాన్సీ వాళ్ళకి చెప్తాడు.

జలంధర్: మనవాళ్ళకి ఫోన్ చెయ్యు పిల్లల్ని డైరెక్టుగా లేపేయమను. ఎక్కడా మిస్ కాకూడదు. ఎవరు చంపితే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పు అని ఛాయకి చెప్తాడు.

ఛాయా తన మనుషులకి ఫోన్ చేస్తుంది. మరోవైపు ఆర్య, యాదగిరి కలుసుకుంటారు పిల్లలు ఎక్కడ కనిపించలేదు పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటాడు యాదగిరి.

ఆర్య : జెండేకి చెప్పాను జెండే ఆ పని మీదే ఉన్నాడు. మాల వేసుకున్నారు కదా గుడికి వెళ్ళారేమో చూద్దాము అని అక్కడికి బయలుదేరుతారు.

అక్కి: కాళ్లు నొప్పి పుడుతున్నాయి నేను నడవలేను అనటంతో ఇద్దరూ బెంచి మీద కూర్చుంటారు. ఆకలిగా ఉంది. ఈరోజు పూజ కూడా చేయలేదు అంటుంది.

అభయ్ : పద ఇక్కడ గుడిలో కూర్చుందాము. దేవుడు మన ఆకలి తీరుస్తాడు అని చెప్పి గుడిలోకి వెళ్ళిపోతారు. వాళ్లకి ఒకవైపు ఆర్య మరొకవైపు అను కనిపించడంతో వాళ్లకి దొరికిపోతామేమో అని కంగారు పడతారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: కాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget