అన్వేషించండి

Prema Entha Madhuram Serial January 16th - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఏం జరుగుతుందో అని భయపడుతున్న ఆర్య.. పిల్లలని బంధించటానికి బయలుదేరిన ఘోర!

Prema Entha Madhuram Serial Today Episode: పిల్లలు రక్షణ వలయం దాటి బయటికి వెళ్లారని తెలుసుకున్న ఘోర వాళ్ళని బంధించడానికి బయలుదేరడంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి.

Prema Entha Madhuram Serial Today Episode: ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏడుస్తున్న అక్కి దగ్గరకి వచ్చి అందరూ బుజ్జగిస్తారు.అక్కి ఎంతకీ నవ్వకపోవడంతో ఆమెని నవ్వించడం కోసం పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయత్నిస్తారు. కానీ అక్కి ఎంతకీ నవ్వదు.

ఆర్య, యాదగిరి కూడా అక్కడికి వస్తారు. యాదగిరి కూడా అక్కిని నవ్వించడానికి ప్రయత్నాలు చేస్తాడు కానీ వర్క్ అవుట్ అవ్వదు.

ఉష: అన్నయ్య ఇక మావల్ల అయ్యే పని కాదు నువ్వే రంగంలోకి దిగాలి అంటుంది.

ఆర్య : అక్కి దగ్గరికి వచ్చి నా ఫ్రెండ్ ఏడిస్తే నేను చూడలేను ఏడవద్దు అని చెప్తాడు అయినా ఏడుస్తున్న అక్కకి చాక్లెట్ చూపించి నీకు ఈ చాక్లెట్ ఇష్టము కదా అని ఇస్తాడు కానీ ఆమె తీసుకోదు అయితే నేనే తినేస్తాను అని చెప్పే దాన్ని ఓపెన్ చేస్తాడు. వెంటనే అక్కి వచ్చి ఆర్య ని హగ్ చేసుకుంటుంది.

అక్కి : ఏడుస్తూ నేను చాక్లెట్ కోసం హాగ్ చేసుకోలేదు నీకోసమే హాగ్ చేసుకున్నాను నాన్న. నువ్వు నా దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటుంది మమ్మల్ని వదిలి వెళ్ళిపోవద్దు అని ఏడుస్తుంది. అభయ్ కూడా ఆర్యని అక్కిని హగ్ చేసుకుంటాడు.

ఆర్య: మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అని వాళ్ళకి ధైర్యం చెప్తాడు ఆపై అక్కిని నవ్విస్తాడు.

పిల్లలు: మేము నవ్వమంటే నవ్వలేదు కానీ మీ నాన్న చెప్తే నవ్వేస్తావా నీ పని చెప్తాం ఉండు అనేసరికి అక్కడి నుంచి అంజు పరిగెడుతుంది ఆమెని వెంబడిస్తారు మిగిలిన పిల్లలు.

ఆర్య: యాదగిరి కళ్ళల్లో కన్నీరు చూస్తాడు ఏమైంది అని అడుగుతాడు.

యాదగిరి: ఆ పిల్లలు మీ మీద పెంచుకుంటున్న ప్రేమను చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ పెళ్లి చేసుకుంటే అను మేడంకి అన్యాయం జరుగుతుందని మీరు భావించకండి అంతా మంచే జరుగుతుంది అని చెప్తాడు.

ఆర్య : బాధతో కన్నీరు పెట్టుకుంటాడు. ఈ పిల్లలు నా మీద పెంచుకుంటున్న ప్రేమని చూస్తే భయం వేస్తుంది రేపు వీళ్ళకి నేను దూరమైపోతే ఏమైపోతారో అని బాధగా ఉంది. పెళ్లి సమయానికల్లా వాళ్ళ నాన్నగారిని తీసుకురాకపోతే నా పరిస్థితి ఏమిటా అని ఆందోళనగా ఉంది అని చెప్పి బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు ఘోర అరుంధతి వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక్కడ పిల్లల వాసన లేదేమిటి అని దివ్య దృష్టితో చూసి పిల్లలు అక్కడ లేరని తెలుసుకుంటాడు. ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకొని రక్షణ వలయం దాటి బయటికి వచ్చారు మిమ్మల్ని వశీకరించుకోవడం సులభమైన పని. మిమ్మల్ని వెతుక్కుంటూ ఆత్మ అదే వస్తుంది అనుకుంటూ పిల్లల్ని బంధించడానికి బయలుదేరుతాడు.

మరోవైపు మెహందీ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

సుగుణ: పెళ్లి కూతురికి మొదటిసారిగా ఆమె కాబోయే భర్త మెహిందీ పెట్టాలి అంటుంది.

హరీష్ నాకు పెట్టడం రాదు అనడంతో గూగుల్ మ్యాప్ ని చూసి ఫాలో అయిపో అని సలహా ఇస్తాడు యాదగిరి.

ఆ మాటలకి అందరూ నవ్వుతారు.

ఉష : ఎవరు పెట్టిన గోరింటాకు ఎక్కువ పండితే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు ఉంటుంది. సీనియర్ జంట కాబట్టి మీరు ప్రారంభించండి అని యాదగిరి తో చెప్తుంది.

యాదగిరి: ఎప్పుడు నాకు నీ మీద ప్రేమ లేదు అని గొడవ పడతావు కదా ఇప్పుడు నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో చూస్తాను నాకు గోరింటాకు పెట్టు అని అంటాడు.

జ్యోతి: అయిపోయిన పెళ్ళికి భాజలు అంటే ఇవే అంటూ భర్తకి గోరింటాకు పెడుతుంది.

తిరిగి యాదగిరిని జ్యోతి కి మెహందీ పెట్టమంటే చేతబడి చేసే ముగ్గు లాగా పెట్టడంతో చివాట్లు పెడుతుంది భార్య.

ఆపై ఆర్య ని అనుకి మెహందీ పెట్టమనటంతో దివ్య కోప్పడుతుంది. ఇక్కడ మా పెళ్ళికూడా జరుగుతుంది మాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తుంది.

ఆమెని కోప్పడుతుంది సుగుణ.

అను: పెట్టనివ్వండి ఆంటీ ఈలోపు నేను అక్కి కి అంజలికి మెహందీ పెడతాను అంటుంది. అందుకు సుగుణ ఒప్పుకుంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read'పుష్ప 2' to 'దేవర' - పెద్ద సినిమాలన్నీ ఆ ఓటీటీకే - ఇంకా టైటిల్ పెట్టని సినిమాలతోనూ కీలక ఒప్పందాలు, ఇదిగో లిస్ట్

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
Podarillu Serial Today August 14th: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
పొదరిల్లు: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget