అన్వేషించండి

Prema Entha Madhuram Serial January 23rd: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: జలంధర్ ఎత్తుని చిత్తు చేసిన ఆర్య, సుగుణకి అడ్డంగా దొరికిపోయిన అను

Prema Entha Madhuram Serial Today Episode: అను గుడిమెట్ల మీద అడుక్కోవడం చూసిన సుగుణ ఒక్కసారి గా షాక్ అవుతుంది. దాంతో సుగుణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.

Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ఏడుస్తున్న తల్లిని ఓదారుస్తారు అక్కి, అభయ్.

పిల్లలు: నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మాకు తెలుసు కానీ దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడని చెప్తావు కదా అందుకే ఈ పెళ్లి చేసుకో అమ్మ. మనం నలుగురం హ్యాపీగా ఉండొచ్చు అంటారు.

సరే అని చెప్పి పిల్లల్ని పడుకోబెడుతుంది అను మనసులో మాత్రం నేను ఏం చేసినా మీ సంతోషం కోసం ఆయన క్షేమం కోసమే చేస్తాను. ఈ పెళ్లి వలన ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటే అంతే చాలు అంతా దేవుడి దయ అనుకుంటుంది.

మరుసటి రోజు పొద్దున్నే  నీరజ్ ఆర్య కి ఫోన్ చేసి కెనడీ ల్యాండ్ అయిపోతున్నాడు అని చెప్తాడు.

ఈ మాటలు నీరజ్ ఆఫీసులో ఉన్న వ్యక్తి ఒకడు విని మాన్సీ కి చేరవేస్తాడు. ఈ విషయాన్ని జలంధర్ కి చేరవేస్తారు మాన్సీ వాళ్ళు.

ఆర్య: కెనడీ చేత స్కెచ్ వేయించి పిల్లల తండ్రిని కనిపెట్టేయొచ్చు అనుకుని పిల్లల్ని పిలుస్తాడు బయటికి వెళ్దాం అని చెప్పి బయటికి వచ్చేసరికి అక్కడ సుగుణ కనిపిస్తుంది.

సుగుణ: పెళ్లి పనులు పెట్టుకొని ఇప్పుడు ఎక్కడికి అని అడుగుతుంది.

ఆర్య పెళ్లి కార్డులు ప్రింట్ అయ్యాయో లేదో చూసి వస్తాను అంటాడు. పిల్లలు ఎందుకు అని సుగుణ అడిగితే బోర్ కొడుతుందంట అందుకే తీసుకువెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు ఎయిర్ పోర్ట్ దగ్గర ఉన్న ఆర్య కార్ డ్రైవర్ ని కొట్టి తన డ్రైవర్ని ఆ ప్లేస్ లో పెడతాడు జలంధర్. ఫ్లైట్ దిగి వచ్చిన కెనడిని పరిచయం చేసుకొని ఆర్య వర్ధన్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చాను అని చెప్పి తన కారులో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తాడు.

ఛాయాదేవి : అతడిని పట్టుకున్నావా అని అడుగుతుంది.

జలంధర్: నా కార్ లోనే ఉన్నాడు వాడు ట్రాప్ అయ్యాడు అని తెలిస్తే తెల్ల ముఖం వేస్తాడేమో తెల్లోడు అని  నవ్వుతాడు.

మాన్సీ : ఎట్టి పరిస్థితుల్లోనూ అతను మా బ్రో ఇన్ లా ని కలవకూడదు అంటుంది.

జలంధర్: అదంతా నేను చూసుకుంటాను అని చెప్తాడు ఇంతలో కారు డ్రైవర్ రాంగ్ డైవర్షన్ తీసుకోవడంతో షాకవుతాడు. నువ్వు గూగుల్ మ్యాప్ ని ఫాలో అవుతున్నావా రాంగ్ రూట్ లో తీసుకు వెళ్తున్నావు అంటాడు. 

డ్రైవర్: కాదు నేను మా గురువుగారిని ఫాలో అవుతున్నాను అని చెప్పి కారుని ఆపుతాడు. అక్కడ ఆర్య పిల్లల్ని చూసి షాక్ అవుతాడు జలంధర్. విషయం అర్థం చేసుకున్న కెనడీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే అతడిని పట్టుకొని పీక మీద గన్ పెట్టి బెదిరిస్తాడు.

ఆర్య జలంధర్ దగ్గర గన్ లాక్కొని తిరిగి జలంధర్ కే గురిపెట్టి ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోతావు నీకు బోర్ కొట్టడం లేదా అని చెప్పి బెదిరించి పంపించేస్తాడు.

మరోవైపు గుడికి వచ్చిన సుగుణ మెట్టెలు,నల్లపూసలు అవి దేవుడి దగ్గర పెట్టి పూజ చేయిస్తుంది. తర్వాత ప్రసాదం తింటున్నప్పుడు జ్యోతి పరధ్యానంగా ఉండడం గమనిస్తాడు యాదగిరి. ఏం జరిగింది అని అడుగుతాడు.

జ్యోతి: నాకు రాధ గారిని చూస్తే అనుమానంగా ఉంది నిన్న ఆవిడ గుడి దగ్గర ముష్టి ఎత్తుకుంటుంది అన్నప్పుడు రాధ ముఖంలో కలవరపాటు చూశాను. నిన్న పొద్దున్న పాత చీరలు మూట కట్టుకోవడం చూసాను  అంటుంది.

యాదగిరి: ఆవిడకి ఏం కర్మ పట్టింది ముష్టెత్తుకోటానికి అని జ్యోతి మాటలు లైట్ తీసుకుంటారు అత్త, అల్లుడు.

కింద కూర్చొని ప్రసాదాలు తింటున్న సుగుణ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవటానికి లెగుస్తున్న సమయంలో ఒడిలో ఉన్న కాలిమెట్టె దొర్లి కింద పడిపోతుంది అది తిన్నగా వెళ్లి బిచ్చమెత్తుకుంటున్న అను దగ్గరికి వెళ్లి ఆగుతుంది.

సుగుణ పరిగెత్తుకుంటూ వచ్చి అది నాదేనమ్మ అని చెప్పి మెట్టె తీసుకుంటూ అను ముఖంలోకి చూసి షాక్ అవుతుంది. అను కూడా సుగుణను చూసి షాక్ అవుతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: హృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Jagadhatri Serial Today August 4th: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
జగద్ధాత్రి సీరియల్: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Embed widget