అన్వేషించండి

Prema Entha Madhuram Serial January 19th - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: పిల్లల తండ్రిని వెతికే ప్రయత్నాన్ని ముమ్మరం చేసిన ఆర్య, బిచ్చగత్తె అవతారంలో అను

Prema Entha Madhuram Serial Today Episode: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పిల్లల రూపురేఖలు తెలుసుకునే  ప్రయత్నంలో ఉంటాడు ఆర్య. ఆపై కధ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠత ఏర్పడుతుంది

Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో గురువుగారు  బిక్షాటన దీక్ష తీసుకోమని అనుకి చెప్తారు.

అను: ఈ దీక్షని నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తిని ప్రసాదించమని వేడుకుంటుంది.

గురువుగారు: ఒక నాణెం ఆమెకి ఇచ్చి ఇది నిలబెట్టు నీ పని జయం అవుతుంది అని చెప్పటంతో అను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రెండు దారులు ఒకే గమ్యం వైపు పయనిస్తున్నాయి అంతా ఈశ్వరేచ్ఛ అనుకుంటారు గురువుగారు.

తర్వాత ఆర్య దంపతులిద్దరూ నాణాన్ని నిలబెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత గురువుగారి మాటలకు గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆర్య.

ఆర్య: ఆయన నాకు ఏదో చెప్పాలని చూసారు కానీ నాకే అర్థం కాలేదు. వెతికే బంధానికి రూపురేఖలే ఆధారం అన్నారు అంటే అర్థం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక ఐడియా వస్తుంది వెంటనే నీరజ్ కి ఫోన్ చేసి నువ్వు జెండే ఒకసారి నన్ను కలవండి అని చెప్తాడు.

తర్వాత ఆర్య, జెండే,నీరజ్ ముగ్గురు కలుస్తారు.

ఆర్య: గురువుగారు చెప్పింది అంతా చెప్పి ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్ ద్వార  పిల్లల రూపురేఖలు గీస్తే అసలు విషయం తెలుస్తుంది అందుకే మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉన్నారో సెర్చ్ చేయండి అని చెప్తాడు. ఆపై జెండే  పిల్లల డిఎన్ఏ టెస్ట్ ఏమైంది అని అడుగుతాడు.

జెండే: ఆ హాస్పిటల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల మొత్తం శాంపిల్స్ అన్ని పోయాయంట మళ్లీ కొత్తగా శాంపిల్స్ కావాలంటున్నారు అని చెప్తాడు.

ఆర్య: నువ్వు హాస్పిటల్ కి వెళ్లి ఆ ఆరేంజ్మెంట్స్ అన్నీ చూడు ఈ లోపు పిల్లల్ని తీసుకొని నేను అక్కడికి వస్తాను అంటాడు.

ఇంతలో నీరజ్ గూగుల్ లో సెర్చ్ చేసి యూకే లో ఉన్న మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసిన వ్యక్తిని కనుక్కుంటాడు. అదే విషయం ఆర్య కి చెప్తాడు.

ఆర్య: అతడిని కాంటాక్ట్ అవ్వు, ఇండియాకు రప్పించు అవసరమైతే చార్టెడ్ ఫ్లైట్ అరేంజ్ చెయ్యు అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు.

మరోవైపు అను బిక్షం ఎత్తటానికి సిద్ధమవుతుంది. భగవంతుడు దగ్గరికి వచ్చి నా పిల్లల కోసం ఈ దీక్ష ప్రారంభించాను నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తిని ప్రసాదించమని వేడుకుని గుడిమెట్ల మీద కూర్చుంటుంది.

అప్పుడే సుబ్బు ఆలయానికి వచ్చి అను గురించి దండం పెట్టుకుంటుంది. త్వరలోనే కూతురు మనసు మార్చి వాళ్ళని కలిసేలాగా చేయమని ప్రార్థిస్తుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతూ అక్కడ బిక్షాటన చేసే వాళ్ళందరికీ అరటిపండు ప్రసాదం పెట్టి వెళ్ళిపోతుంది. తల్లిని ముందే గమనించిన అను తలపై ముసుగేసుకుంటుంది.

అను: నా దీక్ష నా తల్లి చేతి ప్రసాదంతోనే ప్రారంభించారు అని భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది

మరోవైపు ఆర్య ఇంటికి వచ్చి పిల్లలు ఏరి అని అడుగుతాడు.

పిల్లలు దాక్కొని చెప్పొద్దు అంటూ ఉషకి చెప్పడంతో ఉష నాకు తెలియదు అని తన అన్నకి చెప్తుంది.

ఆర్య: రాధ గారేరి అని అడుగుతాడు.

ఉష ఎందుకు అన్నయ్య అని అడుగుతుంది.

ఆర్య : పిల్లల్ని బయటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అందుకే ఆవిడకి ఒక మాట చెబుదామని అంటాడు.

 ఆ మాటలు విన్న పిల్లలు గెంతుకుంటూ ఆర్య దగ్గరకు వస్తారు.అప్పుడే అక్కడికి వచ్చిన సుగుణ ఇంకా తన పర్మిషన్ ఎందుకు వీళ్ళు ఎప్పుడో నీ పిల్లలు అయిపోయారు తీసుకొని వెళ్ళు అని చెప్తుంది అలాగే పెళ్లి సమయం దగ్గర పడుతుంది ఎలాంటి లోటు జరగకుండా చూసుకో అని చెప్తుంది.

ఆర్య:  నువ్వేమీ కంగారు పడకు వియ్యంకుల దగ్గర నుంచి నీకు మాట రానివ్వను అని చెప్పి పిల్లలను తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు మాన్సీ,ఛాయాదేవి కారులో వెళ్తుంటారు.

ఛాయాదేవి: ఆర్య, అను ఇద్దరూ పెళ్ళికి ఒప్పుకున్నాక కూడా ఎందుకు అను బయటపడటం లేదు అని అంటుంది.

మాన్సీ : అంటే ఏంటి వాళ్ళిద్దరూ కలిసిపోవాలని అనుకుంటున్నారా అని అడుగుతుంది.

ఛాయాదేవి : అలా కాదు వాళ్ళిద్దరూ పెళ్లిని ఆపటానికి మరో విధంగా ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది అంటుంది. 

మరోవైపు చాలాసేపటి వరకు  అను పళ్ళెంలో బిక్ష పడకపోతే  మొదటి రోజే నా దీక్ష భగ్నం అయ్యేలాగా ఉంది అని బాధపడుతుంది. ఇంతలో ఒక పాప వచ్చి ఇది నా పాకెట్ మనీ ఉంచుకొని చెప్పి ఆమె పళ్ళెంలో డబ్బు వేస్తుంది.

అను : నా పిల్లల కోసం ప్రారంభించిన దీక్ష ఇది అందుకే ఒక పాప తోనే మొదటి బిక్ష యిప్పించావు అని భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Upcoming Smartphones in December: డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
BCCI: బీసీసీఐతో పెట్టుకుంటే అట్లుంటది, ప్రపంచ క్రికెట్ నే శాసిస్తున్న భారత్
బీసీసీఐతో పెట్టుకుంటే అట్లుంటది, ప్రపంచ క్రికెట్ నే శాసిస్తున్న భారత్
Embed widget