Prema Entha Madhuram Serial January 17th - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: అసూయతో రగిలిపోతున్న మాన్సీ, ఆర్య ఇంట్లో అడుగుపెట్టిన ఘోర
Prema Entha Madhuram Serial Today Episode: పిల్లల కోసం వచ్చిన ఘోర ఆర్య ఇంట్లో అడుగుపెట్టడంతో పిల్లల్ని ఏం చేస్తాడో అనే ఉత్కంఠతో కథలో ఏర్పడుతుంది.
Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ఇక్కడ మెయిన్ పెళ్లి మాది, మాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి అంటుంది దివ్య. అలా మాట్లాడకూడదు అని మందలిస్తుంది సుగుణ.
అను: వాళ్లని ముందు పెట్టుకోనివ్వండి ఆంటీ ఈలోపు నేను అక్కికి, అంజలికి గోరింటాకు పెడతాను అంటూ అంజలికి గోరింటాకు పెడుతుంది.
అంజలికి తన తల్లి గుర్తు రావటంతో బాగా ఎమోషనల్ అవుతుంది.
యాదగిరి: హరీష్ ని చూస్తూ గోరింటాకు ముగ్గులా
బాగా పెట్టావు కోబ్రా. నీకు మనుషుల్ని ముగ్గులోకి దించడం బాగా అలవాటు అనుకుంటాను అంటాడు. అందుకు సీరియస్ గా చూస్తాడు హరీష్.
సుగుణ: టాపిక్ మార్చేస్తూ సూర్య ఇప్పుడు నువ్వు రాధ కి గోరింటాకు పెట్టు అనటం తో చాలా ఇబ్బంది పడుతూ అనుకి గోరింటాకు పెడతాడు ఆర్య.
అను: మీ మనసులో ఉన్న నన్ను దూరం చేసుకోలేక దగ్గరగా ఉన్న నన్ను గుర్తించలేక మీరు పడుతున్న ఇబ్బంది నాకు అర్థం అవుతుంది నేను కూడా అదే బాధని అనుభవిస్తున్నాను అనుకుంటుంది.
హరీష్ ఈ హ్యాపీ మూమెంట్ ని సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి దివ్యతో సెల్ఫీ దిగుతాడు. యాదగిరి కూడా వాళ్ల జంటకి ఫోటో తీయమంటాడు. అలాగే ఆర్య, అనుకి కూడా ఫోటో తీస్తాడు హరీష్. అయితే ఆ ఫోటోని మాన్సీ కి పంపిస్తాడు.
మాన్సీ : కోపంతో రగిలిపోతూ ఫోన్ ని విసిరేయాలనుకుంటుంది. అప్పుడే అక్కడికి ఛాయాదేవి, జలంధర్ వస్తారు ఏం జరిగింది అని అడుగుతారు. కష్టపడి వాళ్ళిద్దర్నీ విడదీశాను. అను మనసులో భయం నిండిపోవడం వలన ఇన్ని రోజులు బ్రో ఇన్ లా కి దూరంగా ఉంది కానీ వాళ్లు ఇప్పుడు కలిసిపోతున్నారు. నాకు లేని సంతోషం అనుకి ఉండకూడదు ఏమైనా చేయాలి అని ఆవేశంగా ఉంటుంది.
ఛాయాదేవి : నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పీఠల వరకు తీసుకువచ్చి మోసం చేశాడు ఆర్య. వాడు సుఖంగా ఉండకూడదు అంటుంది.
మాన్సీ : అసలు ఇదంతా జోగమ్మ వలనే.కన్ఫ్యూషన్ లో ఉన్న అను కి నీకు అంతా మంచే జరుగుతుంది అని పాజిటివ్ హోప్స్ పెంచేసింది. అందుకే అను పెళ్లికి ఒప్పుకుంది అంటుంది.
జలంధర్: అయితే ఆ జోగమ్మని పెద్దమ్మ తల్లి దగ్గరికి పంపించేద్దాం అంటాడు.
మాన్సీ :అవును జోగమ్మని చంపేయాలి అంటుంది.
మరోవైపు గోరింటాకు పండిన చేతుల్ని పిల్లలు అనుకి చూపిస్తారు. బాగా పండింది అంటుంది అను. ఆర్యకి కూడా చూపిస్తే చాలా బాగుంది అంటాడు. అను చేతులు కూడా చాలా బాగా పండుతాయి. అప్పుడు ఉష తన చేతులు చూపించి ఆపై ఆ అన్నయ్య నీ చేతులు కూడా చూపించు అంటుంది. తన చేతుల్ని చూపిస్తాడు ఆర్య.
ఉష : మా అన్నయ్యకి వదిన అంటే చాలా ఇష్టం అందుకే ఇంత బాగా పండింది అంటుంది.
సుగుణ : నాకు తెలుసు వాళ్ళ చేతిలో లాగే వాళ్ల కాపురం కూడా పండుతుంది అని ఆనందంగా చెప్తుంది.
ఉష యాదగిరి చేతుల్ని చూపించమంటుంది. యాదగిరి చేతులు సరిగ్గా పండవు.
యాదగిరి: నేనంటే నీకు ఎంత ఇష్టమో అర్థం అవుతుంది ఏంటి ఈ పండటం అని అంటాడు.
జ్యోతి: ఇలా పెడితే అలా తీసేసారు ఎలా పండుతుంది. ఇంకాసేపు ఉంచితే పండేదేమో అంతేగాని నా ప్రేమని అవమానించొద్దు నా చేతులు కూడా అంతంత మాత్రమే పండాయి అంటే మీకు నా మీద ప్రేమ లేదా అంటుంది.
యాదగిరి: మా సంగతి సరేగాని దివ్య చేతులు ఎలా పండాయి అంటాడు. ఆ చేతులు అస్సలు పండవు. అప్పుడు యాదగిరి ఏంటి కోబ్రా ఇది. మేము కనీసం సంవత్సరమైనా కలిసి కాపురం చేశాను అసలు మీరు పెళ్లి పీటల వరకు అయినా వెళ్తారా అని అంటాడు.
ఆ మాటలకి కంగారుపడుతుంది సుగుణ. అలా మాట్లాడకూడదు అంటూ యాదగిరిని మందలిస్తుంది.
ఆర్య: గోరింటాకు శరీర తత్వాన్ని బట్టి పండుతాయి అమ్మ దానికోసం నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు అని సుగుణకి చెప్తాడు.
దివ్య: అలాగే చెప్తావులే, నీ కాబోయే భార్య చేతులు మాత్రం ఎర్రగా పండాయి కదా అని నిష్టూరంగా మాట్లాడుతుంది.
అలా మాట్లాడొద్దు అంటూ దివ్యని మందలిస్తుంది సుగుణ. ఆపై భోజనాలు ఏర్పాట్లు చూడమని యాదగిరికి చెప్తుంది. యాదగిరి, ఆర్య అక్కడ నుంచి భోజనాల ఏర్పాట్లు చూడటం కోసం వెళ్ళిపోతారు.
హరీష్ ఈలోపు మనం డాన్స్ చేసే ఎంజాయ్ చేద్దాం అనటంతో పిల్లలందరూ డాన్స్ చేస్తారు అప్పుడే ఘోర ఆ ఇంట్లో అడుగు పెడతాడు. పిల్లలందరూ ఒక్కసారి గా షాక్ అవుతారు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: కంగువా కథలో ట్విస్ట్ - సెకండ్ లుక్‌తో కాన్సెప్ట్ రివీల్ చేశారుగా