Prema Entha Madhuram Serial January 24th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: తీవ్రమైన ఫ్రస్టేషన్‌లో మాన్సీ, పిల్లలకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన అను
Prema Entha Madhuram Serial Today Episode: అనుని రోడ్డు మీద అడుక్కోవటం చూసిన పిల్లలు ఆవేదనతో కన్నీరు పెట్టుకోవడంతో కథలో కీలక మలుపులు ఏర్పడతాయి.
Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో అను ని చూసిన సుగుణ షాక్ అవుతుంది.
సుగుణ: ఏంటమ్మా ఇది, మేము నిన్ను మా మనిషిగా అనుకున్నాము నీ కష్టాన్ని కనీసం మాతో చెప్పుకోవాలని కూడా అనిపించలేదా అని బాధపడుతుంది.జ్యోతి కూడా అనుని నిలదీస్తుంది.
యాదగిరి: జ్యోతిని మందలించి ఏ కారణం లేకుండా ఆవిడ ఇలా చేయరు అని అనుని వెనకేసుకొస్తాడు.
అను : నన్ను ఏమి అడక్కండి అంటీ, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను ఏదో కారణం లేకుండా ఏ పని చేయనని మీరు నమ్ముతున్నారు కదా అందుకే చెప్తున్నాను దయచేసి వెళ్ళిపోండి అంటుంది.
సుగుణ: కానీ నిన్ను ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది అంటుంది.
యాదగిరి: ఆవిడని ఇబ్బంది పెట్టకండి పదండి వెళ్ళిపోదాం అంటాడు. అప్పుడు సుగుణ అనుపళ్లెంలో డబ్బులు వేసి వచ్చేస్తుంది.
యాదగిరి: రెండు మెట్లు దిగి మళ్ళీ వెనక్కి వెళ్లి ఇదంతా ఏంటమ్మా కనీసం నాకైనా చెప్పండి అని అడుగుతాడు.
అను : అతనికి కూడా ఏమీ చెప్పకుండా దయచేసి వెళ్ళిపోండి అని మాత్రం చెప్తుంది. యాదగిరి ఆమెకు బిచ్చం వేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు.
యాదగిరి: చూడబోతే ఏదో మొక్కు లాగా ఉంది ఇంట్లో ఎవరికీ చెప్పకండి ఆమె నమ్మకానికి విలువిద్దాం అని భార్యకి అత్తకి చెప్తాడు.
మరోవైపు కెనడిని కిడ్నాప్ చేసినందుకు ఆనందపడిపోతూ ఉంటారు మాన్సీ, ఛాయాదేవి. ఇంతలో కంగారుగా అక్కడికి వచ్చిన జలంధర్ ని చూసి షాక్ అవుతారు. ఏం జరిగింది అని అడుగుతారు.
జలంధర్: జరిగిందంతా చెప్తాడు.
మాన్సీ : ఫ్రస్టేషన్ తో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ కెనడి పిల్లల రూపును బట్టి తండ్రి ఫోటో గీస్తాడు ఆర్య తనే తండ్రి అని తెలుసుకుంటాడు. మరో వైపు అను పూజ చేస్తుంది ఆ దీక్ష పూర్తయితే అనుకున్నది నెరవేరుతుంది అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పోతే వాళ్ళని మరెవరూ విడదీయలేరు అని కంగారు పడిపోతుంది.
జలంధర్: అయితే దీక్షను భగ్నం చేద్దాం అంటాడు.
ఛాయాదేవి: మాన్సీ ని కంగారు పడొద్దు అని చెప్పి ఆఫీసులో నీ మనిషికి ఫోన్ చేసి అక్కడ జరుగుతున్నది ఎప్పటికప్పుడు చెప్పమను అని చెప్తుంది. అలాగే చేస్తుంది మాన్సీ.
మరోవైపు ఆర్య, కెనడీ వాళ్లు ఆఫీస్ కి వస్తారు. కెనడీకి విషయం అంత చెప్తాడు ఆర్య.
మరోవైపు అక్కి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అన్నయ్య అని అభయ్ తో అంటుంది.
అభయ్ : తెలుసు, అతనితో ఏజెస్ వైస్ గా మన ఫోటోలు గీయిస్తారు అప్పుడు మన ఫాదర్ ఎవరో తెలుస్తుంది అంటాడు.
అక్కి : పోనీలే ఈ విధంగా అయినా మన నాన్న తనే అని తెలుసుకుంటారు అంటుంది. మరోవైపు
కెనడి : ఈ టాస్కు నేను మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తాను నాకు కొన్ని యాంగిల్స్ లో పిల్లల ఫోటోలు కావాలి అని చెప్పి పిల్లల ఫోటోలు తీసుకుంటాడు.
పని అంతా పూర్తయిన తర్వాత బయటికి వచ్చిన ఆర్య నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పి ఇక మేము బయలుదేరుతాము అని చెప్తాడు.
పిల్లలు కూడా జెండే కి బాయ్ చెప్పి నీరజ్ కి మాత్రం బాబాయ్ బాయ్ అని చెప్తారు.
బాగా ఎమోషనల్ అవుతాడు నీరజ్. బాబాయా అని అంటాడు.
పిల్లలు: అవును, మా నాన్నకి తమ్ముడివి అయితే మాకు బాబాయ్ వే కదా ఏం అలా పిలవద్దా అని అడుగుతారు.
నీరజ్ : పిల్లలిద్దర్నీ హత్తుకొని ఎమోషనల్ అవుతాడు బాబాయ్ అనే పిలవండి అని చెప్తాడు.
ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కారులో ఇంటికి వస్తున్న పిల్లల ఇద్దరికీ అడుక్కుంటున్న అను కనిపిస్తుంది.
పిల్లలిద్దరూ తల్లి దగ్గరికి వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏడుస్తూ నిలదీస్తారు.
అను : నేను ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటుంది.
పిల్లలిద్దరూ అమ్మ అని వెళ్లడంతో పిల్లల వెనకే ఆర్య కూడా వస్తాడు.
పిల్లలు: నిన్ను ఇలా చూస్తుంటే మాకు ఏడుపు వస్తుంది నిన్ను ఇలా వదిలేసి మేము వెళ్ళలేము అంటారు. ముసుగులో ఉన్న ఆమె అడుక్కోవడం చూసి షాక్ అవుతాడు ఆర్య. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also read: మీరు పెళ్లికి సిద్ధమయ్యే ముందు మీ కాబోయే భార్యని లేదా భర్తని కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలు ఇవే